ADVERTISEMENT
home / Dating
వీరిద్దరిదీ సమాధులు కలిపిన ప్రేమ బంధం.. ఈ వింత ప్రేమకథ మీరూ చదవండి..!

వీరిద్దరిదీ సమాధులు కలిపిన ప్రేమ బంధం.. ఈ వింత ప్రేమకథ మీరూ చదవండి..!

ప్రేమ.. ఎప్పుడు, ఎక్కడ పుడుతుందో ఎవరికీ తెలీదు. అలా ఒక వ్యక్తి పై పుట్టిన ప్రేమకు కారణాలు కూడా పెద్దగా అవసరం లేదు. అయితే సాధారణంగా కాలేజీలు, పార్కులు, కాఫీ షాపుల్లో ప్రారంభమయ్యే ప్రేమ కథల గురించి విన్నాం. కానీ సమాధులు , శవాల మధ్య స్మశానంలో (Graveyard) పుట్టిన ప్రేమ గురించి మీకు తెలుసా? అవును.. ఇది నిజమే. ఇంగ్లండ్‌కి చెందిన ఓ వ్యక్తి తన ప్రేమ కథను చెబుతూ.. తమ ప్రేమకు సమాధులే సాక్ష్యమని తెలిపారు. “ఒక రకంగా చెప్పాలంటే మాది సమాధులు కలిపిన ప్రేమ బంధం (Love story)” అంటూ తన లవ్ స్టోరీని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

వివరాల్లోకి వెళితే.. సిక్స్ ఫాం పోయెట్ అనే యూజర్ నేమ్‌తో పోస్టులు పెట్టే ఈ ఇంగ్లీష్ వ్యక్తి.. తన ప్రేమకథతో ట్విటర్‌లో బాగా పాపులర్ అయ్యాడు.  తన భార్యతో ప్రేమలో పడిన కాన్నుంచి.. ఆ ప్రేమకథలోని కీలకమైన అంశాలను పంచుకుంటూ ట్వీట్స్ చేసేవాడు. ఇప్పుడు ఈ ట్వీట్స్‌తో పాటు.. ఆ వ్యక్తి కూడా ట్విట్టర్‌లో పాపులర్‌గా మారిపోయాడు. ఇంతకీ తన కథేంటో అతని మాటల్లోనే విందాం రండి..

నాకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడే మా నాన్న చనిపోయారు. సస్సెక్స్‌లోని ఓ చిన్న గ్రామంలో ఆయనకు సమాధి కట్టాం. మా నాన్నంటే నాకు చాలా ఇష్టం. మేమిద్దరం చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లం. అందుకే ఆయన చనిపోయిన తర్వాత కూడా.. తరచూ ఆయన సమాధి దగ్గరికి వెళ్లేవాడిని. వెళ్లినప్పుడల్లా ఆయనకు ఇష్టమైన పూలు తీసుకెళ్లి సమాధిపై పెట్టేవాడిని.

ADVERTISEMENT

నేనే కాదు.. మా అమ్మ, మా నానమ్మ, తాతయ్యలు కూడా.. తరచూ నాన్న సమాధి వద్దకు వెళ్లి సమాధిపై పూలు ఉంచేవాళ్లు. మేమందరం తీసుకొచ్చే పూలతో ఆయన సమాధి ఓ ఫ్లవర్ షోలో ఉన్నట్లుగా కనిపించేది. ఎప్పుడూ తాజా పూలతో అందంగా కనిపించేది. ఇది నాకు ఆనందాన్ని కూడా కలిగించేది.

ఇదంతా బాగానే ఉంది. కానీ మా నాన్న పక్కన ఉన్న సమాధిని చూస్తే నాకు చాలా బాధగా అనిపించేది. అతడి సమాధిని చూసేందుకు ఎవరూ వచ్చేవారు కాదు. ఎప్పుడూ ఆయన సమాధిపై పూలు ఉండడం నేను చూడనేలేదు. అందుకే నేను నాన్న సమాధి వద్దకు వెళ్లినప్పుడల్లా.. అతడి సమాధిపైనా పూలు ఉంచేవాడిని. ఇది ఒక్కోసారి నాకే వింతగా అనిపించేది.

ఇప్పటివరకూ ఎప్పుడూ కలవని.. ఎప్పుడూ చూడని ఓ మరణించిన వ్యక్తి కోసం.. నేను పూలు కొని తన సమాధిపై ఉంచడం ఇతరులకే కాదు.. నాకూ వింతగానే అనిపించేది. కానీ ఎందుకో అతడికి నాకు ఏదో బంధం ఉందేమో అనిపించేది. ఏదో బంధం నన్ను తనవైపు లాగుతున్నట్లుగా అనిపించేది. అతడు కేవలం 37 సంవత్సరాలకే చనిపోయాడు. అది కూడా క్రిస్ మస్ పండగ రోజు. ఇది ఎవరికైనా చెబితే నన్ను వింతగా చూస్తారేమోనని ఎవరికీ చెప్పలేదు.

ADVERTISEMENT

ఇది నాతో నేను చెప్పుకునే ఓ జోక్‌లా మారిపోయింది. వెళ్లినప్పుడల్లా ఓ బొకేతో తనతో బంధాన్ని కలుపుకున్నా. చెబితే విచిత్రంగా అనిపిస్తుంది కానీ.. తనని నా మనసులో ఓ స్నేహితుడిలా వూహించుకున్నా. అలా కొంత కాలం కొనసాగిన తర్వాత తన గురించి తెలుసుకోవాలనిపించింది. మా మధ్య ఏదో సంబంధం ఉందనిపించింది. మేం ఒకే స్కూల్‌‌లో కలిసి చదువుకున్నామా లేదా ఒకే ఫుట్‌బాల్ క్లబ్‌లో ఆడామా.. ఇలా రకరకాల సంశయాలు నన్ను వెంటాడేవి. ఎందుకో తెలీదు గానీ.. తనతో నాకు ఓ చిత్రమైన బంధం ఏర్పడింది. అందుకే తన గురించి తెలుసుకోవాలనుకున్నా. గూగుల్‌లో తన గురించి వెతికాను. పది సెకన్లలో తన గురించి సమాచారం దొరికింది.

తన వివరాలు తెలుసుకొని నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అతడి భార్య ఎప్పుడూ అతడి సమాధి వద్దకు రాలేదు. ఎందుకంటే తను చనిపోయిన క్రిస్‌మస్ పండగ రోజే.. అతడు ఆమెను హత్య చేశాడు. కేవలం తన భార్యనే కాదు.. తన భార్య తల్లిదండ్రులను కూడా హత్య చేశాడు. ఆ రాత్రే బాల్కొంబే టన్నెల్ నుంచి వెళ్లే ఏకైక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకే అతడి సమాధి వద్దకు ఎవరూ రావట్లేదు. ఎవరూ పూలు తీసుకురావట్లేదు. నేను తప్ప.

ఈ విషయం తెలియకుండానే నేను.. మా నాన్న సమాధిని చూడడానికి వెళ్లినప్పుడల్లా.. తన సమాధిపై కూడా ఉంచడానికి  పూలు తీసుకెళ్లేవాడిని. అలా రెండున్నర సంవత్సరాలు చేశాను. 

కానీ ఈ కథంతా తెలిసిన తర్వాత తన భార్య, ఆమె తల్లిదండ్రులను తలచుకొని నాకు చాలా బాధగా అనిపించింది. అయితే నేను వారి సమాధి పైనా ఈ మాదిరిగా పూలు పెట్టలేను. కానీ వారికి నావైపు నుండి బాధ్యతగా ఏదైనా చేయాలని  అనిపించింది.

ADVERTISEMENT

అతడి గురించి తెలుసుకోకుండా.. తన సమాధిపై రెండున్నరేళ్లు అలా పూలు పెట్టినందుకు వారికి క్షమాపణ చెప్పాలనిపించింది. ఇదంతా కొందరికి వింతగా అనిపించచ్చు. కానీ నాకు మాత్రం నేను వారికి ద్రోహం చేసినట్లుగా అనిపించింది. అందుకే వాళ్లను ఎక్కడ సమాధి చేశారో తెలుసుకొని.. వారికోసం పూలు కొని అక్కడికి వెళ్లాను. అక్కడికి వెళ్లి వారి సమాధులపై పూలు పెట్టి వారికి నా క్షమాపణలు చెబుతుండగానే అక్కడికి ఓ అమ్మాయి వచ్చింది. తను వాళ్ల బంధువట. వాళ్ల అత్త, నానమ్మ, తాతలకు నేను క్షమాపణ ఎందుకు చెబుతున్నానో.. వారి కోసం నేను పూలు ఎందుకు తీసుకొచ్చానో.. అసలు నేనెవరో తనకు అర్థం కాలేదు. అదే విషయం తను నన్ను అడిగింది. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది.

ఇబ్బందిగా ఉన్నా సరే.. రెండున్నరేళ్ల పాటు ఎవరికీ చెప్పకుండా దాచిన నిజాన్ని తనకు చెప్పేశాను. మొత్తం వివరించిన తర్వాత తను సరేనంది. అది కాస్త వింతగా ఉన్నా.. నా ప్రవర్తన తనకు చాలా బాగా నచ్చింది. అదే విషయం తను నాకు చెప్పింది. నేను థ్యాంక్స్ చెప్పాను. మేమిద్దరం అక్కడి నుంచి తిరిగి బయటకు వస్తుండగా.. డ్రింక్ తాగడానికి రమ్మని తనని నేను అడిగాను. అలా నాతో డేట్‌కి రావడానికి ఆమె ఒప్పుకుంది. ఆపై మా ప్రేమ రెండేళ్ల పాటు కొనసాగింది. రెండేళ్ల తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటావా? అని నేను అడిగిన ప్రశ్నకు కూడా తను సరేనని చెప్పడంతో.. మా ఇద్దరి పెళ్లి కూడా జరిగింది. అలా ఆ సమాధులు మమ్మల్ని కలిపాయి. ఇప్పుడు మేమిద్దరం ఎంతో ఆనందంగా ఉన్నాం అంటూ ట్వీట్ల ద్వారా తన ప్రేమ కథను చెప్పుకొచ్చాడా వ్యక్తి.

ఇవి కూడా చదవండి. 

ADVERTISEMENT

Images : Shutterstock.

తన పుట్టినరోజున నేనిచ్చిన సర్ ప్రైజ్ చూసి.. నా బాయ్ ఫ్రెండ్ ఎలా ఫీలయ్యాడంటే..! |

ప్రేమ జీవితాంతం ఉండాలంటే.. గొడవ పెట్టుకోవాల్సిందే..!

ఈ లక్షణాలుంటే మీ బాయ్ ఫ్రెండ్.. మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నట్లే..!

ADVERTISEMENT
13 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT