ADVERTISEMENT
home / Dating
రెయినీ సీజన్‌ని.. రొమాంటిక్‌గా ఎంజాయ్ చేయడం ఎలాగో తెలుసా..?

రెయినీ సీజన్‌ని.. రొమాంటిక్‌గా ఎంజాయ్ చేయడం ఎలాగో తెలుసా..?

మొన్నటి వరకూ ఎండలతో మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసిన వేసవి వెళ్లిపోయి.. చల్లని వర్షాకాలాన్ని (monsoon) మనకు అందించింది. ఇప్పుడిప్పుడే వర్షాలు (rain) కూడా ప్రారంభమైపోయాయి. మండుటెండల్లో అల్లాడిన ప్రజలకు వర్షాలు ఎంతో ఆనందాన్ని అందిస్తున్నాయి. ఇక పెళ్లైన జంటలకైతే వర్షాకాలం అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మరి, ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం.. అంటూ మీ ఇద్దరి మధ్య బంధాన్ని మరింత దగ్గర చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వర్షాకాలాన్ని రొమాంటిక్‌గా (Romantic) ఎంజాయ్ చేస్తూ.. మీ ఇద్దరినీ మరింత దగ్గర చేయడానికి ఇదే కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం రండి..

ఇంట్లోనే ఉంటూ రొమాన్స్ చేయడమెలా?

రొమాంటిక్‌గా గడపాలంటే బయటకు వెళ్లాల్సిన అవసరమే లేదు. ఇంట్లో ఉంటూనే మీకు నచ్చే పనులు చేస్తూ కూడా రొమాంటిక్‌గా గడిపే వీలుంటుంది. అదెలాగో చూద్దాం రండి..

ADVERTISEMENT

Shutterstock

క్యాండిల్ లైట్ డిన్నర్..

వర్షం పడిందంటే చాలు.. పవర్ కట్ కూడా దానికి తోడవుతుంది. ఇలాంటప్పుడు అటు వర్షంలో బయటకు వెళ్లలేం.. ఇటు ఇంట్లోనూ సంతోషంగా ఉండలేం. కానీ కాస్త రొమాంటిక్‌గా ఆలోచిస్తే చాలు.. ఇంట్లోనే ఆనందంగా గడిపే వీలుంటుంది. మీకు వంట చేసే వీలుంటే.. వంట చేసుకోవడం లేదా డెలివరీ యాప్స్ ద్వారా ఆహారాన్ని డెలివరీ తీసుకోవచ్చు. ఆ తర్వాత.. ఇల్లంతా అందమైన క్యాండిల్స్‌తో అలంకరించి మీ టేబుల్‌ని కూడా సెట్ చేయండి. ఫోన్‌లో మంచి రొమాంటిక్ మ్యూజిక్ పెట్టుకొని ఇద్దరూ ఆనందంగా భోజనం చేయండి.

ADVERTISEMENT

పుస్తకం చదవండి..

మీరిద్దరూ పుస్తక ప్రియులైతే వర్షం పడినప్పుడు పుస్తకాలు చదవడానికి చాలా చక్కటి సమయం. ఇద్దరూ వాన పడుతుండగా పక్కన బాల్కనీలో కలిసి కూర్చొని నచ్చిన స్నాక్స్ తింటూ.. పుస్తకాలు చదువుతూ సమయం గడపండి. ఇలాంటివారు రొమాంటిక్ పుస్తకాలు చదవడం వల్ల మరింత మూడ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇద్దరూ కలిసి ఎలా చదవాలి అనుకుంటున్నారా? ఒకరు చదువుతుంటే మరొకరు వినొచ్చు. లేదా ఒకరి ఒడిలో మరొకరు కూర్చొని లేదా పడుకొని ఆ పుస్తకాన్ని చదవచ్చు.

shutterstock

ADVERTISEMENT

టీ, బజ్జీలతో కూడా..

బయట వాన పడుతుంటే దాన్ని కిటికీలో లేదా బాల్కనీ నుండి చూడడం చాలామందికి ఇష్టం. అలా చూస్తూ వేడివేడిగా ఏమైనా తింటుంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఇద్దరూ ఒకరికొకరు తినిపించుకుంటూ.. ఒకరితో మరొకరు చిలిపి గిల్లికజ్జాలాడుతూ సమయం గడిపితే.. ఆ సమయం తెలియకుండానే ఆనందంగా గడిచిపోతుంది. అందుకే మీకు నచ్చిన పకోడీలు, బజ్జీలు.. అవి మరీ ఎక్కువ అనుకుంటే.. ఎయిర్ ఫ్రైడ్ చిప్స్ లేదా వేరే ఏవైనా స్నాక్స్ తింటూ సమయాన్ని గడిపేయొచ్చు. 

వంట చేసుకొని తినండి.

భార్యాభర్తలిద్దరూ భోజనప్రియులైతే అంతకంటే మంచి ఫీలింగ్ ఇంకేముంటుంది చెప్పండి? అందుకే ఇద్దరూ మీకు నచ్చిన వంటకాలన్నింటినీ వండుకొని తినండి. ఇద్దరి ఫేవరెట్ డిష్‌లు ముందే సిద్ధం చేసుకొని వాటిని ఇద్దరూ కలిసి వండండి. ఒకరు కూరగాయలు కట్ చేస్తే.. ఒకరు వంట చేయడం.. ఒకరు చట్నీ చేస్తే.. మరొకరు సాంబార్ చేయడం.. ఇలా మీకు నచ్చిన వంటకాలను పంచుకొని ఇద్దరూ మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ రొమాన్స్ చేస్తూ వండడం వల్ల మీకు బోర్ కొట్టకుండానే నచ్చిన వంటకాలు సిద్ధమైపోతాయి.

ADVERTISEMENT

shutterstock

సంగీతం వినండి..

సంగీతంలో ఎంతో పవరుంది అంటూ ఉంటారు చాలామంది. చక్కటి రొమాంటిక్ పాటలు మీ మూడ్‌ని కూడా రొమాంటిక్‌గా మార్చేందుకు తోడ్పడతాయి. అందుకే చక్కగా కిటికీ పక్కన సోఫా లేదా చాప వేసుకొని.. ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకొని వానను చూస్తూ రొమాంటిక్ పాటలను వింటూ మీరు కూడా పాడండి. దీని వల్ల మీ ఇద్దరికీ ఎప్పటికీ మిగిలిపోయే మధురానుభూతులు మిగలడంతో పాటు మీ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి.

ADVERTISEMENT

వానలో తడవండి..

మీ ఇద్దరికీ వానంటే ఇష్టం అయితే.. నీటిలో తనివితీరా తడవండి.  ఒకరిపై మరొకరు నీళ్లు జల్లుకుంటూ ఎంజాయ్ చేయండి. ఇది మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే వాన మరీ కుండపోతగా కాకుండా జల్లులుగా ఉన్నప్పుడే ఇలా చేయడం మంచిది. 

shutterstock

ADVERTISEMENT

వానలో డ్యాన్స్ చేయండి.

ఒకవేళ మీకు వానలో తడవడం మరీ ఇష్టమైతే మీరు, మీ భాగస్వామి కలిసి అదే వానలో చక్కటి రొమాంటిక్ సంగీతానికి డ్యాన్స్ చేయండి. దీని వల్ల మీకు అటు వ్యాయామం అందడంతో పాటు.. ఇటు వాన మీ ఇద్దరినీ మరింత దగ్గర చేస్తుంది కూడా. ఒకవేళ మీకు వానలో తడుస్తూ డ్యాన్స్ చేయడం ఇబ్బందిగా అనిపిస్తే.. ఇద్దరూ కలిసి వానలో అలా అటూ ఇటూ తిరగండి. లేదా వానను చూస్తూ ఇంట్లోనే డ్యాన్స్ చేయండి. ఎలా చేసినా ఇద్దరి మధ్య రొమాన్స్ పుడితే చాలు. ఆనందం మీ సొంతమవుతుంది.

మొక్కజొన్న పొత్తులతో..

వర్షంలో ఆనందంగా ఆడిన తర్వాత.. మీకు ఇష్టమైతే మొక్కజొన్న పొత్తులు తింటూ వానను చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇలా ఒకరికొకరు మొక్కజొన్న పొత్తు షేర్ చేసుకొని తింటుంటే ఎంతో సరదాగా ఉంటుంది. దీని కోసం ముందుగానే మొక్కజొన్న పొత్తులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. మొక్కజొన్న పొత్తులు కాల్చుకొని తినడంలోని మజాయే వేరు. లేదంటే ఉడికించిన మొక్కజొన్న పొత్తులు కూడా తినొచ్చు. వానలో బయటకు వెళ్లకుండా ఉండాలంటే మాత్రం.. ఇంట్లో ముందు నుంచే వాటిని సిద్ధంగా ఉంచుకోవాల్సిందే. 

ADVERTISEMENT

Shutterstock

వేడి వాటర్ బాత్

వానలో తడిచి బయటి నుంచి వచ్చినప్పుడు శరీరం మొత్తం మురికి పట్టడమే కాదు.. తడిచిపోయి కూడా ఉంటుంది. అందుకే ఇద్దరూ కలిసి మంచి వేడి నీటి బాత్ చేయండి. దీని కోసం మీ ఇంట్లో టబ్ ఉంటే..  టబ్ బాత్ లేదా చక్కటి షవర్ బాత్ చేయడం మంచిది. చక్కగా మ్యూజిక్ పెట్టుకొని సెంటెడ్ క్యాండిల్స్ మధ్యలో టబ్‌లో స్నానం చేస్తుంటే రొమాంటిక్ ఫీలింగ్ మీ సొంతం అవడం పక్కా అని చెప్పొచ్చు. 

ADVERTISEMENT

చిన్నపిల్లలైపోండి..

వర్షం పడుతున్నప్పుడు కాసేపు మీరిద్దరూ కూడా చిన్నపిల్లలుగా మారిపోండి. ఇద్దరూ చిన్నతనంలో వానలో ఎలా ఆడుకున్నారో గుర్తుచేసుకోండి. చక్కగా వానలో కాగితంలో పడవలు చేసి వదలండి. బోర్డ్ గేమ్స్ కూడా ఆడండి. లేదంటే ఇద్దరూ కలిసి వానలో ఫుట్ బాల్, వాలీబాల్ కూడా ఆడొచ్చు. ఇది పోటాపోటీగా ఉండడం మాత్రమే కాదు.. మీ మధ్య రొమాన్స్ డోస్‌ని కూడా పెంచుతుంది. 

shutterstock

ADVERTISEMENT

టీవీ చూస్తూ గడపండి..

వర్షం పడుతున్నప్పుడు బయటకు వెళ్లే పని ఎలాగూ ఉండదు కాబట్టి టీవీలో మీకు నచ్చిన షోస్ లేదా సినిమాలు చూస్తూ గడిపేయండి. అలాగే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటివి కూడా ఉన్నాయి కదా.. వాటిలో మీకు నచ్చినంత సేపు నచ్చిన సినిమాలు చూస్తూ గడపండి. సోఫా మీద ఇద్దరూ కూర్చొని చక్కటి దుప్పటి కప్పుకొన్ని ఒకరినొకరు హత్తుకొని.. పాప్ కార్న్ తింటూ గడపడం వల్ల ఆ రొమాంటిక్ క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

శృంగారంలో పాల్గొనండి..

వర్షాకాలం, చలికాలం జంటలను దగ్గర చేసే కాలాలు అంటుంటారు పెద్దలు. అది నిజంగా నిజమే.. బయట చల్లగా వాన పడుతుంటే వెచ్చగా భాగస్వామి మనల్ని కౌగిలించుకుంటే.. ఒళ్లంతా వేడి పుట్టడం అందరికీ జరిగేదే. అందుకే వర్షం పడుతున్నప్పుడు శృంగారం  చేయడం కూడా మంచి రొమాంటిక్ పనే.. ఎప్పుడూ సహజంగా చేసే రొమాన్స్ కంటే కాస్త భిన్నంగా చేస్తే అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 

ADVERTISEMENT

ఇంటి బయట ఎంజాయ్ చేయాలనుకుంటే..

సాధారణంగా ఇద్దరే ఉన్నప్పుడు.. ఇంట్లో ఎంజాయ్ చేసే వీలుంటుంది. కానీ మీరు ఉమ్మడి కుటుంబంలో ఉన్నా.. లేక ఎప్పుడూ ఇంట్లోనే ఎంజాయ్ చేసి బోర్ కొడుతుందనుకున్నా.. రొమాంటిక్‌గా బయట కూడా ప్లాన్ చేసుకోవచ్చు

Shutterstock

ADVERTISEMENT

చక్కటి డేట్ ప్లాన్ చేయండి..

వర్షంలో బయటకు వెళ్లాలని అకున్నప్పుడు దానికి తగినట్లుగా ప్లాన్ చేసుకోవాలి. ఓ మంచి రూఫ్ టాప్ రెస్టారెంట్లో భోజనం, తర్వాత ఓ మంచి సినిమా ఆపై.. ఏదైనా పార్క్‌లో కూర్చొని వానను ఎంజాయ్ చేస్తూ ఆనందంగా గడపడం ఎంతో బాగుంటుంది. అయితే ఇలాగే చేయాలనేమీ లేదు. రోజంతా మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన వ్యక్తితో డేట్ ప్లాన్ చేసుకోండి.

లాంగ్ డ్రైవ్‌కి వెళ్లండి..

బయట చల్లటి చినుకులు పడుతుంటే కార్లో పక్కన నచ్చిన వారితో అందమైన వ్యూ చూస్తూ రొమాంటిక్ పాటలు వింటూ ప్రయాణించడం చాలామందికి ఇష్టం. అందుకే అలా హైవే పై లాంగ్ డ్రైవ్‌కి వెళ్లి రండి. మీకు వర్షంలో తడవడం ఇష్టమైతే బైక్ పై కూడా లాంగ్ డ్రైవ్‌కి వెళ్లొచ్చు. కానీ వర్షంలో వేగంగా వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి.. చాలా తక్కువ వేగం 30, 40ల్లో వెళ్తూ ఎంజాయ్ చేయడం మంచిది.

ADVERTISEMENT

Shutterstock

నేషనల్ పార్క్‌కి వెళ్లండి..

వర్షంలో ప్రకృతి అందాలు చూసి తీరాల్సిందే. పచ్చపచ్చని చెట్ల మధ్యలో చినుకులు పడుతుంటే ప్రతి ఆకు, ప్రతి పువ్వు పరవశిస్తుంది. వర్షంలో నెమళ్ల ఆటలు.. చెంగుచెంగున ఎగిరే జంతువుల ఆనందం చూసి తీరాల్సిందే. ఇదంతా చూసేందుకు మీరు ఏదైనా నేషనల్ పార్క్‌కి వెళ్లడం వల్ల.. పచ్చని ప్రకృతిలో వాన అందాన్ని సొంతం చేసుకోవచ్చు. మనం సందర్శించడానికి ఎన్నో నేషనల్ పార్క్‌లు ఉన్నాయి. మీకు అక్కడికి వెళ్లి ప్రకృతితో మమేకమై గడిపే వీలుంటుంది. దీని కోసం మరీ దూరం వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. హైదరాబాద్‌లో ఉన్నవారు వికారాబాద్ అనంతగిరి అడవులు, వైజాగ్‌లో ఉన్నవారు అరకు వంటి ప్రదేశాలకు వెళ్లొచ్చు. 

ADVERTISEMENT

ట్రెక్కింగ్ చేయండి.

మీకు సాహసాలంటే ఇష్టం అయితే.. చక్కటి పచ్చని ప్రకృతిని ఎంజాయ్ చేయడంతో పాటు రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ వంటివి కూడా చేయచ్చు. సన్నగా వర్షం పడుతున్నప్పుడు ఇలాంటివి ప్రయత్నిస్తే ఒళ్లు పులకిస్తూ ఉంటుంది. నీళ్ల ధారను చూస్తూ పర్వతాలు ఎక్కడంలో చాలా మజా ఉంటుంది. మీకు ఇలాంటివి ఇష్టం ఉండడంతో పాటు అనుభవం కూడా ఉంటేనే వర్షంలో ట్రెక్కింగ్ ప్రయత్నించాలి. 

Shutterstock

ADVERTISEMENT

వాటర్ ఫాల్స్‌లో తడిసిముద్దవ్వండి.

వర్షం పడుతుంటే జలపాతాలు పొంగిపొర్లుతుంటాయి. నీటి పారుదల ప్రాజెక్టులు లేదా జలపాతాలను వర్షాకాలంలో చూస్తే ఆ ముచ్చటే వేరుగా ఉంటుంది. మీరు కూడా.. మీకు దగ్గరగా ఉండే ప్రాంతాలకు వెళ్లి.. ప్రవహించే నీటిని లేదా జలపాతాలను చూడండి.  వీలుంటే వాటిలో తడుస్తూ ఎంజాయ్ చేయండి. అలా వెళ్లడానికిి ఓ వీకెండ్ కేటాయించుకోండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో వాటర్ ఫాల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో మీకు నచ్చిన జలపాతాన్ని ఎంచుకొని.. అక్కడికి వెళ్లి ఇద్దరూ ఎంజాయ్ చేయొచ్చు. అటు లాంగ్ డ్రైవ్ ఆనందంతో పాటు ఇటు వాటర్ ఫాల్స్‌లో తడిసిన అనుభూతి కూడా మీకు ఆనందాన్ని అందిస్తాయి.

వర్షంలో లాంగ్ వాక్

వర్షం పడినప్పుడు కేవలం ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేయడం కాకుండా.. కాస్తా బయటకు కూడా అప్పుడప్పుడు వెళ్లండి. రోడ్డు మీద ఇద్దరూ గొడుగు పట్టుకొని నడుస్తూ వెళ్లి.. మీ దగ్గర్లో ఉన్న బండిలో బజ్జీలు, మొక్కజొన్న పొత్తులు లేక వేడివేడి ఛాట్ తినండి. ఈ ఆనందాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. మీరు వెళ్తుండగానే వర్షం ఆగిపోతే.. ఏదైనా చెట్టు కిందకు చేరి ఆ చెట్టును వూపి మీ భాగస్వామిని మీ ప్రేమ వర్షంలో తడిపేయండి. ఎంతో సరదాగా ఉంటుంది.

ADVERTISEMENT

వర్షాకాలంలో ఎంజాయ్ చేసేందుకు.. రొమాంటిక్ ప్రదేశాలు

tripadvisor

నెక్లెస్ రోడ్

ADVERTISEMENT

హైదరాబాద్‌లో ఆనందంగా గడిపేందుకు చక్కటి ఎంపిక నెక్లెస్ రోడ్డు. పచ్చని ప్రకృతితో హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న ఆ రోడ్డులో మీరు నెమ్మదిగా డ్రైవ్‌కి వెళ్లొచ్చు. అక్కడే ఈట్ స్ట్రీట్‌లో నచ్చిన ఆహారం తిని.. హుస్సేన్ సాగర్ ఒడ్డున సన్నని వానలో ఆనందంగా గడపొచ్చు. వాన మరీ ఎక్కువైతే పక్కనే ఐమాక్స్ వంటివి ఉండనే ఉన్నాయి అక్కడ సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇలాంటివే వైజాగ్‌లో అయితే బీచ్ రోడ్, విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ వద్దకు వెళ్లడానికి ప్రయత్నించండి.

ఆలివ్ బ్రిస్టో

బంజారాహిల్స్‌లోని ఆలివ్ బ్రిస్టో చక్కటి ఇంటర్నేషనల్ డిషెస్‌కి పెట్టింది పేరు. ఇక్కడి టెర్రస్ డైన్ ఇన్ నుంచి లేక్ వ్యూ ఎంతో అందంగా ఉంటుంది. సన్నగా వాన పడుతూ ఉంటే దాన్ని చూస్తూ భోజనం చేయాలనుకునేవారికి ఇది చాలా మంచి ఎంపిక. ఇందులోని పబ్ సెక్షన్‌లో మీకు నచ్చినట్లుగా డ్యాన్స్ కూడా చేయవచ్చు. 

ADVERTISEMENT

tripadvisor

స్టోన్ వాటర్స్

జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ (కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్) ఎదురుగా ఉన్న ఈ కిచెన్ కమ్ లాంజ్‌లో నార్త్ ఇండియన్, ఏషియన్, కాంటినెంటల్ ఫుడ్ లభిస్తుంది. ఈ రెస్టారెంట్ కేవలం సాయంత్రాలు మాత్రమే తెరచి ఉంటుంది. వాన పడుతుంటే చక్కగా కలిసి కూర్చొని తినడం మాత్రమే కాదు.. రొమాంటిక్ డ్యాన్స్ చేయాలనుకునేవారికీ ఇది చక్కటి ఎంపిక. 

ఈటర్స్ స్టాప్

ADVERTISEMENT

చక్కగా వర్షం పడుతుంటే కిటికీ పక్కనే కూర్చొని భోజనం చేయాలనుకునేవారు.. ఇంట్లోనే ఆ మజా పొందాల్సిన అవసరమేమీ లేదు. వైజాగ్‌లోని ఈటర్స్ స్టాప్ కూడా ఓ మంచి రూఫ్ టాప్ రెస్టారెంట్. ఇక్కడ రుచికరమైన భోజనం‌తో పాటు వర్షాన్ని చూస్తూ వేడి వేడి పదార్థాలు తినే వీలు కూడా ఉంటుంది. 

TripAdvisor

కుంటాల ఫాల్స్

ADVERTISEMENT

అదిలాబాద్ జిల్లాలో ఉన్న ఈ జలపాతం ఎంతో అందంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఇది చాలా అద్భుతమైన జలపాతం అని చెబుతుంటారు. కడెం నదిపై ఉన్న ఈ జలపాతం రెండు భాగాలుగా కిందకు ప్రవహిస్తుంది. 145 అడుగుల పై నుంచి నీళ్లు పడుతుంటే చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. 

లియోనియా రిసార్ట్స్

ఇంటి నుంచి దూరంగా వెళ్లి.. ఓ రోజు గడపాలనుకుంటే దానికి హైదరాబాద్‌లో మంచి ఎంపిక లియోనియా రిసార్ట్స్. ఇందులో అద్భుతమైన గదులు, అందమైన లోకేషన్లతో పాటు స్పా సౌకర్యం కూడా ఉంది. వీఐపీల కోసం ప్రత్యేకమైన గదులు కూడా అందుబాటులో ఉన్నాయి.

ADVERTISEMENT

Golcondaresorts

గోల్కొండ రిసార్ట్స్

వర్షంలో తడుస్తూ ఒక పక్క చక్కటి చెరువు, మరో పక్క పచ్చని ప్రకృతి అందాలను చూస్తూ పరవశించిపోవాలని మీకు అనిపిస్తోందా? అయితే మీరు గొల్కొండ రిసార్ట్స్‌కి వెళ్లాల్సిందే. ఇక్కడ ఏక్ మినార్ రెస్టారెంట్లో వంద అడుగుల పైన ఉన్న రెస్టరెంట్ నుంచి ఉస్మాన్ సాగర్ చెరువు అందాలను చూస్తూ భోజనం చేయొచ్చు. ఇది కాకుండా పూల్ సైడ్ రెస్టరెంట్ కూడా ఉంది. ఇక్కడి గదులు కూడా ఎంతో అద్భుతంగా, సౌకర్యవంతంగా ఉంటాయి. 

 POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

ADVERTISEMENT

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ఇవి కూడా చదవండి. 

ఈ లక్షణాలుంటే మీ బాయ్ ఫ్రెండ్.. మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నట్లే..!

ప్రేమ జీవితాంతం ఉండాలంటే.. గొడవ పెట్టుకోవాల్సిందే..!

ADVERTISEMENT

ఉత్తమ భర్తలు అంటే వీరేనేమో.. ఎందుకో తెలుసా?

23 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT