జెండా పండగ వచ్చిందంటే చాలు.. స్వాతంత్ర సమరయోధులను(Freedom fighters) గుర్తుచేసుకొని వారి త్యాగాలను కొనియాడడం మనందరికీ తెలిసిందే. అయితే మామూలు సమయంలో చాలామందికి వారి గురించి అంతగా గుర్తుండకపోవచ్చు. ఈ రోజు మనం అనుభవిస్తోన్న ఈ స్వతంత్రం వారి పోరాటాల వల్లే వచ్చిందని గుర్తుంచుకోవాలి. కేవలం స్వాతంత్రోద్యమానికి సంబంధించే కాదు.. మిగిలిన అంశాల గురించి కూడా వారు ఎన్నో మంచి, ప్రేరణాత్మకమైన మాటలు చెప్పారు.
ఈ గణతంత్ర దినోత్సవం లేదా రిపబ్లిక్ డే(Republic day) సందర్భంగా ఆ మాటలు మరోసారి గుర్తుచేసుకుందాం. ఎందుకంటే అవి మనకు జీవితంలో ఎప్పుడో ఓసారి కాదు.. రోజూ ఉపయోగపడేవే.. అందుకే ఆ సమరయోధులు చెప్పిన కొన్ని మాటలను కొటేషన్స్(Quotes)గా గుర్తుంచుకోండి. ఇవి మీకు జీవితంలో ముందుకెళ్లేందుకు స్ఫూర్తిని కూడా అందిస్తాయి.
Also Read: తెలుగులో ప్రముఖులలో హ్యాపీనెస్ కోట్స్ (Happiness Quotes In Telugu By Celebrities)
– పనిచేయడానికి ఆసక్తి లేకపోతే దాని గురించి ఆలోచించడం కూడా వ్యర్థమే.. అందుకే అలాంటప్పుడు నిశ్శబ్దంగా ఉండడం మంచిది. – అనిబిసెంట్.
– తల్లులు అందించే స్ఫూర్తి, వారి ప్రేమ, త్యాగాలపైనే దేశం గొప్పదనం ఆధారపడి ఉంటుంది – సరోజినీ నాయుడు
– కష్టాలు, విమర్శలు, వ్యతిరేకత.. మనం వాటిని అధిగమించేందుకే వస్తాయి. వాటిని ఎదుర్కొని విజేతలుగా నిలవడంలో ఓ ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది. ఎక్కడైతే ప్రశంసలు మాత్రమే లభిస్తాయో అక్కడ జీవితం కొన్ని రోజుల తర్వాత అందాన్ని కోల్పోతుంది. – విజయలక్ష్మీ పండిట్
– జ్ఞానోదయాన్ని అందించే మాటలు ఆభరణాల కంటే గొప్పవి – బేగం హజరత్ మహల్
– ఒక వ్యక్తి చనిపోవచ్చు. కానీ అతడు చేసిన ఆలోచన మాత్రం మరణించదు. అతని మరణం తర్వాత వేల మంది జీవితాల్లో అది భాగమవుతుంది. – నేతాజీ సుభాష్ చంద్రబోస్.
– ఒక సమాజం ప్రగతిని ఆ సమాజంలోని మహిళలు ఎంత ప్రగతిని సాధించారు అన్నదాని ఆధారంగా నేను లెక్కిస్తాను. – డా. బీఆర్ అంబేద్కర్.
– మేల్కోండి.. చదువుకోండి.. సమాజం కట్టుబాట్లను దాటి స్వేచ్ఛను సాధించండి. – సావిత్రీబాయి ఫూలే
– ఒక దేశ స్థితి గురించి చెప్పాలంటే ఆ దేశంలోని స్త్రీల పరిస్థితిని ఆధారం చేసి చెప్పవచ్చు – జవహర్ లాల్ నెహ్రూ.
– ఈ ప్రపంచంలో రెండు రకాల శక్తులున్నాయి. అందులో ఒకటి కలం అయితే రెండోది కత్తి.. ఈ రెండింటి మధ్యా పోటీతో పాటు శత్రుత్వం కూడా ఉంది. అయితే ఈ రెండింటి కంటే బలమైనది మూడోది ఉంది. అదే మహిళ. – మహమ్మద్ అలీ జిన్నా.
– మనిషి చేసిన చెడ్డపనుల్లో అన్నింటికంటే హేయమైనది మానవజాతిలో సగమైన స్త్రీలను హింసించడమే.. దీనికంటే దిగజార్చేది, క్రూరమైనది, దిగ్బ్రాంతి గొలిపేది ఇంకొకటి లేదు. – మహాత్మా గాంధీ
– ఆలోచనల్లో నిజాయతీ, మాటల్లో ధైర్యం, చేతల్లో నిబద్ధత ఉన్నవారే మనకు అవసరం – సరోజినీ నాయుడు
– ఇతరులు మీకంటే గొప్పగా పని చేస్తున్నారని బాధపడకండి.. రోజూ మిమ్మల్ని మీరు గెలిచే ప్రయత్నం చేయండి. నిన్నచేసిన పని కంటే ఈరోజు మరింత మెరుగ్గా చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే సక్సెస్ అనేది మీతో మీకు జరిగే ఒక పోరాటం లాంటిది. – చంద్రశేఖర్ ఆజాద్
– మనం కోరుకున్న లక్ష్యం చేరుకోవాలంటే కేవలం లక్ష్యం మాత్రమే కాదు.. చేరుకోవడానికి ఎంచుకున్న దారి కూడా సరైనదిగా ఉండాల్సిందే. – డా. రాజేంద్ర ప్రసాద్
– జీవితం పేకాటలాంటిది. కార్డులను గట్టిగా పట్టుకునే చేయి మీ దృఢచిత్తానికి సంకేతమైతే.. మీరు ఆడే విధానం మీ స్వేచ్ఛాకాంక్షకు ప్రతిబింబం. – జవహర్ లాల్ నెహ్రూ.
– తప్పులు చేసి సరిదిద్దుకునే స్వేచ్ఛ లేకపోతే స్వేచ్ఛ ఉన్నా దానికి ఏమాత్రం అర్థం ఉండదు – కస్తూర్బా గాంధీ
– నేను స్వేచ్ఛను, స్వేచ్ఛాయుతమైన అభివృద్ధిని కోరుకుంటున్నా. కేవలం నా దేశానికి మాత్రమే కాదు.. ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కోసం కోరుకుంటున్నా. – లాల్ బహదూర్ శాస్త్రి.
ఇవి కూడా చదవండి
గణతంత్ర దినోత్సవానికి మువ్వన్నెల రుచులతో రంగులద్దండి..!
రిపబ్లిక్ డే స్పెషల్.. ట్రై కలర్ నెయిల్ ఆర్ట్స్ మీరూ ప్రయత్నించండి..!
ఆడపిల్లలంటే ఎప్పుడూ ప్రత్యేకమే..! ఎందుకో మీకు తెలుసా??
Images: Wikipedia
Featured image : Shutterstock