ADVERTISEMENT
home / Celebrity gossip
“చైతూకి నాపై ఉన్న కంప్లైంట్.. అదొక్కటే” : సమంత

“చైతూకి నాపై ఉన్న కంప్లైంట్.. అదొక్కటే” : సమంత

సమంత అక్కినేని (Samantha akkineni).. టాలీవుడ్ అందాల నాయికల్లో తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకొని టాప్ పొజిషన్‌లో నిలిచిన నాయిక. తెలుగింటి కోడలైన సమంత అటు నటనతోనే కాదు.. ఇటు సేవలోనూ ముందుంటుంది. అంతేకాదు.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ వాడడం భర్త చైతూకి ఇష్టం లేదని, అందుకే తాను లేని సందర్భాల్లో మాత్రమే ఉపయోగిస్తుంటానని గతంలో చాలాసార్లు వెల్లడించింది సమంత. ఇప్పుడు తాజాగా తన భర్తకి తనపై ఉన్న కంప్లైంట్ గురించి మరో ఇన్ స్టాగ్రామ్ (Instagram) పోస్ట్ ద్వారా వెల్లడించింది.

మజిలీ సక్సెస్ తర్వాత ఓహ్ బేబీ చిత్రంతో బిజీ అయిపోయిన సమంత తాజాగా తన అభిమానులతో కాసేపు ముచ్చటించింది. వారికి నచ్చిన ప్రశ్నలు అడగొచ్చని వాటన్నింటికీ తాను సమాధానం చెబుతానని సమంత ప్రకటించిన కొన్ని గంటల్లోనే వేలాది ప్రశ్నలు వేశారు అభిమానులు. అందులో తనకు ఇష్టమైన కొన్ని ప్రశ్నలకు మాత్రం ఆమె సమాధానం చెప్పుకొచ్చింది.

SAM3

ADVERTISEMENT

తన బ్యూటీ సీక్రెట్ల గురించి వెల్లడిస్తూ ‘నా సౌందర్య రహస్యం యాపిల్ సైడర్ వెనిగర్’ అని చెప్పింది సమంత. తన స్కిన్ కేర్ కోసం చాలా పదార్థాలను ఉపయోగిస్తానని అయితే ‘ఎస్ పీ ఎఫ్ 50 ఉన్న సన్ స్క్రీన్ లోషన్’ ని మాత్రం తాను ఎల్లప్పుడూ మర్చిపోకుండా ఉపయోగిస్తుంటానని వెల్లడించిందామె.

అంతేకాదు.. తాను రోజూ ఉపయోగించే ఫౌండేషన్ గురించి చెప్పమని అడిగిన ఓ యూజర్‌కి దాని ఫొటో షేర్ చేసి మరీ ఛానెల్ సంస్థ రూపొందించిన ఆ ఫౌండేషన్ తన చర్మాన్ని అద్భుతంగా ఉంచుతుందని చెప్పుకొచ్చింది. తన హ్యాండ్ బ్యాగ్ లో ఉండే మేకప్ ఉత్పత్తుల గురించి అడిగితే.. ‘నేను ఒక్క రోజు టూర్ కి వెళ్లినా.. నా బ్యాగ్ లో కనీసం వెయ్యి క్రీములు వేసుకొని వెళ్తానని’ చైతూ నన్ను ఎప్పడూ ఆటపట్టిస్తుంటాడు. తనకి నా మీద ఉన్న కంప్లైట్ అదొక్కటే.. అందుకే వాటన్నింటి పేర్లు చెప్పలేను అంటూ సమాధానం చెప్పింది.

46408031 724074581307089 7388415778350350120 n 356712

జీవితంలో ఆనందంగా ఉండడం ఎలా అని ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ “మీకు ఉన్నదాని పట్ల సంతృప్తి, కృతజ్ఞతా భావం ఉంటే ఎవరైనా ఆనందంగా ఉండగలుగుతారని” సమాధానం ఇచ్చింది సమంత. మీరు ఇంత పెద్ద పేరు సంపాదిస్తారని చిన్నతనంలో ఊహించారా? అని ఓ యూజర్ అడగ్గా.. “నేను ఏమాత్రం ఊహించలేదు. కానీ చిన్నతనం నుంచి నాకు పెద్ద పెద్ద కలలు, కోరికలు ఉండేవి. అవే నన్ను ఈ స్థాయికి చేర్చాయని” చెప్పుకొచ్చింది సామ్. అంతేకాదు.. తను చాలా కష్టపడి చాలా దూరం ప్రయాణించానని అయితే ఇంకా సాధించాల్సింది చాలా ఉందని చెప్పింది.

ADVERTISEMENT

sam2

తన కెరీర్‌లోనే అద్బుతమైన చిత్రం ఏదని అడిగితే.. ‘ఓహ్ బేబీ’ అని చెప్పిన సమంత దానికి కారణమేంటని అడిగితే.. తాను ఎప్పటినుంచో కామెడీ రోల్స్‌లో నటించాలనుకున్నానని వెల్లడించింది. ఇవేకాదు.. ప్రస్తుతం తన చేతిలో 96 సినిమా ఒక్కటే ఉందని చెప్పిన ఈ బ్యూటీ.. చైతూని మొదటిసారి చూడగానే తను క్యూట్‌గా ఉన్నాడని భావించాను. కానీ తను నా తెలుగు విని నవ్వుతాడని భయపడ్డానని చెప్పింది.

D7GdflsUEAAG3Gm

సాధారణంగా బరువు పెరగకుండా ఉండేందుకు చాలామంది కడుపు మాడ్చుకుంటూ ఉంటారు. మీరూ అలాగే చేస్తారా? అని ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు “అస్సలు కాదు.. నాకు ఆకలి చాలా ఎక్కువ. నేను అస్సలు డైటింగ్ చేయలేను” అంటూ తాను ప్లేట్ నిండా ఐస్ క్రీం తింటున్న ఫొటోను పోస్ట్ చేసింది సమంత.

ADVERTISEMENT

అంతేకాదు.. బరువులు ఎత్తితే బరువు తగ్గుతారా? అని మరో యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానం కూడా అందించింది సామ్. “సరైన డైట్ ని తీసుకుంటూ బరువులు ఎత్తడం ప్రారంభిస్తే మీరు చాలా త్వరగా, ఎక్కువ బరువు తగ్గుతారు. వెయిట్ ట్రైనింగ్ వల్ల చాలా క్యాలరీలు కరుగుతాయి” అని చెప్పింది సమంత. ఇటీవలే ఆమె బరువులు ఎత్తిన వీడియో కూడా పెట్టి నెట్‌లో హల్ చల్ చేసింది. 100 కేజీల బరువుతో స్క్వాట్స్ చేసింది సామ్. గతంలో 60 కేజీల బరువుతో చేసిన ఆమె ఇప్పుడు తన రికార్డును తనే అధిగమించింది. అంతేకాదు.. 70 కేజీల బరువును నడుముపై పెట్టి హిప్ థ్రస్ట్ చేయడం, యాభై కేజీల బెంచ్ ప్రెస్.. ఇలా చాలా బరువులు మోస్తూ వెయిట్ ట్రైనింగ్ పట్ల అమ్మాయిల్లో ఆసక్తి పెంచుతోంది సమంత.

నాకు తెలిసిన రాక్షసి సమంత ఒక్కరే: నాగ చైతన్య

స్నేహితురాలి పెళ్లిలో.. సమంత సందడి చూశారా?

మజిలీ సినిమాతో అబ్బాయిలందరికీ.. ఓ డ్రీమ్ వైఫ్ దొరికేసింది..!

ADVERTISEMENT

Images : Instagram.

24 May 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT