Advertisement

Lifestyle

ఆడపిల్లలు మగపిల్లల కన్నా.. ఎక్కువగానే సాధించారు : సమీరా రెడ్డి

Babu KoiladaBabu Koilada  |  Nov 18, 2019
ఆడపిల్లలు మగపిల్లల కన్నా.. ఎక్కువగానే సాధించారు : సమీరా రెడ్డి

Advertisement

(Sameera Reddy’s Latest Instagram Post says about Girl Empowerment)

నరసింహుడు, జై చిరంజీవా, సూర్య సన్నాఫ్ క్రిష్ణన్ లాంటి దక్షిణాది చిత్రాలతో బాగా పాపులర్ అయ్యి.. ఆ తర్వాత బాలీవుడ్‌లో  కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్న నటి సమీరా రెడ్డి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సమీరా రెడ్డి.. తను గర్భంతో ఉన్నప్పుడు అండర్ వాటర్ ఫోటో షూట్‌లో పార్టిసిపేట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే తన పిల్లలను స్వేచ్ఛగా పెంచాలని భావిస్తున్నానని చెప్పి అందరికీ ప్రేరణ కలిగించే మెసేజ్‌ను సైతం ఇచ్చింది. ఇప్పుడు తాజాగా మరోసారి తన చిన్నారి చిత్రాలను పోస్టు చేస్తూ.. ఆడపిల్లల ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలిపింది. 

“నాకు నా చిన్నారితో గడపడం అనేది చాలా ఆనందాన్ని కలిగించే విషయం. అయితే చిత్రమేంటంటే.. ఇప్పటికీ చాలామందికి ఆడపిల్లలంటే చిన్నచూపు ఉంది. అనేకమంది ఆడపిల్లలను కనడమే భారంగా భావిస్తుంటారు. కానీ ఇలాంటి ఆలోచనలకు భిన్నం నేను. ఇప్పటికీ పట్టణ ప్రాంతాలలో చాలా చోట్ల.. మగపిల్లలు పుడితే అదృష్టమని అనుకుంటూ ఉంటారు. మా కుటుంబంలో కూడా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. అందులో ఒకదాన్ని నేను. అందుకే ఇది నిజమని నేను చెప్పగలను. కానీ ఆడపిల్లలమైన మేము.. మగపిల్లల కంటే ఎన్నో విధాలుగా ముందంజలో ఉన్నాం”  అని తెలిపింది సమీరా రెడ్డి.

మీ ట్రోలింగ్ కోసం నా లైఫ్‌స్టైల్ మార్చుకోను.. అంటోన్న స‌మీర‌..!

ఈ మధ్య కాలంలో సమీరా రెడ్డి పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. ఎక్కువగా సోషల్ మీడియాలోనే యాక్టివ్‌గా ఉంటున్నారు. తన బిడ్డతో తనకు గల అనుబంధాన్ని ఫోటోల రూపంలో చూపిస్తూ.. వాటిని తన అభిమానులతో పంచుకుంటున్నారు. “మైనే దిల్ తుజ్కో దియా” చిత్రంతో హిందీ చిత్రసీమకు పరిచయమైన సమీరా రెడ్డి.. ముసాఫిర్, టాక్సీ నెంబర్ 9211, నక్ష, ఆక్రోశ్ లాంటి చిత్రాలలో నటనకు గాను విమర్శల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఆమె నటించిన ఆఖరి చిత్రం “వరద నాయక” 2013లో కన్నడంలో విడుదలైంది. 

అండర్ వాటర్ ఫొటోషూట్‌తో.. అబ్బురపరుస్తోన్న సమీరా రెడ్డి..!

1980లో రాజమండ్రిలో జన్మించిన సమీరా రెడ్డి తండ్రి తెలుగు వ్యక్తి కాగా.. తల్లి కన్నడిగురాలు. సమీరా సోదరి మేఘనా రెడ్డి వీజేగా సుపరిచితురాలు. అలాగే మరో సోదరి సుష్మా రెడ్డి కూడా నటిగా పరిచయమయ్యారు. వీరిద్దరూ సమీరా కంటే పెద్దవాళ్లే కావడం గమనార్హం. 2014లో ప్రముఖ పారిశ్రామివేత్త అక్షయ్ వర్దేని వివాహమాడిన సమీరా రెడ్డి.. పెళ్లయ్యాక సినిమాలకు దూరమయ్యారు. సమీరా రెడ్డి పాత్రతో “సమీరా – ది స్ట్రీట్ ఫైటర్” అనే వీడియో గేమ్ కూడా అప్పట్లో విడుదలైంది. అలాగే “మిస్ శ్రీలంక” కాంటెస్టుకు సమీరా అప్పట్లో న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించారు. 

సమీర గర్భం ధరించి అండర్ వాటర్ ఫోటో షూట్‌లో పాల్గొన్న సమయంలో తన మీద అనేక ట్రోల్స్ వచ్చాయి. వాటన్నింటకి కూడా అప్పట్లో దీటుగా సమాధానమిచ్చిందామె. ” డియ‌ర్ ట్రోల‌ర్స్‌.. మీరంద‌రూ భూమ్మీద‌కు ఎలా వ‌చ్చారు? మీ అమ్మ క‌డుపులోంచే క‌దా. మీరు పుట్టిన‌ప్పుడు మీ అమ్మ చాలా అందంగా, హాట్‌గా కనిపించిందా? లేదు క‌దా..! మ‌రి న‌న్ను ఎందుకు త‌ప్పుబ‌డుతున్నారు? అమ్మ‌త‌నం అనేది ఒక ప్ర‌త్యేక‌మైన అనుభూతి. అవును.. క‌రీనాలా గ‌ర్భం ధ‌రించిన త‌ర్వాత, డెలివ‌రీ త‌ర్వాత హాట్‌గా క‌నిపించేవాళ్లు కొంత‌మంది ఉంటారు. అయితే నాలా గ‌ర్భం ధ‌రించిన త‌ర్వాత బ‌రువు పెరిగి.. అది తగ్గేందుకు కొంత స‌మ‌యం తీసుకునేవాళ్లు కూడా చాలామందే ఉంటారు.. గ‌ర్భం ధ‌రించడం అంటేనే నాలో ఒక సూప‌ర్ ప‌వ‌ర్ ఉన్న‌ట్లు లెక్క‌. అందుకు నేను చాలా అదృష్ట‌వంతురాలిగా ఫీల‌వుతున్నా.. అని ట్రోల‌ర్స్‌కి స‌మాధానం చెప్పింది స‌మీర‌.

అందాల బుజ్జి పాపకు జన్మనిచ్చిన.. సమీరా రెడ్డి..!

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.