ADVERTISEMENT
home / Celebrity Life
Sarileru Neekevvaru Movie Review : ఈ సంక్రాంతి.. మహేష్ అభిమానులకు సిసలైన పండగే ..!

Sarileru Neekevvaru Movie Review : ఈ సంక్రాంతి.. మహేష్ అభిమానులకు సిసలైన పండగే ..!

Sarileru Neekevvaru Movie Review

భరత్ అనే నేను, మహర్షి.. ఇలా వరుస హిట్స్‌తో తనదైన సత్తా చాటిన మహేష్ బాబు .. ఈ సంక్రాంతికి అభిమానుల ఆశల నడుమ మరో కొత్త సినిమాతో దూసుకొచ్చేశాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ 2020 సంవత్సరాన్ని పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో మొదలుపెట్టాడు. ఒకవైపు భారీ తారాగణం.. మరోవైపు ఇప్పటికే జనాలను ఆకట్టుకున్న ట్రైలర్, ఫస్ట్ లుక్ వెరసి సినిమాపై ఫ్యాన్స్ అంచనాలు విపరీతంగా పెరిగాయి. గత సంవత్సరం ‘F 2’ చిత్రంతో భారీ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఈ సినిమా రావడంతో ఆ ఆసక్తి ఇంకా పెరిగింది. ఇక లేడీ సూపర్ స్టార్ విజయశాంతి దాదాపు 13 ఏళ్ల తర్వాత వెండితెరపై నటిస్తుండడం ఈ సినిమాకి ప్లస్ . ఇన్ని పాజిటివ్ పాయింట్స్‌తో  విడుదలైన సినిమా మరి ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకుందో మనమూ తెలుసుకుందాం

భారత ఆర్మీకి ఈ సినిమాని అంకితమిస్తున్నట్లు సినిమా మొదట్లోనే చెప్పిన దర్శకుడు.. కథను కర్నూల్ మెడికల్ కాలేజీ నుండి మొదలుపెట్టి ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సీన్ వైపు తీసుకెళ్తాడు. అజయ్ (మహేష్ బాబు) ఇండియన్ ఆర్మీ మేజర్. కిడ్నాప్ బారిన పడిన పిల్లలను రక్షించడానికి ఓ కీలకమైన ఆపరేషన్‌లో పాల్గొంటాడు. ఆ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యాక.. అనుకోని పరిస్థితులలో తను కర్నూల్ వెళ్లాల్సి వస్తుంది. అక్కడే ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంటుంది. కర్నూల్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ భారతి (విజయశాంతి) పాత్ర కథను ఓ కీలకమైన మలుపు తిప్పుతుంది. ఆ పాత్ర చుట్టూ అల్లిన ఓ పొలిటికల్ రివెంజ్ డ్రామా మొదలవుతుంది. ఆ కథలో విలన్‌గా మనకు నాగేంద్ర ప్రసాద్ (ప్రకాష్ రాజ్) కనిపిస్తారు. ఓ విషయమై భారతికి సహాయం చేయడానికి వచ్చిన అజయ్ ఎందుకు నాగేంద్రను ఎదిరించాల్సి వచ్చింది? అనేదే సినిమా కథ.

అందమైన ఫ్యామిలీ.. ఆనందాల లోగిలి… మహేష్ బాబు కుటుంబం

ADVERTISEMENT

సీరియస్ సినిమా అయినా.. అక్కడక్కడ కామెడీ కూడా బాగా వర్కవుట్ అవ్వడంతో చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగానే సాగుతుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో మహేష్ నటనతో పాటు కామెడీ టైమింగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో మహేష్ తనదైన మార్కు నటనను కనబరిచారు. ఇక ప్రొఫెసర్ భారతి పాత్రలో విజయశాంతి నటన కూడా ఆకట్టుకుంటుంది. ఒక సీనియర్ నటి అనుభవం మనకు ఆ పాత్రలో కచ్చితంగా కనిపిస్తుంది. దాదాపు మహేష్ బాబుతో సరిసమానమైన పాత్రగానే మనం పరిగణించవచ్చు. ముఖ్యంగా భావోద్వేగాలను మిళితం చేసిన సన్నివేశాలలో ఇరువురూ పోటాపోటీగా నటించారనే చెప్పాలి.

‘మిస్ ఇండియా’ను ప్రేమించిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’.. మహేష్, నమ్రతల అద్భుత ప్రేమకథ మీకు తెలుసా?

ఇక ప్రకాష్ రాజ్ ఎప్పటి మాదిరిగానే తన విలనిజాన్ని పాత్రలో పర్ఫెక్ట్‌గా చూపించారు. చాలాకాలం తర్వాత సినిమాల్లో నటించిన బండ్ల గణేష్.. బ్లేడు కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను నవ్వించడానికి ట్రై చేశారు. ఇది కూడా బాగానే వర్కవుట్ అయ్యింది. ఇక హీరోయిన్ పాత్రలో రష్మిక తన పరిధి మేరకు నటించింది. ఆమె నటన.. తన కోసం దర్శకుడు ప్రత్యేకంగా క్రియేట్ చేసిన మేనరిజమ్స్ సినిమాకు మరింత వినోదాన్ని పంచాయి. ఫస్ట్ ఆఫ్ కామెడీగా సాగినా.. సినిమా ద్వితీయార్థం మాత్రం సీరియస్ నోట్‌తోనే మొదలవుతుంది. ఇక దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణ. పాటలన్నీ మాస్ పల్స్‌ను పరిగణనలోకి తీసుకొనే రూపొందించారు. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోరు డిఫరెంట్‌గా ఉంది. ముఖ్యంగా ఆర్మీ బ్యాక్ డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలలో నేపథ్య సంగీతం చాలా బాగుంది.

హీరో నుంచి బిజినెస్‌మెన్ వరకు.. “సూపర్ స్టార్ మహేష్ బాబు” బర్త్ డే స్పెషల్ ..!

ADVERTISEMENT

ఇక రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, వెన్నెల కిషోర్, సత్యదేవ్, హరితేజ పాత్రలు కూడా సినిమా కథకు బాగానే సహాయపడ్డాయి. తమన్నా ఓ ప్రత్యేక గీతంలో కనిపిస్తుంది. అయితే సెకండ్ ఆఫ్‌ నిడివి తగ్గిస్తే బాగుండేది. ఇక క్లైమాక్స్ ఫీల్ గుడ్‌గానే ఉంటుంది. మహేష్ బాబు గత చిత్రాలతో పోల్చితే.. ‘సరిలేరు నీకెవ్వరు’  అంత గొప్ప చిత్రం కాకపోయినా.. కచ్చితంగా కమర్షియల్ విలువలున్న సినిమా. అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడిని సైతం ఆకట్టుకోగల రెగ్యులర్ సినిమా. సబ్జెక్టును కొంచెం సేపు పక్కన పెడితే.. మహేష్ బాబు నటన కోసం కచ్చితంగా ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఆ విధంగా చూస్తే.. ఈ సినిమా ఈ సంక్రాంతికి ఫ్యాన్స్‌కు అసలు సిసలైన పండగే 

 

10 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT