ADVERTISEMENT
home / Health
పిరియడ్స్ ఆలస్యం అయ్యాయా? ఇలా చేసి వెంటనే వచ్చేలా చేయండి..

పిరియడ్స్ ఆలస్యం అయ్యాయా? ఇలా చేసి వెంటనే వచ్చేలా చేయండి..

పిరియడ్స్ (periods)తో అమ్మాయిలకు ఉండే బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి అమ్మాయి పిరియడ్స్‌ని ఎంతగా ఇష్టపడదో.. అవి ఆలస్యమైతే వాటికోసం అంతే వేచి చూస్తుందంటే అతిశయోక్తి కాదు. కొన్నిసార్లు పిరియడ్స్ మిస్ అవ్వడం లేదా ఆలస్యమవ్వడం మనకు ఎంతో బాధను కలిగిస్తుంది. పిరియడ్స్ రావడం కంటే అవి ఎప్పుడొస్తాయో అని వేచి చూడడం చాలామంది అమ్మాయిలకు నచ్చని విషయం. పిరియడ్స్ కోసం వేచి చూస్తున్న సమయంలో ఒత్తిడి, పీఎంఎస్ మనల్ని మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. అందుకే పిరియడ్స్ కోసం వేచిచూడకుండా మనమే అవి వచ్చేలా కొన్ని చిట్కాలు పాటిస్తే సరి.. 

పిరియడ్స్ సమయంలో నొప్పి తగ్గడానికి.. వివిధ దేశాల అమ్మాయిలు వాడే చిట్కాలివే

పిరియడ్స్ వచ్చేలా (regularize) చేయడానికి చిట్కాలు పాటించేముందు.. అసలు పిరియడ్స్ ఎందుకు ఆలస్యమవుతాయో అన్న విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. పిరియడ్స్ ఆలస్యం అవ్వడానికి ఒత్తిడి, తక్కువ బరువు ఉండడం, అధిక బరువు, పీసీఓఎస్, బర్త్ కంట్రోల్ పిల్స్ వంటివి కారణమవుతాయి. ఇందులో మీకు ఏ సమస్య ఉందో తెలుసుకుంటే చాలు.. మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇందులో మీకు ఏదైనా సమస్య ఉందని తెలిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. అయితే ఈలోపు మీ పిరియడ్స్ రెగ్యులర్‌గా రావడానికి ఈ చిట్కాలు పాటించి చూడండి.

1. స్నేహితులతో గడపండి.

ADVERTISEMENT

సాధారణంగా ఒక దగ్గర ఉన్న అమ్మాయిల పిరియడ్స్ ఒకేసారి అవుతుంటాయి. దీనికి పిరియడ్ సింకింగ్ అని పేరు. ఒకే దగ్గర ఉన్న అమ్మాయిల హార్మోన్లు ఒకే రకంగా స్పందించడం వల్ల ఇది జరుగుతుందట. ఒకవేళ మీకు పిరియడ్స్ ఆలస్యమైతే ఇప్పటికే రుతుస్రావం అవుతోన్న .. మీ స్నేహితులతో కలిసి ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించండి. దీనివల్ల మీక్కూడా పిరియడ్స్ త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. 

2. రోజంతా విశ్రాంతి..

దీన్ని ప్రయత్నిస్తే ఇదే మీ ఫేవరెట్ చిట్కా అనక మానరేమో.. ఎందుకంటే పిరియడ్స్‌ని సరైన సమయానికి తీసుకొచ్చేందుకు ఒక రోజంతా మిగిలిన పనులన్నింటినీ క్యాన్సిల్ చేసుకొని.. ఇంట్లోనే ఉంటూ హ్యాపీగా పడుకొని టీవీ చూస్తూ ఒక టబ్ ఐస్ క్రీం తినేయండి. మన రోజువారీ జీవితంలో ఉండే ఒత్తిడి వల్ల పిరియడ్స్ ఆలస్యమవుతుంటాయి. అదే మీరు పూర్తిగా రిలాక్స్ అయితే అవి వెంటనే వచ్చే అవకాశం ఉంటుంది. 

1. స్నేహితులతో గడపండి.

ఆరెంజ్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్ వంటి సహజ డ్రింకులు మన శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఇవి పిరియడ్ వచ్చేలా సాయం కూడా చేస్తాయి. పిరియడ్స్ ముందుగా రావాలనుకుంటే విటమిన్ సి తీసుకోవడం చక్కటి మంచి ఆలోచన. అందుకే ఈ సారి పిరియడ్స్ కోసం ప్రయత్నిస్తే నారింజ రసం తాగేయండి.

ADVERTISEMENT

4. కొత్తిమీర తినండి..

కొత్తిమీరలోని ఎమ్మనగాగ్స్ మన శరీరంలోని రక్త ప్రసరణను కంట్రోల్ చేస్తాయి. ఇవి కటి వలయ భాగానికి రక్త సరఫరా పెంచడం వల్ల.. పిరియడ్స్ అనుకున్న సమయానికి వచ్చే వీలుంటుంది. దీనికోసం కొత్తిమీరను కూరల్లో వేసుకోవడంతో పాటు.. దానిని ముక్కలుగా కట్ చేసి వేడినీటిలో వేసి.. ఈ నీటిని రోజుకు రెండు సార్లు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

1. స్నేహితులతో గడపండి.

సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో మనకు తెలిసిందే. అందులో పిరియడ్స్ సమతుల్యం చేయడం కూడా ఒకటి. ఒకవేళ పిరియడ్స్ అనుకున్న సమయానికి రాకపోతే.. సెక్స్ చేయడం వల్ల కటి వలయ భాగానికి రక్త ప్రసరణ ఎక్కువగా జరిగి.. పిరియడ్స్ అనుకన్న సమయానికే వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. సెక్స్ తర్వాత యోని రిలాక్స్ అవుతుంది. ఈ కుదుపుల వల్ల గర్బాశయం గోడలు కదిలి అక్కడున్న లైనింగ్ వూడి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. 

6. యాస్ప్రిన్ ప్రయత్నించండి.

తలనొప్పి, ఇతర నొప్పుల కోసం.. ఇది మనం అప్పుడప్పుడూ తీసుకునే మందే. కానీ దీనిలో పిరియడ్స్‌ని రెగ్యులరైజ్ చేసే మందు కూడా దాగి ఉందని మీకు తెలుసా? చాలామంది పిరియడ్స్ ఆలస్యమైతే.. రెండు యాస్ప్రిన్ మాత్రలను తీసి పొడి చేసి అందులో తేనె నీళ్లు కలిపి తాగడం వల్ల.. పిరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

ADVERTISEMENT

7. వ్యాయామంలో మార్పులు..

చాలామంది చాలా తక్కువ లేదా ఎక్కువ వ్యాయామం చేస్తూ శరీరాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. దీనివల్ల కూడా పిరియడ్స్ ఆలస్యం అవుతాయి. వ్యాయామం చేయడం వల్ల మన శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. అవి ఈస్ట్రోజన్ స్థాయులను తగ్గిస్తాయి. తద్వారా పిరియడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే మరీ ఎక్కువగా వ్యాయామం చేస్తే ఒత్తిడి ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి.. మరీ ఎక్కువ లేదా తక్కువగా కాకుండా వ్యాయామం చేయడం మంచిది. 

8. బర్త్ కంట్రోల్ కోసం అడగండి.

పిరియడ్స్‌ని రెగ్యులేట్ చేయడానికి.. సాధారణంగా వైద్యులు బర్త్ కంట్రోల్ పిల్స్‌ని ఇస్తుంటారు. వీటిని 21 రోజుల పాటు ఉపయోగించి తర్వాత ఆపితే.. మూడు నుంచి ఆరు రోజుల వ్యవధిలో పిరియడ్స్ వచ్చేస్తాయి. మీకు ప్రతినెలా పిరియడ్స్ సరైన సమయానికి రాకపోతే.. కొన్ని నెలలు వీటిని ఉపయోగించడం మంచిది. వీటివల్ల పిరియడ్స్ సైకిల్ క్రమబద్ధమవుతుంది. అయితే వీటిని వైద్యుల పర్యవేక్షణలోనే ఉపయోగించాలి. లేదంటే ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. 

9. టబ్ బాత్ చేయండి.

ADVERTISEMENT

వేడి నీరు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. అందుకే టబ్ నిండా గోరువెచ్చని నీరు, చక్కటి పరిమళాలతో నిండిన టబ్‌లో స్నానం చేయండి. దీనికోసం కావాలంటే.. ఎస్సెన్షియల్ ఆయిల్స్ ఉపయోగించవచ్చు. ఇవి మీ ఒత్తిడిని ఇట్టే తగ్గించేస్తాయి. టబ్ బాత్ చేస్తూనే.. కాళ్లు చేతులను మసాజ్ చేసుకోవాలి. మీకోసం ఈ పని చేయమని మీ భాగస్వామిని కూడా కోరవచ్చు. ఇది చేయడం వల్ల రక్త ప్రసరణ బాగై పిరియడ్స్ సమయానికి వచ్చేస్తాయి. 

10. అల్లం మంచిదే..

పిరియడ్స్ సమయానికి రావడానికి.. అమ్మమ్మల కాలం నుంచి ఉపయోగిస్తున్న చిట్కా ఇది. అల్లం మన గర్భాశయ గోడలు ముడుచుకుపోయేలా చేస్తుందని అందరూ అంటుంటారు. దీనివల్ల పిరియడ్స్ త్వరగా వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనికోసం అల్లాన్ని నిమ్మరసంలో కలుపుకొని లేదా టీలో వేసుకొని తీసుకోవాలి. దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది. 

11. పసుపు ప్రయత్నించండి..

పసుపు మన శరీరంలో ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్ స్థాయులను సమతుల్యం చేస్తుంది. ఈ విధంగా పసుపు పిరియడ్ వచ్చేలా కూడా చేస్తుంది. దీనికోసం గోరువెచ్చని నీటిలో పసుపును వేసి తాగాలి. లేదా టీలో కలుపుకోవచ్చు. కావాలంటే టర్మరిక్ టీని కూడా తయారు చేసుకోవచ్చు.

ADVERTISEMENT

మీ పిరియడ్స్.. ఎందుకు సక్రమంగా రావడం లేదో మీకు తెలుసా?
కారణాలేవైనా.. పిరియడ్ రాకపోతే వైద్యుల దగ్గరికి వెళ్లడం అవసరం. ఆలోపు ఉపయోగించేందుకు మాత్రమే ఈ చిట్కాలు. 

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.

 

 

ADVERTISEMENT
05 Feb 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT