ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
ఉగాది రోజున మొదలైన శ్రావణ భార్గవి – హేమచంద్ర ల లవ్ స్టోరీ మీకు తెలుసా

ఉగాది రోజున మొదలైన శ్రావణ భార్గవి – హేమచంద్ర ల లవ్ స్టోరీ మీకు తెలుసా

సాధారణంగా ఏ రంగంలో ఉన్నవారు ఆ రంగంలోని వారిని ప్రేమించి పెళ్లాడడం మనం టాలీవుడ్ లోెనే కాదు.. చాలా చోట చూస్తుంటాం. అలా  గాయకులు (singers) తమ తోటి సింగర్స్ తో స్నేహం చేయడం, అది క్రమంగా ఇష్టంగా మారి తరువాత కాలంలో వివాహం చేసుకోవడం కూడా కామన్ గా జరుగుతోంది. ఇలా ఒకే రంగానికి చెందిన వారు జీవిత భాగస్వాములు అయినా వారి జాబితా చాలా పెద్దగానే ఉంది. ఆ జాబితాలో ఓ ముఖ్యమైన జంట గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఆ జంట మరెవరో కాదు – శ్రావణ భార్గవి (shravana bharghavi) & హేమచంద్ర (hemachandra).

ట్విట్టర్ లో కలిశారు.. జీవితంలో ఒక్కటయ్యారు.. రాహుల్ – చిన్మయి ల అందమైన ప్రేమ కథ..

అయితే వీరిద్దరి ప్రేమకథ (love story) 2009 సంవత్సరం ఉగాది (ugadi) రోజున మొదలైందట. అదెలాగంటే – అప్పుడు గాయకుడిగా & సంగీత దర్శకుడిగా ఉన్న హేమచంద్ర .. రైడ్ అనే చిత్రానికి సంగీతం అందిస్తుండగా ఒక కొత్త గాత్రం కోసం వెతుకుతున్న సందర్భంలో శ్రావణ భార్గవి వివరాలు తెలిశాయట. అలా ఆమెతో తొలిసారి ఫోన్ లో మాట్లాడిన తరువాత పాట రికార్డింగ్ కోసం తన ఇంటికి పిలిచారట హేమచంద్ర. అలా ఈ ఇద్దరి తొలి పరిచయం జరిగింది.

వీరి తొలి పరిచయం లోనే శ్రావణ భార్గవి అంటే ఇష్టం కలిగిందట హేమచంద్రకి.. అయితే స్వభావం రీత్యా కాస్త రిజర్వ్ గా ఉండే శ్రావణ భార్గవితో ఎలా పరిచయం పెంచుకోవాలి అని ఆలోచిస్తూ తొలిసారిగా మెసేజ్ చేయడం జరిగిందట. అలా వీరిద్దరి మధ్య మొదలైన సంభాషణ కొద్దిసేపటి వరకు బాగానే జరిగిన సరిగ్గా రాత్రి 9 గంటలు అయ్యేసరికి ఆగిపోయిందట.

ADVERTISEMENT

అలా ఒక్కసారిగా మెసేజ్ ఎందుకు ఆపేసింది అన్న ఆత్రుతతో ఆమెకి ఫోన్ చేయగా.. రాత్రి 9 గంటలు అయింది కాబట్టి ఇప్పుడు నాతో మాట్లాడాలంటే మా అమ్మ అనుమతి తీసుకో అని చెప్పిందట. ఇలా చెప్పడంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడట హేమచంద్ర. అయితే ఆ షాక్ నుండి తేరుకుని.. నెమ్మదిగా ఆమెతో రోజు మాట్లాడడం ప్రారంభించాడట. ఆ మాట్లాడడం తరువాత కాలంలో బయట కలవడం & వీలు చిక్కినప్పుడల్లా శ్రావణ భార్గవి ని కాలేజీ లో దిగబెట్టడం & పికప్ చేసుకోవడం వరకు వచ్చిందట.

మాది 100 % ‘లవ్ స్టోరీ’ – సింగర్ గీతా మాధురి & యాక్టర్ నందు ..!

ఇదంతా వీరిమధ్య జరుగుతున్నప్పుడే, ఈ ఇద్దరికి కూడా ఒకరిపట్ల మరొకరికి ఉన్న ఇష్టం అర్ధమైందట. అలా అర్థమయ్యాక కొన్ని రోజులకి ఆమెకి తన ప్రేమ గురించి వెల్లడించాలని భావిస్తూ ఆ ప్రస్తావన తీసుకురావడానికి ప్రయత్నించినా శ్రావణ భార్గవి ఆ టాపిక్ రానివ్వనిచ్చేది కాదట. కానీ ఒకరోజు కారు లో కూర్చున్నప్పుడు ఏదైతే అది జరిగింది అని తెగించి తన మనసులో మాటని హేమచంద్ర చెప్పడం జరిగిందట. దానికి సమాధానంగా అయ్యో చెప్పేసావా!! అంటూ తన ప్రేమని కూడా వ్యక్తపరిచిందట శ్రావణ భార్గవి.

ఇక వీరి ప్రేమ వ్యవహారం గురించి హేమచంద్ర ఇంటిలో కొంత తెలిసినిప్పటికి శ్రావణ భార్గవి ఇంటిలో కేవలం వాళ్ళ అమ్మకి మాత్రమే తెలుసునట. ఈ తరుణంలో వీరిద్దరి ప్రేమ వ్యవహారం ఈ ఇరువురి ఇళ్ళల్లో తరువాత తెలియడం & ఇరువైపులా కూడా పెద్దలు ఒప్పుకోవడంతో వీరి ప్రేమ పెళ్ళికి దారితీసింది. 9 డిసెంబర్ 2011లో వీరిద్దరి నిశ్చితార్ధం జరుగగా 14 ఫిబ్రవరి 2013లో వీరి వివాహం జరిగింది. ఆ తరువాత కాలంలో ఈ ఇద్దరి ప్రేమకి గుర్తుగా చంద్రిక అనే అమ్మాయి పుట్టింది.

ADVERTISEMENT

ప్రస్తుతం శ్రావణ భార్గవి నేపథ్య గాయనిగా, హేమచంద్ర పాడడంతో పాటుగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరు ప్రతిష్టలని సంపాదించుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో రియాల్టీ షోలు & స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చిన వీరిరువురు వృత్తిపరంగా ఇంకా చాలా ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షిద్దాం. 2009లో ఉగాది రోజున మొదలైన వీరి ప్రేమకి దశాబ్దం పూర్తవ్వగా వీరు ఇలాంటి దశాబ్దాలు మరెన్నో కలిసుండాలని కోరుకుందాం..

‘ఉప్పెనంత ప్రేమ’కి సాక్ష్యం అంటున్న.. డ్యాన్స్ మాస్టర్ రఘు & సింగర్ ప్రణవి

02 Nov 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT