logo
Logo
User
home / Bigg Boss
రాహుల్ సిప్లిగంజ్ ని సున్నితంగా మందలించిన శ్రీముఖి తల్లి లత!

రాహుల్ సిప్లిగంజ్ ని సున్నితంగా మందలించిన శ్రీముఖి తల్లి లత!

బిగ్ బాస్ తెలుగు (bigboss telugu) సీజన్ల్ 3 లో గత మూడు ఎపిసోడ్ల నుంచి జరుగుతున్న బిగ్ బాస్ హోటల్ టాస్క్ నిన్నటి ఎపిసోడ్ తో ముగిసింది. నిన్నటితో బిగ్ బాస్ హౌస్ కి అతిథులు రావడం కూడా పూర్తయింది. ఈ సందర్భంగా  బిగ్ బాస్ ఇంటికి వరుణ్ సందేశ్ బామ్మ రాజ్యలక్ష్మి , రాహుల్ సిప్లిగంజ్ (rahul sipligunj) అమ్మ సుధా రాణి & శ్రీముఖి (sreemukhi) తల్లి లత (latha) రావడం జరిగింది. ఈ ముగ్గురి రాక తో బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని వాళ్ళ కుటుంబసభ్యులు కలిసే ప్రక్రియ పూర్తయింది.

అలీ కి రొమాంటిక్ ట్రీట్.. బాబా భాస్కర్ కి ఫ్యామిలీ ప్యాక్ ఆనందం..

అయితే ఇంటిలోకి వచ్చిన ముగ్గురు కూడా తమదైన శైలిలో అటు ఇంటిసభ్యులతో పాటు ఇటు ప్రేక్షకులని అలరించారు. ముందుగా వరుణ్ సందేశ్ బామ్మ రాజ్యలక్ష్మి ఇంటిలోకి రావడం.. ఆమె ఇంటిసభ్యులందరిని తన మనవళ్ళు & మనవరాళ్ళు లాగే ఉన్నారు అని అంటూ అందరిని చుట్టూ కూర్చుపెట్టుకుని మాట్లాడడం జరిగింది. ఆ సమయంలోనే దీపావళి ఎప్పుడు అని ఇంటిసభ్యులు అడగగా.. వస్తుంది త్వరలోనే అంటూ చెప్పకుండా దాటేసింది. దీనితో బిగ్ బాస్ మిమ్మల్ని సమయం, తేదీలు చెప్పకూడదు అని చెప్పారా అని అంటే అవును అని చెప్పింది.

అలాగే బిగ్ బాస్ ని ఆమె కొన్ని ప్రశ్నలు వేశారు.. 

బిగ్ బాస్ గారు మీరు ఎలా ఉంటారు?

బిగ్ బాస్ గారు మీ ఫోటో ఉంటే పంపించండి..

బిగ్ బాస్ గారు మా ఇంటి అడ్రస్ ఇస్తాను, మీరు తప్పకుండా రావాలి..

ఇటువంటి ఫన్నీ ప్రశ్నలు చాలా అమాయకంగా అడిగారు. అలాగే మిగతా ఇంటిసభ్యులు కూడా ఇలా ఇన్ని రోజులు ఇంటిలో ఉండడం చాలా గొప్ప అని చెబుతూనే ఇంటిలో ఉన్న వారందరిని యోగక్షేమాలు అడిగి తెలుసుకుంది. అందరు చక్కగా ఉన్నారు అంటూ చెప్పి వెళ్ళింది.

Bigg Boss Telugu 3 : వరుణ్ సందేశ్ & శివజ్యోతి కారణంగా నామినేషన్స్ లోకి మొత్తం ఇంటిసభ్యులు

ఆ తరువాత రాహుల్ సిప్లిగంజ్ తల్లి సుధారాణి ఇంటిలోకి వచ్చారు.. ముందుగా రాహుల్ సిప్లిగంజ్ ఏమైనా అంటే అవి దయచేసి తప్పుగా తీసుకోకండి అని చెప్పారు. రాహుల్ కి మనసులో ఏది అనిపిస్తే అది ఆలోచించకుండా అనేస్తాడు తప్ప.. ఎదుటివాళ్ళని బాధపెట్టాలి అని మాత్రం కాదు, రాహుల్ కి కొంచెం బద్ధకం అని కూడా చెప్పడంతో ఇంట్లో వాళ్ళంతా కూడా సరదాగా నవ్వుకున్నారు. అయితే రాహుల్ కి మాత్రం బాగా పాటలు పాడు.. టాస్కులు కూడా బాగా ఆడమని చెప్పింది.

ఇక ఆఖరుగా శ్రీముఖి తల్లి అయిన లత ఇంటిలోకి ప్రవేశించడం జరిగింది. అలా ఇంటిలోకి ప్రవేశించిన ఆమెని తొలుత శ్రీముఖిని చూసిన వెంటనే బయటకి పంపించడం జరిగింది. దీంతో శ్రీముఖి కన్నీళ్ల పర్యంతం అయింది. ఆ తర్వాత ఆమెను మళ్లీ ఇంటిలోకి పంపించారు బిగ్ బాస్. ఇక లత ఇంటి సభ్యులైన రాహుల్ సిప్లిగంజ్ తో మాట్లాడుతూ.. మీరు ఏదైనా ఉంటే మాట్లాడుకోండి తప్ప .. పోట్లాడుకోకండి అని చెప్పడం జరిగింది. మీ తల్లిదండ్రులు కూడా బయట ఉండి చూస్తారు కాబట్టి వారు బాధపడతారు.. అని చెప్పడంతో ఇంటిసభ్యుల్లో ఈ అంశం పై ఆమె వెళ్ళిపోయాక కొంచెం చర్చ జరిగింది.

అలాగే శ్రీముఖి తో మాట్లాడేటప్పుడు నువ్వు చాలా బాగా ఆడుతున్నావు..ఎవరైనా నిన్ను తిట్టినా సరే నువ్వు వాటికి సమాధానమివ్వకుండా ఉండు… నీ ఆటతో మా మనసులు గెల్చుకున్నావు.. ముఖ్యంగా డాడీ చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పింది లత.

ఇక ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ లో సినిమాల్లో వచ్చిన ప్రముఖ పాత్రల్లో ఇంటి సభ్యులు కనిపించబోతున్నారు. అందులో బాషా పాత్రలో బాబా భాస్కర్ , కాంచన గా రాహుల్ సిప్లిగంజ్ , సావిత్రి పాత్రలో శ్రీముఖి, చంద్రముఖిగా శివజ్యోతి, దేవసేన గా వితిక , బాహుబలిగా వరుణ్ సందేశ్, గజినీ గా అలీ రెజా కనిపించబోతున్నారు. వీరంతా కూడా ఈ పాత్రల్లో నేటి ఎపిసోడ్ లో ప్రేక్షకులని ఆకట్టుకోబోతున్నారు.

ఏదేమైనా.. కుటుంబసభ్యులు వచ్చి కలిస్ వెళ్ళాక వారి సలహాలు తీసుకున్న తర్వాత ఇంటి సభ్యుల ప్రవర్తనలో ఏదైనా మార్పు వస్తుందేమో చూడాలి…

Bigg Boss Telugu 3: కుండ బద్దలు కొట్టి నిజాలు చెప్పిన.. బిగ్ బాస్ ఇంటి సభ్యులు ..!

18 Oct 2019

Read More

read more articles like this
good points logo

good points text