ADVERTISEMENT
home / ఫ్యాషన్
వావ్.. అనిపించే ఫ్యాషన్స్‌తో అదరగొడుతున్న విష్ణుప్రియ..!

వావ్.. అనిపించే ఫ్యాషన్స్‌తో అదరగొడుతున్న విష్ణుప్రియ..!

విష్ణుప్రియ (Vishnu priya).. బుల్లితెరపై యాంకర్‌గా తన సత్తా చాటుతున్న ఈతరం అమ్మాయి. చక్కని మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాత్రమే కాదు.. అంతకుమించిన అందమైన ఫ్యాషన్స్ (Fashions) తో యువత చూపుని సైతం తనవైపు తిప్పుకుందీ సుందరి. సందర్భానికి తగినట్లుగా చక్కని డ్రస్సింగ్‌తో తనని తాను అందంగా ప్రెజెంట్ చేసుకునే ఈ ముద్దుగుమ్మ స్టైల్ ఫైల్‌లో కొన్ని ఫ్యాషన్స్‌ని మనమూ ఓసారి చూసేద్దాం రండి..

 

ఈ రోజుల్లో అకేషన్ ఏదైనా సరే.. ట్రెడిషనల్‌గా కనిపిస్తూనే ట్రెండీగా కూడా మెరిసిపోవాలంటే అది చూడచక్కని చీరకట్టుతోనే సాధ్యం. మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా చీర కూడా తన రూపురేఖలు మార్చుకుంటూ వస్తోంది. అలాంటి వాటిలో ఈ డిజైనర్ శారీ కూడా ఒకటి. విష్ణు ప్రియ కట్టుకున్న పర్పుల్ అండ్ గోల్డ్ కాంబినేషన్ చీర చూడండి. ఎంత బాగుందో.. వాటికి సింపుల్ గా స్టేట్ మెంట్ ఇయర్ రింగ్స్ జత చేసి భలే స్టైలిష్ లుక్‌లో మెరిసిపోయింది విష్ణుప్రియ.

 

ADVERTISEMENT

ఫ్యాషన్ ప్రపంచంలో ఎన్ని కలర్స్, ట్రెండ్స్ వచ్చినప్పటికీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌కు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే యువత ఈ కలర్ కాంబినేషన్‌లో ఉన్న అవుట్ ఫిట్స్‌ను తప్పకుండా తమ వార్డ్ రోబ్‌లో భాగం చేసుకుంటూ ఉంటారు. విష్ణు ప్రియ కూడా ఇందుకు అతీతం ఏమీ కాదు. నలుపు రంగు అంచు ఉన్న తెలుపు రంగు చీరలో తారకలా కనిపిస్తోంది కదూ..

 

కాలేజీ అమ్మాయిలు ఈ రోజుల్లో ఎక్కువగా ఆదరిస్తున్న ట్రెండ్స్‌లో లాంగ్ గౌన్స్ కూడా ఒకటి. వీటిలోనూ వన్ షోల్డర్ గౌన్స్ మన లుక్‌ని నలుగురిలోనూ ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కావాలంటే విష్ణు ప్రియని చూడండి. లైట్ గ్రీన్ కలర్ వన్ షోల్డర్ గౌన్‌లో రెడ్ లిప్స్‌తో స్టైల్ గాడెస్‌లా మెరిసిపోతోంది.

 

ADVERTISEMENT

మెరూన్ కలర్ లెహెంగాలో కళకళలాడిపోతున్న విష్ణుప్రియను చూశారా?? రఫెల్ తరహాలో డిజైన్ చేసిన బ్లౌజ్‌తో లెహెంగాకే ఒక స్పెషల్ లుక్‌ని తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది కదూ.. సింపుల్ హెయిర్ స్టైల్ ఒక్కటి మ్యాచ్ చేసి ఎలాంటి యాక్సెసరీస్ ఉపయోగించకుండానే కుందనపు బొమ్మని తలపిస్తోంది.

 

లంగా ఓణీ.. చీర తర్వాత సంప్రదాయబద్ధమైన లుక్‌లో మెరిసిపోయేందుకు కాలేజీ అమ్మాయిలు ఎక్కువగా ఎంపిక చేసుకునే అవుట్ ఫిట్. ఇందులో ఓణీని రకరకాలుగా వేసుకోవడం ద్వారా భిన్నమైన లుక్స్‌లో మెరిసిపోతూ కనిపిస్తారు కాలేజీ అమ్మాయిలు. ఇదుగో.. మన విష్ణుప్రియ కట్టుకున్న స్టైల్ కూడా వాటిలో ఒకటి.

 

ADVERTISEMENT

పెళ్లిళ్లు, ఫంక్షన్స్ వంటి శుభకార్యాలకు హాజరయ్యే సమయంలో మన లుక్ సింపుల్‌గా ఉంటూనే మనల్ని అందంగా కనిపించేలా చేయాలని ప్రతి అమ్మాయి ఆశపడుతుంది. మీరూ అంతేనా?? అయితే మన విష్ణుప్రియను ఫాలో అయిపోండి. మెడలో చక్కని నెక్లెస్, పాపడి బిళ్ల, ఆకర్షణీయమైన ఇయర్ రింగ్స్.. తో తన లు‌క్‌ని పూర్తి చేసిన ఈ భామ చందమామని తలపిస్తోంది కదూ..

 

కాలేజీ అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే ట్రెండ్స్‌లో స్కర్ట్స్ కూడా ఒకటి. అయితే కొందరు షార్ట్‌గా ఉన్నవి ఎంపిక చేసుకుంటే; ఇంకొందరు లాంగ్ స్కర్ట్స్‌కు మ్యాచింగ్ టాప్ ధరించి అందరి చూపునూ తమవైపు తిప్పుకుంటూ ఉంటారు. విష్ణుప్రియ కూడా అదే ఫాలో అయింది. ఆకర్షణీయమైన కలర్ కాంబినేషన్‌లో ఉన్న ఈ అవుట్ ఫిట్‌లో అందమైన ముద్దుగుమ్మ మరింత అందంగా మెరిసిపోయింది.

 

ADVERTISEMENT

నేటి యువత ఎక్కువగా ఎంచుకుంటున్న ట్రెండ్స్‌లో పలాజో ప్యాంట్స్ కూడా ఒకటి. ప్రస్తుతం సమ్మర్ కాబట్టి లైట్ షేడ్‌లో ఉన్న ఒక బాటమ్‌ని సెలక్ట్ చేసుకుని దానికి తగ్గట్టుగా టాప్ వేసుకుంటే.. ఆ లుక్ అదిరిపోవాల్సిందే.. కావాలంటే విష్ణుప్రియను చూడండి. ఆమె కూడా ఇదే ట్రెండ్‌ని ఫాలో అయింది మరి..

ఇవి కూడా చదవండి

ఫ్యాషన్ క్వీన్ ‘అను ఇమ్మాన్యుయెల్’ను ఫాలో అవ్వండి .. మీరూ స్టైలిష్ లుక్‌లో మెరిసిపోండి..!

అందంలోనే కాదు.. ఫ్యాష‌న్స్‌లో కూడా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ అదుర్సే..!

ADVERTISEMENT

మన అందాల ‘వ‌ర్షిణి’ ఫ్యాష‌న్స్ ఫాలో అయిపోండి.. మీరూ క్యూట్ అనిపించుకోండి..!

09 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT