ADVERTISEMENT
home / Bigg Boss
Bigg Boss Telugu 3: హోరాహోరీ పోరులో.. శ్రీముఖి, మహేష్‌లను ఓడించి కెప్టెన్ అయిన వితిక

Bigg Boss Telugu 3: హోరాహోరీ పోరులో.. శ్రీముఖి, మహేష్‌లను ఓడించి కెప్టెన్ అయిన వితిక

బిగ్ బాస్ తెలుగు (Bigg Boss telugu) ‘సీజన్ 3’లో  ఇంటి అయిదవ కెప్టెన్‌గా.. అలాగే రెండవ మహిళా కెప్టెన్‌గా వితిక ఎంపికవ్వడం విశేషం. నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా హోరాహోరీగా జరిగిన పోరులో.. మిగతా కంటెస్టెంట్స్ అయిన శ్రీముఖి & మహేష్‌లతో వితిక పోటీపడి గెలుపొందడం జరిగింది.

Bigg Boss Telugu 3: బిగ్ బాస్‌ని నిందించారు.. అందుకే పునర్నవి, శ్రీముఖిలకి శిక్ష పడిందా?

ఈ కెప్టెన్సీ టాస్క్ పేరు – బరువులు ఎత్తగలవా? జెండా పాతగలవా? ఈ టాస్క్‌లో భాగంగా పోటీపడే శ్రీముఖి, మహేష్ విట్టా, వితికలకి సహాయం చేయడానికి.. అలాగే టాస్క్‌ను పూర్తిచేయడానికి వారు సహాయకులను ఎంచుకోవాలి. ఈ సహాయకులు తమ కంటెస్టెంట్స్‌ని వెనక్కి ఎక్కించుకొని.. వారికంటూ ఏర్పాటు చేసిన లైన్‌లో వెళుతూ.. ఒకవైపున ఉన్న జెండాని తీసి మరోవైపు పెట్టాలి.

బిగ్ బాస్ టాస్క్ బజర్ మోగించాక టాస్క్ ప్రారంభమై.. మరలా టాస్క్ బజర్ వినిపించే వరకూ ఈ పోటీ కొనసాగుతుంది. ఈ క్రమంలో ఎవరు ఎక్కువ జెండాలు అవతలిపక్క పెట్టగలిగితే.. వారే టాస్క్ విజేతలవుతారు. ఇదీ ఈ టాస్క్ పద్ధతి. 

ADVERTISEMENT

ఈ టాస్క్‌లో వితికకి (Vithika) సహాయకుడిగా వరుణ్ సందేశ్ వ్యవహరించగా, శ్రీముఖికి (Sreemukhi) రవికృష్ణ సహాయకుడిగా పోటీలో పాల్గొన్నాడు. ఇక మహేష్ విట్టాకి (Mahesh Vitta) సహాయకురాలిగా శివజ్యోతి వ్యవహరించడం జరిగింది. అలా మొదలైన ఈ టాస్క్‌లో మూడు జంటలు కూడా దాదాపు.. సమానంగా పోటీపడ్డాయి అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మూడు జంటలకు మధ్య ఉన్న వ్యత్యాసం.. కేవలం ఒక్క పాయింట్ మాత్రమే.

శ్రీముఖి – రవికృష్ణల జంట 20 జెండాలు పాతితే.. మహేష్  – శివజ్యోతిల జంట 21 జెండాలు పాతింది. ఇక ఈ టాస్క్ విజేతగా నిలిచిన వితిక తన పార్టనర్ వరుణ్ సందేశ్‌తో కలిసి 22 జెండాలు పాతడం విశేషం. అలా ఒక్క పాయింట్ తేడాతో.. ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌లో విజేతగా నిలిచింది వితిక.

Bigg Boss Telugu 3: బాబా భాస్కర్, శ్రీముఖిల మధ్య విభేదాలు మొదలయ్యాయా?

ఇదిలావుండగా నిన్న బిగ్‌బాస్ ఇచ్చిన షూ పాలిష్ టాస్క్‌ని చేయడానికి నిరాకరించిన పునర్నవి… చివరికి వరుణ్ సందేశ్ చెప్పిన మాటలకి ఒప్పుకుని.. ఆ టాస్క్‌ని పూర్తి చేయడం జరిగింది. అలా ఎట్టకేలకి పునర్నవి కూడా టాస్క్ పూర్తి చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అంతకముందే మహేష్ విట్టా, శ్రీముఖిలు కూడా  అదే టాస్క్ పూర్తి చేసేశారు. దీంతో ఈ ముగ్గురికి కూడా లగ్జరీ బడ్జెట్ లభిస్తుందని బిగ్ బాస్ ప్రకటించారు.

ADVERTISEMENT

ఇక పునర్నవి ఈ షూ పాలిష్ టాస్క్ పూర్తి చేసాక “తను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే.. అందుకు తనను క్షమించమని’ కోరింది. అయితే  ఆ దెయ్యాల టాస్క్ మాత్రం తనకి నచ్చలేదని మరోసారి నిర్మొహమాటంగా తెలిపింది.

ఇక కెప్టెన్సీ టాస్క్ ముగిశాక, రాహుల్ సిప్లిగంజ్, పునర్నవిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ‘టాస్క్ చేస్తాను అని చెప్పడం కాదు. చివరి వరకు చేయాలి.. నువ్వయితే చేయలేవు’ అని రాహుల్‌ని ఉద్దేశించి పునర్నవి కామెంట్స్ చేసింది.

ఆ కామెంట్స్‌కి కోపం తెచ్చుకున్న రాహుల్.. ఇంకొకసారి కామెంట్స్ చేసేటప్పుడు.. కాస్త ఆలోచించి చేయమని పునర్నవి పై ఫైర్ అయ్యాడు. 

ఇలా ఒక వైపు చిన్న చిన్న గొడవలు..  ఇంట్లో వంట చేసుకునే దగ్గర అలకలు ప్రారంభమవ్వడంతో.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో.. 8వ వారం దాదాపు పూర్తికావడానికి దగ్గరకు వచ్చేసింది. ఇంకొక మూడు రోజుల్లో ఈ వారం పూర్తికాబోతుంది.                                                

ADVERTISEMENT

నేను తప్పు చేయలేదు, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ నేను చేయను : పునర్నవి

12 Sep 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT