ఈ వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా.. మీ ప్రేయ‌సికి ఈ బ‌హుమతులు ఇచ్చి చూడండి..!

ఈ వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా.. మీ ప్రేయ‌సికి ఈ బ‌హుమతులు ఇచ్చి చూడండి..!

ఎదుటి వ్య‌క్తికి మ‌నం ఎంత విలువ ఇస్తామో వారికి తెలియ‌జేయాల‌న్నా.. మ‌న మ‌న‌సులో వారి స్థానం గురించి సూచ‌న‌ప్రాయంగా చెప్పాల‌న్నా చ‌క్క‌ని బ‌హుమ‌తి (Gift) అందించ‌డం మామూలే! మాములు స‌మ‌యంలోనే మ‌నం ఇచ్చే బ‌హుమ‌తి ఎంతో ప్ర‌త్యేకంగా ఉండాల‌ని భావించే మ‌నం.. వాలెంటైన్స్ డే (valentines day)వంటి ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో మ‌న‌సు దోచుకున్న వారిని ఆక‌ట్టుకునేందుకు మ‌రింత స్పెష‌ల్ గిఫ్ట్ ఇవ్వాల‌ని అనుకోవ‌డం స‌హ‌జ‌మే. అందుకే చాలామంది ప్రేమికుల రోజుకు కొద్ది రోజుల ముందు నుంచే త‌మ భాగ‌స్వామికి ఎలాంటి గిఫ్ట్ కొనివ్వాలా అని త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డుతూ ఉంటారు.


నాణానికి ఒక‌వైపు ఇలా ముంద‌స్తు ప్ర‌ణాళిక‌తో వెళ్లేవారు ఉంటే.. మ‌రోవైపు ప‌లు కార‌ణాల వ‌ల్ల అప్ప‌టిక‌ప్పుడు బ‌హుమ‌తులు కొనిచ్చేవారు కూడా లేక‌పోలేరు. అయితే బ‌హుమ‌తి ఏదైనా స‌రే.. అందంగా ఉంటూ ఎదుటి వారిని ఆక‌ట్టుకోవ‌డంతో పాటు వారికి ఉప‌యోగ‌డేలా ఉండాల‌ని కూడా మ‌నం భావిస్తుంటాం. అలాగే ఇంకొంద‌రు తాము ఇచ్చే బ‌హుమ‌తితోనే త‌మ మ‌న‌సుని ఎదుటివారికి తెలియ‌జెప్పే ప్ర‌య‌త్నాలు కూడా చేస్తుంటారు. బ‌హుమ‌తి ఇవ్వ‌డం వెనుక ఉన్న అర్థం ఏదైనా స‌రే.. దానికి ఉన్న ప్రాధాన్య‌త‌ను మాత్రం.. అది మ‌రింత‌గా పెంచుతుంద‌నే చెప్పాలి.


ఏంటీ?? మీరు కూడా మీ వాలెంటైన్‌కి ఏం బ‌హుమ‌తి ఇవ్వాలో ఇంకా నిర్ణ‌యించుకోలేదా?? అయితే ఇక్క‌డ మేం కొన్ని లాస్ట్ మినిట్ ఐడియాస్ ఇస్తున్నాం చూడండి. ఇవి చాలా సాదాసీదాగా అనిపించిన‌ప్ప‌ట‌కీ.. ఎదుటివారికి వీటిలో ఏదో ఒక‌టి త‌ప్ప‌కుండా న‌చ్చే తీరుతుంది. మ‌రి, ఈ బ‌హుమ‌తులేంటో మీరు ఓసారి చూసేయండి..


vday


గ్రీటింగ్ కార్డ్ (Greeting Card)


ఎన్ని టెక్నాలజీలు వచ్చినా సరే.. మీ మనసులో ఉన్న భావానికి అక్షర రూపం ఇచ్చి ఎదుటివారికి మీ ప్రేమ ఎలాంటిదో చెప్పేందుకు కచ్చితంగా ఉపయోగ‌ప‌డే బ‌హుమతుల జాబితాలో గ్రీటింగ్ కార్డ్ (Greeting Card) ఎప్పుడూ ముందు వ‌రుస‌లోనే ఉంటుంది. మీరు దీనిని ఇంకా స్పెష‌ల్‌గా ఇవ్వ‌ద‌లుచుకుంటే.. కాస్త స‌మ‌యం వెచ్చించి మీరే స్వ‌యంగా మీ చేతుల‌తో ఒక అంద‌మైన గ్రీటింగ్ కార్డ్ త‌యారుచేసి మీ ల‌వ‌ర్‌కి ఇచ్చి చూడండి. వారి క‌ళ్ల‌లో ఆనందాన్ని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేరు.హ్యాండ్ బ్యాగ్ (Hand Bag)


అమ్మాయిలు రోజూ త‌ప్ప‌నిస‌రిగా ఉప‌యోగించే యాక్సెస‌రీస్‌లో హ్యాండ్ బ్యాగ్ కూడా ఒక‌టి. వారికి అవ‌స‌ర‌మ‌య్యే మేక‌ప్ ఉత్ప‌త్తులతో పాటు చిన్న చిన్న యాక్సెస‌రీస్ కూడా వీటిలో తీసుకెళ్తుంటారు. వీటిలో కూడా ప్ర‌స్తుతం ఎన్నో డిజైన్స్ అందుబాటులో ఉంటున్నాయి. వాటిలో మీ నెచ్చెలి మ‌న‌సుకు నచ్చేలా ఉన్న డిజైన్ ని ఎంపిక చేసి బ‌హుమ‌తిగా ఇచ్చి చూడండి. దానిని చూసిన ప్ర‌తిసారీ మీరు ఆమెకు గుర్తు రావ‌డం ఖాయం.సన్ గ్లాసెస్ (Sun Glasses)


ఇది ద్విచక్రవాహనాలు నడిపేవారికి ఉపయోగకరంగా ఉండే వస్తువు. అంతేకాదు.. సింపుల్ గా ఉన్న లుక్ ని కాస్త స్టైలిష్‌గా చేసి చూపాలంటే స‌న్ గ్లాసెస్ ఉండి తీరాల్సిందే! ఇక ప్ర‌స్తుతం ఉన్న ట్రాఫిక్, కాలుష్యం వంటి స‌మస్య‌ల నేప‌థ్యంలో క‌ళ్ల ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షించ‌డంలో వీటి పాత్ర చాలా కీల‌క‌మ‌నే చెప్పాలి. అందుకే మీరు మీ ల‌వ‌ర్ కు మంచి స‌న్ గ్లాసెస్ ఎంపిక చేసి బ‌హుమ‌తిగా ఇచ్చి చూడండి. మీపై త‌ప్ప‌కుండా మంచి అభిప్రాయం ఏర్ప‌డుతుంది.


romeo-1


పుస్తకం (Book)


పుస్తకం ఒక మంచి నేస్తం లాంటిది అని అంటుంటారు. నిజంగా మీ ఇష్టసఖి కాస్త సాహిత్యం లేదా పుస్తక పఠనంపై ఆసక్తి చూపేవారైతే కచ్చితంగా ఆమె ఇష్టాయిష్టాలను గుర్తెరిగి ఒక మంచి పుస్తకాన్ని ఆమెకి బహుమతిగా ఇవ్వండి. అది చదివినంతసేపు & చదివాక కూడా ఆ పుస్తకాన్ని ఇచ్చిన మీ గురించి మాత్రం తప్పక ఆలోచిస్తారు.


ramleela


 సినిమా (Movie Date)


ఈరోజుల్లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయి అనే అంశాన్ని పక్కనపెడితే... మీకు నచ్చిన అమ్మాయితో కలిసి ఒక రెండు గంటల పాటు కూర్చోవడమనేది ప్రేమించే తొలిరోజుల్లో చాలా థ్రిల్లింగ్ గా అనిపించే అంశం. అలాంటిది ప్రేమికుల రోజు నాడు ఏదైనా ఒక సినిమాకి తీసుకెళ్లి మూడు గంటల పాటు సినిమా చూస్తూ మీకు నచ్చిన వ్యక్తితో గడపడమనేది నిజంగా ఓ మరిచిపోలేని అనుభూతి అనే చెప్పాలి.ఫుడ్ (Food or Dinner Date)


భర్త మనసుని భార్య తన వంట ద్వారా గెలుచుకుంటుంది అని అంటుండేవారు పెద్ద‌లు. ఇప్పుడు ఈ మాట‌ను లింగ‌
భేదం లేకుండా ప్ర‌తిఒక్క‌రూ ఫాలో అవుతున్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రు స‌మ‌యం వెచ్చించి ప్రేయ‌సికి న‌చ్చిన ఫుడ్ ఐట‌మ్ త‌యారు చేసి రుచి చూపిస్తే.. ఇంకొంద‌రు ఇద్ద‌రికీ న‌చ్చిన వంట‌కాన్ని తింటూ ఎంజాయ్ చేయ‌డం ద్వారా ఆనందంగా గ‌డుపుతుంటారు. కాబ‌ట్టి మీరు కూడా వీటిలో ఏదో ఒక‌టి ఫాలో అయిపోండి. త‌ప్ప‌కుండా ఆమె ఇంప్రెస్ అయ్యే అవ‌కాశాలున్నాయి.పువ్వులు (Flowers)


అమ్మాయిలకి & పువ్వులకు మ‌ధ్య ఉండే సంబంధం ఎప్పుడూ ప్ర‌త్యేక‌మే. అందుకే ఇప్పటికి కూడా కోపంగా ఉన్న భార్యని శాంతింపచేయడానికి పూలని బహుమతిగా ఇచ్చే భర్తలు చాలామందే ఉన్నారు. పూలు మనిషిలో ఉన్న సంతోషాన్ని రెట్టింపు చేస్తాయని ఇప్పటికే చాలామంది చెప్పగా అది నిజమే అని కూడా మనకి చాలా సార్లు ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో అనుభవంలోకి వచ్చే ఉంటుంది. సో.. మీరు కూడా ఓ అంద‌మైన ఫ్ల‌వ‌ర్ బొకేతోనో లేక ఆక‌ర్ష‌ణీయ‌మైన గులాబీల‌తోనో మీ ప్రేమ‌ను వ్య‌క్తీక‌రించండి.


ఇవి కూడా చ‌ద‌వండి


పెళ్లికి ముందు వాలెంటైన్స్ డే.. పెళ్ల‌య్యాక ఆర్డిన‌రీ డే..!


ఒంటరిగానే ఉన్నా.. అయినా హ్యాపీగా వాలెంటైన్స్ డే జరుపుకొంటా..


వాలెంటైన్స్ డే నాడు.. ప్రేయ‌సి నుంచి ప్రియుడు కోరుకునేవి ఇవే..!