నేనే డేటింగ్ చేస్తున్నా.. కానీ ఆ వ్యక్తి పేరు చెప్పను : తాప్సీ పన్ను

నేనే డేటింగ్ చేస్తున్నా.. కానీ ఆ వ్యక్తి పేరు చెప్పను : తాప్సీ పన్ను

'ఝుమ్మందినాదం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై.. ఆ తర్వాత మొగుడు, గుండెల్లో గోదారి, మిస్టర్ పర్ఫెక్ట్, గేమ్ ఓవర్ లాంటి చిత్రాలలో నటించిన తాప్సీ పన్ను తరువాతి క్రమంలో.. బాలీవుడ్‌లో కూడా తన పాగా వేసింది. పింక్, బద్‌లా, మిషన్ మంగళ్ లాంటి చిత్రాలతో అక్కడ కూడా తన సత్తా చాటింది. ఇటీవలే ఆమె ఓ ఆసక్తికరమైన వార్తను మీడియాతో పంచుకుంది. తాను డేటింగ్‌లో ఉన్న మాట నిజమేనని.. కానీ ఆ వ్యక్తి ఎవరో అందరికీ చెప్పాల్సిన అవసరం లేదని తను తెలిపింది. 

అలాగే తనకు పిల్లలను కనాలని అనిపించే సమయంలోనే.. పెళ్లి గురించి ఆలోచిస్తానని చాలా బోల్డ్‌గా సమాధానమిచ్చింది తాప్సీ. అలాగే తాను ఇప్పుడు డేటింగ్ చేస్తున్న వ్యక్తి ఏ యాక్టరో లేదా క్రికెటరో కాదని కూడా హింట్ ఇచ్చింది తాప్సీ. ప్రస్తుతం తాప్సీ అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వస్తున్న "శాండ్ కీ ఆంఖ్" చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె 82 ఏళ్ల ప్రకాశీ తోమర్ పాత్రను పోషిస్తోంది. ప్రకాశీ తోమర్, చంద్రో తోమర్‌లు సీనియర్ సిటిజన్స్ అయినా.. తూటాలు పేల్చడంలో దిట్ట. వారి జీవిత కథే "శాండ్ కీ ఆంఖ్".

"అర్జున్ రెడ్డి" డైరెక్టర్ సందీప్ రెడ్డికి.. నటి తాప్సీ తాజా కౌంటర్..!

ఈ సినిమా కోసం.. అందులోని పాత్ర కోసం తాప్సీ ఎంతో కష్టపడింది. దీంతో పాటు "తడ్కా" అనే మరో హిందీ సినిమాలో కూడా తాప్సీ (Taapsee Pannu) నటిస్తోంది. తెలుగులో వచ్చిన "ఉలవచారు బిర్యానీ" సినిమాకి ఇది రీమేక్. ఇదే చిత్రంలో నానా పటేకర్, శ్రియా శరన్ కూడా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు.. తమిళంలో జయం రవి నటిస్తున్న మరో చిత్రంలో కూడా తాప్సీ నటిస్తోంది. 

ఆ ఆలోచనలను తరిమికొట్టాలంటే.. సినిమా ఒక్కటే మార్గం కాదు: తాప్సీ

ఢిల్లీలో ఓ పంజాబీ కుటుంబంలో జన్మించిన తాప్సీ, 2008లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా కంటెస్ట్‌లో కూడా పాల్గొంది. తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించింది. తమిళంలో తాప్సీ నటించిన "ఆడుకళం" చిత్రం ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ధనుష్ సరసన ఆమె ఈ చిత్రంలో నటించింది. అలాగే 'డబుల్స్' చిత్రం ద్వారా మలయాళ చిత్ర రంగంలోకి కూడా అడుగుపెట్టింది. తర్వాత 'చష్మే బద్దూర్' చిత్రంతో బాలీవుడ్‌లోకి కూడా ప్రవేశించింది.

జయహో మహిళ... "నారీ శక్తి"కి అసలైన నిర్వచనం.. ఈ గణతంత్ర దినోత్సవం

అలాగే "పింక్" చిత్రంలో నటనకు గాను ఐఫా.. తాప్సీని "ఉమన్ ఆఫ్ ది ఇయర్" పురస్కారంతో సత్కరించింది. అలాగే "నామ్ షబానా" చిత్రంలో నటనకు గాను జీ సినిమా నుండి "ఎక్స్‌ట్రార్డినరీ ఇంపాక్ట్ అవార్డు"ను కూడా కైవసం చేసుకుంది. అలాగే 'ముల్క్' చిత్రంలో నటనకు గాను.. జష్న్ ఏ యంగిస్థాన్ అవార్డును కూడా తాప్సీ కైవసం చేసుకుంది. అలాగే 'బారిష్ ఔర్ చౌమీన్'  మరియు 'నీతి శాస్త్ర' అనే రెండు లఘుచిత్రాలలో కూడా తాప్సీ తన నటనతో ఆకట్టుకుంది. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.