ADVERTISEMENT
home / వినోదం
టబు రాకతో.. అల్లు అర్జున్ కొత్త సినిమా రేంజ్ పెరిగిపోయిందా..?

టబు రాకతో.. అల్లు అర్జున్ కొత్త సినిమా రేంజ్ పెరిగిపోయిందా..?

టబు (Tabu).. ఆమె తరానికి చెందిన కథానాయికల్లో విలక్షణమైన నటిగా గుర్తింపు పొందింది. గ్లామర్, నటన రెండింటికీ సమప్రాధాన్యమిచ్చిన నటి టబు. సినిమా.. సినిమాకి నటనలో వైవిధ్యాన్ని కనబరిచిన గొప్ప నటిగా ఆమెకు పేరుంది. అందుకే టాలీవుడ్ (Tollywood), బాలీవుడ్ (bollywood) అనే తేడా లేకుండా.. అన్ని భాషల్లోనూ అభిమానులను సొంతం చేసుకుంది. అందుకే నేటి తరానికి చెందిన చాలామంది నటీమణులకు టబు రోల్ మోడల్‌గా నిలుస్తోంది.

బాలీవుడ్‌లో రెగ్యులర్‌గా సినిమాలు చేస్తున్నప్పటికీ.. టాలీవుడ్‌లో టబు నటించి చాలా కాలమే అవుతోంది. ఎప్పుడో 2008లో ‘పాండురంగడు’ సినిమా తర్వాత టబు తెలుగు తెరపై కనిపించలేదు. దాదాపు పదేళ్ల తర్వాత ఆమె మళ్లీ తెలుగు తెరపై మరోసారి మెరవనుంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రంలో టబు కీలకమైన పాత్రలో నటించనుంది.

AA19గా వ్యవహరిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. టబు సైతం షూటింగ్‌లో జాయినైంది. దీనికి సంబంధించిన వీడియోను గీతా ఆర్ట్స్ ట్విట్టర్లో పంచుకుంది. ఈ వీడియోలో నిండైన వస్త్రధారణలో అందంగా కనిపిస్తున్న టబు (Tabu) .. డైలాగులు ప్రాక్టీస్ చేస్తూ కనిపించడం గమనార్హవ. ఈ వీడియోను పోస్ట్ చేయడంతో పాటు ఆమెకు కృత‌జ్ఞ‌త‌లు చెప్పింది గీతా ఆర్ట్స్.

ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్‌తో కూడుకుందని తెలుస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించే విధంగా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. అల్లు అర్జున్, త్రివిక్రమ్ జోడీకి సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌గా పేరుంది. ఈ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కొడతారని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇఫ్పుడు ఈ సినిమాలో టబు కూడా నటించనుండటంతో.. సినిమాపై అంచనాలు మరింత ఎక్కువ అయ్యాయి.

ADVERTISEMENT

అల్లు అర్జున్ – త్రివిక్రమ్‌ల AA19 చిత్రం.. హాలీవుడ్ ఫ్రీ-మేకా?

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో గతంలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సూపర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. దీంతో వీరిద్దరి కలయికలో తెరకెక్కుతోన్న మూడో చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు పూజాహెగ్డే, నివేథా పెతురాజ్, నవదీప్, సుశాంత్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో భాగం కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి.

ఇప్పుడు ఈ టీంలోకి ప్రముఖ కథానాయిక టబు కూడా వచ్చి చేరడంతో ఈ సినిమాకి మరింత క్రేజ్ పెరిగింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాను హారిక, హాసినీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.

కూలీ నెం.1 చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు టబు. తెలుగులో ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువే. నిన్నే పెళ్లాడతా, సిసింద్రీ, ఆవిడా మా ఆవిడే, చెన్న కేశవ రెడ్డి, అందరివాడు, షాక్, ఇదీ సంగతి, పాండురంగడు సినిమాల్లో మాత్రమే నటించారు. అయినా తన అద్బుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులందరి అభిమానాన్ని చూరగొన్నారు టబు.

ADVERTISEMENT

మధ్యమధ్యలో ప్రేమదేశం, ఉరుమి లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగువారిని అలరించారు. హైదరాబాదీ అయినప్పటికీ టబు ఎక్కువగా హిందీ చిత్రాల్లోనే నటించారు. మాచీస్, అస్తిత్వ, చాందినీ బార్, చీనీ కమ్, హు తు తు సినిమాలు ఆమెలోని నటనా ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. ఉత్తమ నటిగా రెండు సార్లు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు టబు. చాలా కాలం తర్వాత AA19 సినిమాతో మళ్లీ టాలీవుడ్లో రంగప్రవేశం చేయడంతో.. తెలుగులో మరిన్ని సినిమాల్లో నటిస్తుందని ఆశిస్తున్నారు ఆమె అభిమానులు.

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమాతో అక్కినేని హీరోకి కలిసొచ్చేనా??

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది

23 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT