నేను చేసిన "'స్వింగ్ జరా" సాంగ్‌కి.. వాళ్లే సూపర్ ఫ్యాన్స్: తమన్నా

నేను చేసిన "'స్వింగ్ జరా" సాంగ్‌కి.. వాళ్లే సూపర్ ఫ్యాన్స్: తమన్నా

'జై లవకుశ' సినిమా చూశారా.. అందులో 'స్వింగ్‌ జరా...' పాట ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు కదా. అయితే ఈ పాట అంటే తనకు చాలా ఇష్టమని తమన్నా (Tamannaah) తెలపడం విశేషం. ముఖ్యంగా పిల్లలకు ఆ పాట ఎంతో ఇష్టమని.. తాను చూసిన అనేక డ్యాన్స్ షోలలో పిల్లలు ఈ పాటకు ఇష్టంగా స్టెప్స్ వేయడం చూసి.. తాను ఎంతగానో సంబరపడానని చెప్పుకొచ్చారామె. అందుకే పిల్లల సరదాను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కమర్షియల్ సాంగ్స్ చేయాలని అనిపిస్తూ ఉంటుందని కూడా తెలిపారు తమన్నా. 

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు పంచుకున్నారు తమన్నా. ఒక వైపు కమర్షియల్ చిత్రాలు.. అలాగే మరో వైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ.. ఇలాంటి గీతాలు కూడా చేయడం వెనుక ఉన్న కారణాలేమిటి ?  అని తమన్నాను అడగ్గా.. ఆమె తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

"ఒక స్త్రీ తన జీవితంలో అనేక పాత్రలను పోషిస్తుంది. తల్లిగా, భార్యగా, ఉద్యోగినిగా ఇలా బహుముఖ పాత్రలను పోషించడం తనకు అలవాటే. నేను సగటు భారతీయ స్త్రీని. కనుక సినిమాల్లో రకరకాల పాత్రలను పోషించడం తప్పు కాదనుకుంటున్నాను" అని తెలిపింది తమన్నా.  

ఈ మధ్యకాలంలో తమన్నా గురించి రూమర్స్ కూడా సోషల్ మీడియాలో బాగానే వస్తున్నాయి. ఆమె రూ.16 కోట్ల రూపాయలు పెట్టి ముంబయిలో ఖరీదైన అపార్ట్‌మెంట్ కొన్నారని వార్తలు వచ్చాయి. అయితే అలాంటి వార్తల్లో వాస్తవం ఏమీ లేదని ఆమె తెలిపారు.

తాను సింధీ అమ్మాయినని.. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని కూడా చెప్పుకొచ్చారామె. అయితే అందమైన ఇల్లు కొనడానికి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టవచ్చని.. కానీ అందరూ అనుకున్నంత రీతిలో తాను కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కొనలేదని క్లారిటీ ఇచ్చింది తమన్నా.                                         

తమ‌న్నా ఈ న‌టుడితో.. డేటింగ్‌కి వెళ్లాల‌ని అనుకుందట. ఎందుకో తెలుసా? 

'శ్రీ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తమన్నా.. హ్యాపీ డేస్ సినిమా తెచ్చిన క్రేజ్‌తో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. బాహుబలి, 100 % లవ్, రచ్చ, ఊపిరి, కెమెరామెన్ గంగతో రాంబాబు, అల్లుడు శీను, ఎఫ్ 2 చిత్రాలు ఆమె కెరీర్‌ను మలుపు తిప్పాయి. ఇప్పుడు హిందీ సినిమా క్వీన్‌కి రీమేక్‌గా వస్తున్న "దటీజ్ మహాలక్ష్మి" చిత్రంలో కూడా తమన్నా.. టైటిల్ రోల్ పోషిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న "సైరా నరసింహారెడ్డి" చిత్రంలో కూడా మెరవనుంది. 

గ్రాడ్యుయేషన్ చేయకపోయినా.. సినిమాలతో కోట్లు సంపాదించేస్తున్నారు..!

తెలుగు, తమిళ చిత్రాలలోనే కాకుండా... దాదాపు అరడజను బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించి తన సత్తా చాటింది తమన్నా. చాంద్ సా రోషన్ చెహరా, హిమత్ వాలా, హమ్ షకల్స్, ఎంటర్‌టైన్‌మెంట్, కామోషీ ఆమె నటించిన ప్రముఖ హిందీ చిత్రాలు.

15 ఏళ్లకే చలనచిత్ర పరిశ్రమకి నటిగా పరిచయమైన తమన్నా.. ముంబయిలో పుట్టి పెరిగింది. ఆమె తండ్రి ఓ డైమండ్ మర్చంట్. సినిమాల్లోకి రాకముందే ఆమెకు నటన అంటే చాలా ఇష్టం. ముంబయిలోని పలు థియేటర్ గ్రూపుల్లో ఆమె ప్రదర్శనలు కూడా ఇచ్చింది. 

మెగాస్టార్ చిరంజీవి సరసన.. మరో హీరోయిన్ వేటలో సైరా టీం!

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.