ప్రతి సంవత్సరం ఎంతోమంది కొత్త అమ్మాయిలు చిత్రపరిశ్రమలోకి అడుగుపెడుతుంటారు. అయితే అందులో కొంత మంది మాత్రమే కథానాయికలుగా సక్సెస్ అయ్యి.. కెరీర్‌లో దూసుకుపోతుంటారు. అందుకు బాలీవుడ్ (Bollywood) కూడా అతీతం కాదు. ప్రతీ సంవత్సరం పదుల సంఖ్యలో బాలీవుడ్‌కు నూతన కథానాయికలు పరిచయమవుతున్నారు. ఈ ఏడాది కూడా హిందీ చిత్ర పరిశ్రమకి పరిచయమయ్యే కొందరు నటీమణులకు సంబంధించిన సంక్షిప్త సమాచారం మీకోసం...
అంకిత లోఖండే (Ankita Lokhande) - టెలివిజన్ రంగంలోకి తొలుత అడుగుపెట్టిన అంకిత.. ఆ రంగంలో చాలా మంచి పేరుతో పాటుగా అసాధారణ ఫాలోయింగ్‌ని సైతం మూటగట్టుకోగలిగింది. ప్రధానంగా ఏక్తా కపూర్ నిర్మించిన అనేక ధారావాహికల్లో అంకిత నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇక ఇప్పుడు కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మణికర్ణిక చిత్రంలో ఝాల్కరి భాయ్ పాత్రలో ఆమె మనకి కనిపించనుంది.
ఇసాబెల్లె కైఫ్ (Isabelle Kaif) - ప్రముఖ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరి ఇసాబెల్ల్ త్వరలోనే హీరోయిన్‌గా తెరంగేట్రం చేయనుంది. 'టైం టు డ్యాన్స్' పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో ఇసాబెల్లె కైఫ్ హీరోయిన్‌గా చేస్తుండగా.. ఆమె సరసన సూరజ్ పంచోలి హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలోని ఒక పాట కోసం కత్రినా కైఫ్‌ని సంప్రదించగా ఆమె సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం.
View this post on Instagram
నుపుర్ సనన్ (Nupur Sanon) - నటి కృతి సనన్ (Kriti Sanon) సోదరి నుపుర్.. గత ఏడాది తన సోదరితో కలిసి పలు కమర్షియల్ యాడ్స్ చేయడంతో అందరి దృష్టి ఆమె పైన పడింది. గత ఏడాదిలోనే ఆమె తెరంగేట్రం చేసిందన్న వార్తల నడుమ.. అందరూ ఆమె హీరోయిన్ అయిపోయినట్టే అని అనుకున్నారు. అయితే ఆమె ఎంట్రీ కాస్త లేట్ అయింది. కానీ ఈ ఏడాది మాత్రం కచ్చితంగా నుపుర్ సనన్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది అని సమాచారం. ప్రముఖ నిర్మాణసంస్థ ఒకటి ఈ ముద్దుగుమ్మని పరిశ్రమకి పరిచయం చేయనుందట.
View this post on Instagram
అనన్య పాండే (Ananya Pandey) - హిందీ నటుడు ఛంకీ పాండే కుమార్తె అనన్య పాండే, త్వరలోనే తన తండ్రి వారసత్వాన్ని సినిమాల్లో కొనసాగించే క్రమంలో బాలీవుడ్‌లో అడుగుపెట్టనుంది. "స్టూడెంట్ అఫ్ ది ఇయర్ 2" చిత్రం ద్వారా ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఈ ముద్దుగుమ్మకు అతిపెద్ద లాంచ్ జరగనుంది. మరి తన తండ్రిలా ఆమె సినిమా కెరీర్‌లో ఎత్తుపల్లాలు చూస్తుందా లేక దూసుకుపోతుందా అనేది వేచి చూడాలి.
View this post on Instagram
తార సుటారియా (Tara Sutaria) - ఈ ముద్దుగుమ్మ కూడా అనన్య పాండే మాదిరిగానే "స్టూడెంట్ అఫ్ ది ఇయర్ 2" చిత్రం ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నది. అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే ఈ అమ్మడు.. టెలివిజన్‌లో తన సత్తా చాటింది. ఇక 2019లో ఈ చిత్రంతో పాటుగా హీరో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటిస్తున్న మరో చిత్రం కూడా విడుదలకు సిద్ధమవుతోంది. దీనితో 2019 ఆమెకి ఒక మరుపురాని సంవత్సరంగా మిగిలిపోనుంది.
View this post on InstagramSparkly and shimmery in @manishmalhotra05 💕✨ @themakeupmaven__ @hairbyseema
ప్రనూతన్ బెల్ (Pranuthan Bahl) - ప్రముఖ హిందీ నటి నూతన్ మనవరాలు.. అలాగే నటుడు మోహనీష్ బెల్ కూతురు అయినా ప్రనూతన్ ఈ సమ్వత్సరం హిందీ చిత్రసీమలోకి నటిగా అడుగుపెట్టనుంది. ఈమె నటిస్తున్న నోట్ బుక్ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ నిర్మిస్తుండడం విశేషం. ఈ చిత్రం మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.
అశ్వామి మంజ్రేకర్ (Ashwami Manjrekar)- ప్రముఖ నటుడు & దర్శకుడు మహేష్ మంజ్రేకర్ గారాలపట్టి అశ్వామి మంజ్రేకర్ త్వరలోనే బాలీవుడ్‌లో తెరంగేట్రం చేయడానికి రంగం సిద్ధమైంది. త్వరలోనే దీనికి సంబందించిన వివరాలు తెలుస్తాయని మహేష్ మంజ్రేకర్ మీడియాకి తెలిపాడు. అయితే ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న సల్మాన్ ఖాన్.. అశ్వామి మంజ్రేకర్‌ని కూడా హిందీ పరిశ్రమకి పరిచయం చేయనుండడం విశేషం.
శ్రేయ ధన్వంతరి (Shreya Dhanawanthary) - చీట్ ఇండియా (Cheat India) పేరుతో ఈ నెలలో విడుదలకానున్న చిత్రంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న నటి శ్రేయ ధనవంతరి. ఈమె గతంలో అనేక యాడ్స్ & వెబ్ సిరీస్‌లలో తన ప్రతిభని చాటుకుంది. ఈ చిత్రంతో తొలిసారిగా సినిమా రంగంలోకి అడుగుపెడుతుంది. ఇక ఈ చిత్రంలో హీరో ఇమ్రాన్ హాష్మీ సరసన నటిస్తుండడంతో ఆమె పైన ప్రేక్షకులకి మరింత ఆసక్తి పెరిగింది.
ఖుషి కపూర్ (Khushi Kapoor) - అందాల తార శ్రీదేవి - నిర్మాత బోనీ కపూర్‌ల రెండవ కుమార్తెన ఖుషి కపూర్ ఈ సంవత్సరం తెరంగేట్రం చేయనుందట. దీనికి సంబంధించిన వివరాలని ఈ మధ్యనే ప్రముఖ నిర్మాత-దర్శకుడు కరణ్ జోహార్ ఒక టాక్ షోలో తెలిపారు. తాను ఖుషిని హిందీ చిత్రసీమకు ఓ చిత్రం ద్వారా పరిచయం చేయబోతున్నట్టు తెలిపారు. జాహ్నవి కపూర్‌ని గత ఏడాది "ధఢక్" చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయం కాగా.. ఈ సంవత్సరం ఖుషి కూడా తన లక్ పరీక్షించుకోవడానికి సిద్ధం కావడం విశేషం.
ఈ 9 మంది కొత్త కథానాయికలు తమ అదృష్టాన్ని ఈ సంవత్సరం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతుండగా.. వీరికి ముందుగానే POPxo తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
ఇవి కూడా చదవండి
బాలీవుడ్ హాట్ న్యూస్: ఆ యువరాణి పాత్రకి.. దీపిక పదుకొనే గ్రీన్ సిగ్నల్
ఈ సంక్రాంతికి.. ఈ టాలీవుడ్ చిత్రాలు చాలా స్పెషల్
2018 తెలుగు చిత్రాల్లో.. టాప్ 9 హీరోయిన్స్ ఎవరో తెలుసా..?
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.