వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న.. ప్రేమ పక్షులు - ఆర్య & సాయేషా

వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న.. ప్రేమ పక్షులు - ఆర్య & సాయేషా

వాలెంటైన్స్ డే (Valentines Day) రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులంతా తమ ప్రేయసి/ప్రియులకు బహుమతుల రూపంలో లేదా పూలబోకేల రూపంలో తన ప్రేమను వ్యక్తపరుస్తారు. కొందరు కొత్త లవ్ ప్రపోజల్స్‌కి శ్రీకారం చుడితే.. మరికొందరు కొనసాగిస్తున్న ప్రేమబంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.  కానీ సెలబ్రిటీ జంటల పద్ధతే వేరు కదా.. వారు ఏది చేసినా వెరైటీగానే ఉంటుంది. 


ఇటీవలికాలంలో అలాగే ఓ సెలబ్రిటీ జంట.. తమ ప్రేమ విషయాన్ని.. అదే సమయంలో తామెప్పుడూ పెళ్ళి చేసుకోబోతున్నాము అన్న విషయాన్ని కూడా సోషల్ మీడియా (Social Media) వేదికగా పంచుకుంది. తద్వారా తమ అభిమానులు అందరికీ స్వీట్ షాక్ కూడా ఇచ్చింది. ఇంతకీ ఆ జంట ఎవరంటే - సాయేషా (Sayyeshaa) & ఆర్య (Arya).


ముందుగా తమిళ స్టార్ హీరో ఆర్య గురించి మాట్లాడుకుంటే - ఎటువంటి సినిమా నేపధ్యం లేకుండా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు తమిళనాట తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకోగలిగాడు. ఇప్పుడు ఆయనకంటూ ఒక మర్కెట్ ఉంది. అలాగే కథకులు ఆయన కోసం కూడా ప్రత్యేకంగా కథలు సిద్ధం చేస్తుండడం విశేషం.


ఇక ఆయన కెరీర్‌లోనే బెస్ట్ చిత్రంగా.. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకున్న చిత్రంగా రాజా రాణి (Raja Rani) నిలిచింది. ఆ చిత్రంలో ఆర్య నటన అందరిని బాగా ఆకట్టుకుంది. ఈ సంవత్సరం మూడు తమిళ చిత్రాలతో పాటుగా మరో హిందీ చిత్రంలో కూడా ఆర్య నటిస్తున్నాడు.
 

 

 


View this post on Instagram


Happy Valentines Day 😍😍 #blessed @sayyeshaa


A post shared by Arya (@aryaoffl) on
 


సాయేషా కెరీర్‌ని ఒకసారి చూస్తే, 2015లో తెలుగు చిత్రం "అఖిల్" ద్వారా తెరంగేట్రం చేసాక.. ఆ తరువాతి సంవత్సరం హిందీలో "శివాయ్" చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తరువాత వరుసగా తమిళంలో చిత్రాలు చేస్తోంది. ఇక సాయేషాకి ఉత్తరాది సినిమా పరిశ్రమతో మంచి సంబంధాలే ఉన్నాయి. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో దిలీప్ కుమార్ (Dilip Kumar)- నటి సైరా భానులకి ఈమె దగ్గరి బంధువు. ప్రస్తుతం ఆర్య, సూర్య, మోహన్ లాల్ తదితరులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న కాప్పన్ (Kaappan) చిత్రంలో సాయేషా నటిస్తోంది. 


ఇక ఆర్య & సాయేషాల ప్రేమ విషయానికి వస్తే.. వారు గత ఏడాది కలిసి నటించి "గజినీకాంత్ (Gajinikanth)" చిత్ర షూటింగ్ సమయంలోనే వారు లవ్‌లో పడినట్లు తెలుస్తోంది. వీరి ప్రేమని ఇరు వైపులా ఆమోదించడంతో.. ఇటీవలే వీరిరువురు సోషల్ మీడియా వేదికగా ఈ వార్తని అందరితోనూ పంచుకోవడం జరిగింది.  వీరి వివాహం వచ్చే నెల జరగబోతుందని వారు ప్రకటించడం కూడా గమనార్హం. 

 


ఇక ఈ సెలబ్రిటీ జంట వివాహ ప్రకటన సందర్భంగా.. కొంతమంది వీరి మధ్య ఉన్న వయసు తేడాని తెరపైకి తెస్తున్నారు. అయితే ఇప్పటికే వయసులో అంతరాలున్నా.. దానితో సంబంధం లేకుండా.. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వారు  సినీ  పరిశ్రమలో ఎందరో ఉన్నారు.  అందుకు ఉదాహరణగా దిలీప్ కుమార్ & సైరా భానుల జంటను చూపుతున్నారు.


రెండు మనసులు కలిసి.. ఇద్దరూ మనస్ఫూర్తిగా ఇష్టపడినప్పుడు.. అలాగే వారి మధ్య సరైన అవగాహన ఉన్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న అవాంతరాలు పెద్దగా ప్రభావం చూపవు అని కూడా పలువురు అంటున్నారు. 


ఈ ప్రేమ జంటకి అంతా మంచే జరగాలని మనం కూడా  మనస్ఫూర్తిగా కోరుకుందాం...


ఇవి కూడా చదవండి


దేశాంతర వివాహాలు చేసుకున్న మన కథానాయికలు వీరే


ఈ ఏడాది మోస్ట్ గ్లామరస్ స్టార్స్‌గా షారూఖ్, దీపిక


లవర్స్ డే సినిమా సమీక్ష