బిగ్ బాస్ తెలుగు : బాబా భాస్కర్ మార్క్ 'నామినేషన్స్'.. తమన్నా గేమ్ 'ప్లాన్స్'..!

బిగ్ బాస్ తెలుగు : బాబా భాస్కర్ మార్క్ 'నామినేషన్స్'.. తమన్నా గేమ్ 'ప్లాన్స్'..!

బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) సీజన్ 3 ప్రతిరోజు ఏదొక మలుపు తిరుగుతూ.. షో చూస్తున్న ప్రేక్షకులకి ఒక మంచి కిక్‌ని అందిస్తోంది. ఇక ఇప్పటికే తొలివారం నటి హేమ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వగా... రెండవ వారంలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా.. ఓ ట్రాన్స్‌జెండర్‌ని పంపడం షోలో హైలైట్‌గా నిలిచింది.

బిగ్ బాస్ తెలుగులోకి వెళ్ళిన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి ఆసక్తికర వివరాలు

ఈ షాక్ నుండి బయటపడకముందే.. రెండవ వారం నామినేషన్స్ ప్రక్రియ కార్యక్రమం బిగ్ బాస్ హౌస్‌లో ఉత్కంఠని రేపిందనే చెప్పాలి. ఎందుకంటే సదరు నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటిలోని ప్రతి సభ్యుడు ..తాను ఇంటి నుండి బయటకి పంపించాలి అని కోరుకుంటున్న ఇద్దరి పేర్లు చెప్పాల్సి ఉంది. ఇదే ఈ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ.

అయితే ఈ ప్రక్రియలో భాగంగా బాబా భాస్కర్‌ని (Baba Bhaskar) కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి... ఇంటిలో నుండి బయటకి పంపించాల్సిన ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పమని బిగ్ బాస్ కోరగా.. "నాకు ఇంట్లో ఉన్న అందరూ చాలా బాగా నచ్చారు. వారిలో ఒకరిని కూడా బయటకి పంపించమని నేను చెప్పలేను. కావాలంటే దీనికి ఏదైనా శిక్ష విధించినా భరిస్తాను" అని ఆయన చెప్పేశాడు.

ఆ సమాధానంతో సంతృప్తి చెందని బిగ్ బాస్, బాబా భాస్కర్‌కి కొద్దిగా సమయం ఇచ్చి.. నామినేషన్ గురించి ఆలోచించి.. ఇద్దరు పేర్లు చెప్పమని సూచించడం జరిగింది. అలాగే ఆఖరుగా మరోసారి ఇంటిలోని ఇద్దరు సభ్యులని నామినేట్ చేసే ప్రక్రియలో పాల్గొనమని.. లేదంటే ఇంటిలోని వారందరూ నామినేట్ అవుతారని బిగ్ బాస్ ఒక బిగ్ షాకే ఇచ్చారు.

బిగ్ బాస్ తెలుగు నుండి హేమ ఎలిమినేట్ అవ్వడానికి గల ముఖ్యకారణలు వేరే ఉన్నాయి


బిగ్ బాస్ నుండి ఈ మాట బయటకి రాగానే.. ఇంటిలోని సభ్యులందరూ తీవ్ర ఆలోచనల్లో మునిగిపోయారు. బిగ్ బాస్ చెప్పిన రెంటిలో ఏది అయితే బాగుంటుంది అని ఆలోచించిన బాబా భాస్కర్.. చివరికి ఇంటిలోని వారిలో ఇద్దరి పేర్లు చెబుతాను అని ఒప్పుకుని ఆ ప్రక్రియని పూర్తి చేయడం జరిగింది.

అయితే మొదటివారంతో పోలిస్తే.. ఈ వారం మరో ముగ్గురు ఎక్కువ సభ్యులు ఎలిమినేషన్‌లో ఉండడం విశేషం. మొత్తం 8 మంది ఇంటి సభ్యులు.. ఈ వారం ఎలిమినేషన్‌లో ఉండడంతో ఎలిమినేషన్ ప్రక్రియ చాలా కఠినంగా ముందుకి సాగేటట్టుగా అనిపిస్తుంది. ఇంతకీ ఈ వారం నామినేషన్‌లో ఉన్న సభ్యులు ఎవరంటే -

* శ్రీముఖి


* హిమజ


* రాహుల్ సిప్లిగంజ్


* జాఫర్


* వరుణ్ సందేశ్


* వితిక


* పునర్నవి భూపాలం


* మహేష్ విట్టా

ఇక ఎప్పటిలాగే ఈ ఇంటి సభ్యులకి.. ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ఒక కొత్త అనుభూతిని ఇచ్చిందనే చెప్పాలి.

దీనికి తోడు.. నామినేషన్ ప్రక్రియ గురించి ఎవ్వరితో కూడా మాట్లాడకూడదనే రూల్ పెట్టిన తరువాత కూడా.. వితిక తన భర్త  వరుణ్ సందేశ్‌తో చెవిలో ఏవో గుసగుసలు చెబుతుండగా ... అది గమనించిన బిగ్ బాస్.. తనకి ఇష్టమైన వారిని నామినేట్ చేసే ప్రక్రియలో.. ఆమెని భాగం చేయడం లేదనే రూల్‌‌ని చెప్పడం జరిగింది. ఇది ఒకరకంగా ఆమెకి మైనస్. ఏదేమైనా.. ఇంకొక 94 రోజులు ఓపిగ్గా ఉండగలిగితే..  మనకు ఈ సీజన్ హీరో/హీరోయిన్ ఎవరో తెలిసిపోద్ది.

ఇదిలావుండగా.. ఈరోజే ఇంటిలోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రి ... వచ్చి రాగానే వరుణ్ సందేశ్ & వితిక - మహేష్ విట్టాల మధ్య జరిగిన వివాదాన్ని ప్రస్తావిస్తూ.. తన మద్దతును మహేష్‌కి ఇస్తానని చెప్పడం గమనార్హం. అదే సమయంలో తాను గొడవ జరిగిన సమయంలో.. అక్కడ ఉంటే కచ్చితంగా మహేష్ విట్టాకి మద్దతు ఇచ్చేదానని కూడా కుండబద్దలు కొట్టేసింది. దీంతో ఇంటిలోకి వచ్చి రాగానే.. ఆమె బిగ్ బాస్ గేమ్ ఆడటం మొదలుపెట్టిందని అందరూ అనుకున్నారు.

రెండవ వారం మొదటి రోజే... అటు బాబా భాస్కర్ మార్క్ నామినేషన్స్.. ఇటు వైల్డ్ కార్డ్ తమన్నా గేమ్ ప్లాన్స్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ( Bigg Boss Season 3) ని మరింత రసవత్తరంగా మార్చేస్తున్నాయని అనడంలో ఎటువంటి సందేహం లేదు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఎపిసోడ్ రివ్యూ.. టైటిల్ గెలిచే కంటెస్టెంట్ ఎవరు?