(Baba Bhaskar vs Vithika at Bigg Boss ‘Battle of the Medallion’)
‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3’కి సంబంధించిన గ్రాండ్ ఫినాలే కోసం బిగ్‌బాస్ ఇచ్చిన ఇమ్మ్యూనిటీ – ‘బ్యాటిల్ అఫ్ ది మెడాలియన్’. మెడాలియన్ కోసం ఈవారం మూడు లెవెల్స్‌లో పోటీలు జరగగా.. నామినేషన్స్‌కి సంబంధించిన టాస్క్‌ని తొలి లెవెల్‌గా పరిగణించారు. ఆ తరువాత నామినేషన్స్‌లో లేనివారు లెవెల్ 2లో పోటీ పడడం జరిగింది. అందులో విజయం సాధించిన వితికని.. ఏకంగా ఫైనల్ లెవల్‌కి పంపించారు బిగ్‌బాస్.
Bigg Boss Telugu 3 : బాబా భాస్కర్‌ని టార్గెట్ చేసిన.. వరుణ్ సందేశ్, వితిక & పునర్నవి
ఇక ‘లెవెల్ 2’లో మిగిలిన నలుగురు సభ్యులైన బాబా భాస్కర్, శివజ్యోతి, అలీ రెజా & శ్రీముఖిలు పోటీపడ్డారు. ఇందులో బాబా భాస్కర్ విజయం సాధించారు. దీనితో ఇప్పటికే ఫైనల్ లెవెల్‌కి ఎంపికయిన వితికతో బాబా భాస్కర్.. ఆఖరి లెవెల్‌లో ‘బ్యాటిల్ అఫ్ ది మెడాలియన్’ కోసం పోటీపడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాబోతుంది.
ఈ లెవెల్‌లో బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ చాలా వెరైటీగా ఉంది. ఆ టాస్క్ పేరు ‘రిక్షాలో వీర విహారం’. ఈ టాస్క్‌లో భాగంగా బాబా భాస్కర్, వితికలు ఒకే రిక్షాలో కూర్చోవలసి ఉంటుంది. ఆ రిక్షాలో నుండి ఎవరైతే ముందుగా కిందకి దిగుతారో.. వారు టాస్క్ ఓడిపోయినట్లు లెక్క. అలాగే ఈ టాస్క్‌లో గెలిచినవారు ‘బ్యాటిల్ అఫ్ ది మెడాలియన్’ దక్కించుని.. గ్రాండ్ ఫినాలేకి అర్హతను సాధించడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో మెడాలియన్ గెలవడం అత్యంత కీలకం.
అయితే ఈ టాస్క్‌లో భాగంగా.. తమకి నచ్చని వారిని ఎలాగైనా రిక్షా నుండి కిందకి దింపడానికి.. హౌస్ మేట్స్ ప్రయత్నాలు చేయవచ్చట. ఇలా బిగ్‌బాస్ ప్రకటించాక.. ఎవరికి వారు తమకు నచ్చని వారిని ఎలాగైనా కిందకి దింపేందుకు కృషి చేస్తారు. మరి ఈ టాస్క్‌లో బాబా భాస్కర్ గెలుస్తారా? లేక వితిక గెలుస్తుందా? అనేది ఈ రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో తేలిపోతుంది.
Bigg Boss Telugu 3: శివజ్యోతి కోసం.. కావాలని ఓడిపోతున్న అలీ రెజా?
ఇదిలావుండగా నిన్నటి ఎపిసోడ్‌లో ఎక్కువ భాగం పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్‌ల మధ్య సాగింది. వారిద్దరి మధ్య డెటాల్‌కి సంబంధించి ఒక సరదా గొడవ జరగగా.. ఆ తరువాత మరలా వీరిద్దరూ కలిసిపోవడం జరిగింది. ఇక నిన్నటి ‘లెవెల్ 2’లో గెలిచిన బాబా భాస్కర్ పై.. ఇంటిలోని మెజారిటీ సభ్యులు తమదైన శైలిలో విశ్లేషణ చేశారు.
ఎక్కువ మంది సభ్యులు బాబా భాస్కర్ ప్రవర్తనలో మార్పు వచ్చిందని కూడా తెలిపారు. అదే విషయాన్ని బాబా భాస్కర్‌ని అడగగా – “తనను ఉద్దేశిస్తూ నాగార్జున వీకెండ్‌లో చూపెట్టిన వీడియోకి బాగా ప్రభావితమయ్యానని..ఆ ఆలోచనలే ఎక్కువగా వస్తున్న కారణంగా.. ఎక్కువ మాట్లాడకుండా కాస్త సైలెంట్ అయ్యానని” ఆయన ఒప్పుకోవడం జరిగింది.
దీంతో షో చూస్తున్న వారికి బాబా భాస్కర్ మెడాలియన్‌ని దక్కించుకోవడంపై.. ఎక్కువమంది హౌస్ మేట్స్‌కి ఆసక్తి లేదని ఇట్టే అర్ధమవుతుంది. అదే సమయంలో పునర్నవితో రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ “మనం అనవసరంగా బాబా భాస్కర్‌ని అపార్ధం చేసుకుంటున్నామని అనిపిస్తుంది. అదే సమయంలో శ్రీముఖి పై ఉన్న వ్యతిరేకతను మనం బాబా భాస్కర్ పై చూపెడుతున్నామేమో” అని అభిప్రాయపడడం గమనార్హం. మరి బాబా భాస్కర్ పై ఇలాంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకున్న రాహుల్ సిప్లిగంజ్.. ఈరోజు జరిగే టాస్క్‌లో.. బాబా భాస్కర్‌కి మద్దతు ఇస్తాడా లేదా? అనేది చూడాలి.
మొత్తానికి ఎవరూ ఊహించని విధంగా బాబా భాస్కర్ ఆఖరి లెవెల్‌కి వచ్చాడు. మరి ఈరోజు జరిగే టాస్క్‌లో గెలిచి అతను.. బిగ్ బాస్ మెడాలియన్‌ని దక్కించుంటాడా? లేదా? అనేది చూడాలి.
Bigg Boss Telugu 3: మరోసారి ఘర్షణ పడిన.. వరుణ్ సందేశ్ & వితిక షేరు