“బిగ్ బాస్ తెలుగు సీజన్ 3″లో (Bigg Boss Telugu 3) అయిదవ వారం ముగిసిపోతోంది. ప్రతి వారం లాగే ఈసారి కూడా కింగ్ నాగార్జున రావడం, ఇంటి సభ్యులతో వారం మొత్తం జరిగిన పరిణామాలను గురించి చర్చించడం జరిగింది. అందులో భాగంగానే ఒక ఆసక్తికరమైన టాస్క్‌ని నాగార్జున ఆడించారు. అదే – ‘బ్రూటస్ గేమ్’ – వెన్నుపోటుదారుడి ఆట. ఈ టాస్క్‌లో ఇంటి సభ్యులు ఒక్కొకరుగా వచ్చి.. తమకు ఇంట్లో గల స్నేహితుడు, శత్రువు, వెన్నుపోటుదారుడు (backstabber) ఎవరో చెప్పాలి.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 : అలీ రెజా Vs మహేష్ విట్టా & శ్రీముఖి Vs రాహుల్ సిప్లిగంజ్
అలా వెన్నుపోటుదారుల గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు.. టాస్క్‌లోని కొన్ని ఊహించని పేర్లు బయటకి రావడంతో నాగార్జునతో పాటుగా.. షో చూస్తున్న వ్యక్తులు కూడా ఒకింత షాక్‌కి గురయ్యారు. ఈ టాస్క్‌లో మొదటి సభ్యురాలిగా పునర్నవి మాట్లాడుతూ తనను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ‘వితిక’ అని చెప్పింది. అందుకు కారణం బిగ్ బాస్ చూపించిన వీడియోస్‌లో.. తన గురించి వితిక మాట్లాడిన తీరు అని తెలిపింది.
మొన్నటి ఎపిసోడ్‌లో ఎప్పుడైతే బిగ్ బాస్ కొన్ని వీడియోలు చూపించాడో… అప్పటినుండి వితిక, పునర్నవిల మధ్య సఖ్యత తగ్గింది. అలాగే తనకి ఇంట్లోని ప్రధాన శత్రువు వరుణ్ సందేశ్ అని చెప్పడం… వితిక, వరుణ్‌లు బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్‌గా కాకుండా.. భార్యాభర్తల్లా వ్యవహరిస్తున్నారు అని చెప్పింది. అయితే ఈ మాటలని వరుణ్ సందేశ్ త్రోసిపుచ్చుతూ.. వితికను తన వెన్నుపోటుదార పేర్కొన్నాడు.
అలాగే ‘శ్రీముఖి’ని వెన్నుపోటుదారుగా పేర్కొన్న మహేష్ విట్టా, ‘వితిక’ని వెన్నుపోటుదారుగా పేర్కొన్న రవికృష్ణ, రాహుల్ సిప్లిగంజ్ పేరు చెప్పిన రవికృష్ణ, ఆషు రెడ్డి పేరు చెప్పిన హిమజ .. అందరికి స్వీట్ షాక్ ఇచ్ఛేలా బాబా భాస్కర్ పేరుని చెప్పిన శివజ్యోతి.. ఇలా వీరందరూ ఊహించని పేర్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే మరికొన్ని ఊహకందని పేర్లు కూడా బయటకి వచ్చాయి.
బిగ్‌బాస్ తెలుగు: రాహుల్ తప్ప.. అందరూ ఆమె అన్నదమ్ములేనట..!
ఇక ఈ ఎపిసోడ్‌లో ఇద్దరు ఇంటి సభ్యులని సేఫ్ జోన్‌లోకి పంపించడం జరిగింది. వారే – మహేష్ విట్టా, శివ జ్యోతి. దీనితో బాబా భాస్కర్, హిమజ, ఆషు రెడ్డి, పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్‌లు ఇంకా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. రేపు జరగబోయే ఎపిసోడ్‌లో.. ఈ అయిదుగురిలో ఒకరు బిగ్ బాస్ ఇంటి నుండి కచ్చితంగా నిష్క్రమిస్తారు.
ఇదిలావుండగా.. శుక్రవారం ఇంటిలో ఏం జరిగిందో.. మనకు విజువల్స్‌లో చూపించారు. ఈగ సంతాప సభ కడుపుబ్బా నవ్విస్తే, అంతకంటే ఎక్కువగా ఇంటి సభ్యుల నామినేషన్స్ గురించి బాబా భాస్కర్ చెప్పిన.. ఫన్నీ జోస్యం అందరిని ఎంటర్‌టైన్ చేసింది. ఇక కృష్ణాష్టమి సందర్భంగా ఇంటి సభ్యులంతా కలిసి క్యారెట్ హల్వా చేసి దానిని నాగార్జునకి అందించారు. ఆ స్వీట్‌ని రుచి చూస్తూనే ఎపిసోడ్‌ని ప్రారంభించారు నాగ్.
ఇక ఎపిసోడ్ మొదలైన తరువాత అలీ రెజా ప్రవర్తన గురించి నాగార్జున ప్రస్తావిస్తూ – “నీకు చాలా మంచి టాలెంట్ ఉంది. అయితే ఆ టాలెంట్ కనుమరుగయ్యే అహంకారం కూడా నీకు ఉంది. అందుకే నీ అహంకారాన్ని అదుపులో పెట్టుకుంటే నీకు మంచి భవిష్యత్తు ఉంది” అని నాలుగు మంచి మాటలు చెప్పారు. అలాగే బాబా భాస్కర్‌ని కూడా ఎవరైనా గొడవ పడుతుంటే.. కాస్త పెద్దరికం తీసుకుని ఇంటి సభ్యుల మధ్య సఖ్యత తీసుకురావాలని సూచించారు నాగార్జున.
మరి నాగార్జున చెప్పిన మాటలని ఇంటి సభ్యులు ఎంతవరకు పాటిస్తారు.. అలాగే ఇంకా డేంజర్ జోన్‌లో ఉన్న అయిదుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఈరోజు ఎపిసోడ్‌లో తెలుస్తుంది.
బిగ్‌బాస్ తెలుగు 3 : బిగ్‌బాస్ ఇంటిలో సీక్రెట్ వీడియోస్ రేపిన చిచ్చు!