పోస్ట‌ర్ల‌తోనే ఆసక్తి రేపుతోన్న బ్రోచేవారెవరురా సినిమా టీం..!

పోస్ట‌ర్ల‌తోనే ఆసక్తి రేపుతోన్న బ్రోచేవారెవరురా సినిమా టీం..!

‘బ్రోచేవారెవరురా’(Brochevarevarura).. ఈ సినిమా ఆది నుంచి తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. విభిన్నమైన పోస్టర్లను రిలీజ్ చేస్తూ ప్రేక్ష‌కుల్లో రోజురోజుకీ అంచనాలను పెంచేస్తున్నారు దర్శక నిర్మాతలు. అంతేకాదు.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే విషయంలోనూ వీరు కొత్త పంథాను అనుసరించారు. పాత సినిమాల పోస్టర్ల మాదిరిగా వాటిని రూపొందించారు. ఇప్పుడు ఇవే టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. టైటిల్ పోస్టర్ దగ్గర నుంచి నిన్న మొన్న విడుదలైన హీరోయిన్ ఫస్ట్ లుక్ వరకు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. నివేథా థామస్(Nivetha Thomas), శ్రీ విష్ణు(Sree Vishnu) ఇందులో నాయికానాయకులుగా నటిస్తున్నారు.

క్రైమ్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కథానాయిక పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ పోస్టర్ తో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. మహిళలపై జరుగుతున్న హింస ఈ సినిమా నేపథ్య కథగా చెబుతున్నారు.


ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను  పంచుకొంటూ నివేథా థామస్.. ‘ప్రతిఒక్కరికీ కలలు కనే హక్కు ఉంటుంది. ఈ రోజు కంటే రేపు మరింత మెరుగై, కోరుకొన్న లక్ష్యం సాధించాలి. అమ్మాయిల మనోధైర్యమే వారికి అందం. ప్రేమ, ఆత్మగౌరవం, ఆనందం, బాధ, వారు ఎదుర్కొనే ఇబ్బందులే వారిని బలమైన మహిళలుగా మారుస్తాయి. అలాంటి అమ్మాయే మిత్ర. ఆమెలో నేనున్నాను. ఆమె మీ అందరిలోనూ ఉంది. అలాంటి అద్భుతమైన పాత్ర పోషించినందుకు చాలా గర్వంగా ఉంది’ అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

బ్రోచేవారెవరువరురా సినిమా విడుదల కావడానికి ముందే నివేథా నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. మిత్ర పాత్ర పోషించడానికి నివేథా థామస్ పడుతున్న కష్టాన్ని శ్రీ విష్ణు తెగ పొగిడేస్తున్నారు. ‘క్లాసికల్ డాన్సర్ గా నటించడానికి తనను తాను మార్చుకొన్న తీరు అద్భుతం’ అని వర్ణిస్తున్నారు.


మన్యం ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్, నివేథా పేతురాజ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మెంటల్ మదిలో వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఫస్ట్ లుక్ కంటే ముందే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన విజువల్ టేల్ ఆకట్టుకొనేలా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోంది.
 

 

 


View this post on Instagram


Setting the stage for Mithra on 30th March 2019. #brochevarevarura #mithra


A post shared by Nivetha Thomas (@i_nivethathomas) on
ఈ సినిమా పోస్టర్లు విడుదల చేయడానికి ముందే విడుదల చేసిన విజువల్ టేల్ సైతం అందరినీ ఆకట్టుకొనేలా ఉంది. యానిమేషన్ తో, బ్యాక్ గ్రౌండ్ సాంగ్ తో చాలా కొత్తగా ఉంది. టాలీవుడ్ లో ఇలాంటి ప్రయత్నం బహుశా ఇదే మొట్టమొదటి అయి ఉంటుంది.

Subscribe to POPxoTV

ఇవి కూడా చ‌ద‌వండి


మన్మథుడు కుటుంబంతో సహా వచ్చేశాడు.. ఈయన కుటుంబం పెద్దదే సుమా...!


రానా అందించిన కానుకతో.. మురిసిపోతున్న జూనియర్ ఎన్టీఆర్..!


తండ్రి సినిమా కోసం.. మెగాఫోన్ పట్టుకున్న కూతురు..!