మన్మథుడు కుటుంబంతో సహా వచ్చేశాడు.. ఈయన కుటుంబం పెద్దదే సుమా...!

మన్మథుడు కుటుంబంతో సహా వచ్చేశాడు.. ఈయన కుటుంబం పెద్దదే సుమా...!

తన మాటల మాయాజాలంతో అమ్మాయిల మనసుని దోచుకున్న మన్మథుడు మరోసారి మన ముందుకు రావడానికి సిద్ధమ‌వుతున్నాడు. అప్పటి మ్యాజిక్ రిపీట్ చేసి మనల్ని అల‌రించేందుకు ర‌డీ అయిపోతున్నాడు. నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు 2(Manmadhudu 2) షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
 

 

 


View this post on Instagram


New beginnings. Send your wishes and blessings our way:) All fun. All heart:) ❤️ #Manmadhudu2


A post shared by Rahul Ravindran (@rahulr_23) on
ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా షూటింగ్ గ్యాప్ లో తాను తీసుకొన్న సెల్ఫీని కింగ్ నాగార్జున ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకొన్నాడు. ‘మి అండ్ మై మన్మథుడు 2 ఫ్యామిలీ.. లవింగ్ ఇట్’ అంటూ నాగార్జున పోస్ట్ చేసిన ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది. సినిమాలో ప్రధాన తారాగణం అంతా ఈ ఛాయాచిత్రంలో ఉండటంతో అందరిలోనూ మరింత ఆసక్తి నెలకొంది. సీనియర్ నటి లక్ష్మి, రావు రమేశ్, రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెల కిషోర్, ఝాన్సీ, దేవదర్శిని, రాహుల్ రవీంద్రన్, ఇతర నటీనటులు ఇందులో ఉన్నారు. హేమాహేమీలంతా ఈ చిత్రంలో నటిస్తున్నారని తెలియడంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.


ఎవరు ఏ పాత్ర పోషిస్తున్నారనే దానిపై క్లారిటీ లేనప్పటికీ మన్మథుడు సినిమాలో బ్రహ్మానందం పోషించిన లవంగం పాత్రను ఈ సీక్వెల్లో వెన్నెల కిషోర్ చేస్తున్నారని సమాచారం. మరి, బ్రహ్మీలాగే ఆయన ఈ పాత్రను పండిస్తారో లేదో తెలుసుకోవాలంటే కొంత కాలం ఆగాల్సిందే.
 

 

 


View this post on Instagram


At #Keshava audio event


A post shared by Vennela Kishore (@vennelakish) on
2002లో విడుదలై అందరినీ తెగ ఆకట్టుకొన్న మన్మథుడు.. నాగార్జున కెరీర్లోనే చాలా ప్రాధాన్యమున్న సినిమా. ఈ సినిమాలోని ప్రతి పాత్ర తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరైంది. దీనిలోని కొన్ని పాత్రలు, డైలాగులు ఇప్పటికీ సినీ అభిమానులకు గుర్తున్నాయంటే అతిశయోక్తి కాదేమో. బంకు శీను, లవంగం పాత్రలు ఇప్పటికీ మన ముఖంపై నవ్వులు పూయిస్తాయి. కే విజయభాస్కర్ దర్శకత్వం, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటల మాయాజాలం, దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం, అన్నింటికీ మించి నటీనటుల అద్భుతమైన అభినయం కలిసి చేసిన మ్యాజిక్ పున‌రావృతం అవుతుందో లేదో అనే సందేహం సైతం సగటు సినీ  ప్రేక్షకుడి మదిలో మెదులుతోంది. దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ ఆ మేరకు విజయం సాధిస్తారా? అనే ప్రశ్న సైతం తలెత్తుతోంది. ఈ ప్రశ్నలు, సందేహాలకు సమాధానాలు తెలియాలంటే మరికొంత కాలం మనం వేచి  చూడాల్సిందే.


Image: Nagarjuna Akkineni Twitter


ఇవి కూడా చ‌ద‌వండి


తండ్రి సినిమా కోసం.. మెగాఫోన్ పట్టుకున్న కూతురు..!


మరో సారి "మన్మధుడు"గా వచ్చేస్తున్న నాగ్.. రకుల్ ప్రీత్ సరసన రొమాంటిక్ ఎంట్రీ


భార్యాభర్తల బంధం ఎలా ఉండాలో ఈ అక్కినేని జంటను చూసి నేర్చుకోవాల్సిందే


కమల్ భారతీయుడు చిత్రానికి.. వెంకటేశ్, రాజశేఖర్ కి సంబంధం ఏంటి?


రానా అందించిన కానుకతో.. మురిసిపోతున్న జూనియర్ ఎన్టీఆర్..!


అద్భుత‌మైన వార్త‌.. ఇప్పుడు POPxo షాప్ ఓపెన్ అయింది. చ‌క్క‌టి మ‌గ్స్, ఫోన్ క‌వ‌ర్స్‌, కుష‌న్స్‌, లాప్‌టాప్‌స్లీవ్స్ ఇంకా మ‌రెన్నో ఇక్క‌డ 25 శాతం డిస్కౌంట్‌తోనే ల‌భిస్తున్నాయి. POPXOFIRST అనే కూప‌న్ కోడ్‌ని ఉప‌యోగించండి. దీంతో మ‌హిళ‌ల‌కు ఆన్‌లైన్ షాపింగ్ ఎంతో సులువైపోతుంది.