మన దేశంలో అత్యధిక శాతం మంది ఇష్టపడే క్రీడల్లో క్రికెట్ (Circket) కూడా ఒకటి. ఈ క్రీడను తరచూ ఫాలో అయ్యేవారికి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు హర్ష భోగ్లే (Harsha Bhogle). మన దేశంలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెట్ కామెంటేటర్స్‌లో ఈయన కూడా ఒకరు. హర్ష క్రికెట్ కామెంటరీ చెబుతుంటే మన కళ్ల ముందే క్రికెట్ మ్యాచ్ జరుగుతోందా?? అన్న ఫీలింగ్ మనకు కలగక మానదు. అయితే ఉన్నట్లుండి ఈయన గురించి ఎందుకు మాట్లాడుతున్నారని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నామండీ..
హర్ష భోగ్లే ఇటీవల విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ తెలుగు సినిమా చూశారట. దాని గురించి ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని కూడా పంచుకున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏదో మీరు ఊహించగలరా?? గతేడాది బాక్సాఫీస్‌ని షేక్ చేసిన చిన్న చిత్రాల జాబితాలో ఇదీ ప్రధానమైందే.
నటుడు రాహూల్ రవీంద్రన్ (Rahul Ravindran) మొదటిసారి దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నాక రూపొందించిన చిత్రం- చి.ల.సౌ (Chi La Sow). సుశాంత్ (Sushanth) & రుహాణి శర్మ (Ruhani Sharma) జంటగా నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు.. ప్రేక్షకుల మనసుల్లో తనదైన ముద్ర వేసింది.
విమాన ప్రయాణంలో హర్ష భోగ్లే ఈ చిత్రాన్ని చూసిన తర్వాత “చాలా కాలం తరువాత ఒక తెలుగు సినిమా చూశాను. బాగా అనిపించింది.. నైస్ ఫిల్మ్..” అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదే ట్వీట్‌కు రాహుల్ రవీంద్రన్ కూడా బదులిచ్చారు. “ధన్యవాదాలు హర్ష. ఈ రోజు నా జన్మ ధన్యమైపోయింది” అని తెలిపారు.
హర్ష భోగ్లే పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోనే.. ఆయన విద్యాభ్యాసం కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (Hyderabad Public School) లో మొదలైంది. ఆ తర్వాత నిజాం కాలేజీలో డిగ్రీ వరకు చదువుకున్నారు. అనంతరం ఐ.ఐ.ఎం అహ్మదాబాద్‌లో ఎంబిఏ పూర్తి చేసి.. క్రికెట్ కామెంటరీలోకి అడుగుపెట్టారు. హర్షకు తెలుగు భాషపై మంచి పట్టు ఉండడమే కాదు.. ఇక్కడి సంప్రదయాలపై కూడా అవగాహన ఉంది. హర్ష భోగ్లే కేవలం సినిమాలు, క్రికెట్ గురించి మాత్రమే కాదు.. వర్తమాన వ్యవహారాలపై కూడా ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తుంటారు. వాటిపై ఎన్నో ట్వీట్స్ చేస్తూ ఉంటారు.
తెలుగు భాషపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ.. హర్ష అప్పుడప్పుడూ తెలుగులోనూ ట్వీట్ చేస్తూ ఉంటారు. ఇది చూసిన ఆయన అభిమానులు కొందరు.. “మీరు తెలుగులోనే క్రికెట్ కామెంటరీ చేస్తే బాగుంటుంది” అని అడుగుతుంటారు. “అది చాలా కష్టంతో కూడుకున్నది. ఒక ట్వీట్ చేయడానికి 2-3 నిమిషాలు అవసరం అవుతుంది. అందులో కూడా కొన్ని తప్పులు ఉంటాయి. పైగా ఇప్పుడు అలవాటు కూడా తప్పింది. తెలుగు అర్థమవుతుంది కానీ గలగలా మాట్లాడాలి అంటే కష్టం” అని ఆ ప్రశ్నకి పలుమార్లు సమాధానం ఇచ్చారు హర్ష భోగ్లే.
ఈ క్రమంలో కొందరు అభిమానులు నిరుత్సాహపడితే; ఇంకొందరు ఆయనకు మద్దతుగా కూడా నిలిచారు. ఏదేమైనా.. హర్ష భోగ్లే తెలుగులో మాట్లాడడం, ట్వీట్ చేయడం.. వంటివి చూస్తే తెలుగు అభిమానులకు సంతోషమే. ఇక ఇప్పుడు తెలుగు సినిమా గురించి ట్వీట్ చేసే సరికి.. వారంతా మరింత మురిసిపోతున్నారు.
By the way, I saw a Telugu movie after a long time. #ChiLaSow. Had sub- titles but could follow it nonetheless. Nice movie.
— Harsha Bhogle (@bhogleharsha) May 22, 2019
Whoa! This made my day! Thank you Harsha… been a huge admirer. This means the world to me!😊😊 https://t.co/B78kxOAHri
— Rahul Ravindran (@23_rahulr) May 22, 2019
మీకు తెలుసా?? ఈ మధ్యనే తెలుగులో విడుదలైన ‘జెర్సీ’ (Jersey) చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Gowtham Tinnanuri) మాట్లాడుతూ – ‘ఒకసారి సచిన్ టెండూల్కర్ గురించి హర్ష భోగ్లే వ్యాఖ్యానం చేస్తున్న సమయంలోనే జెర్సీ కథకి ఆలోచన పుట్టింది. అంతటి ప్రభావం చూపగలిగేలా వ్యాఖ్యానం చేయడం హర్ష భోగ్లేకు వెన్నతో పెట్టిన విద్య’ అన్నారు
మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే – హర్ష హైదరాబాద్‌లో ఉన్న సమయంలోనూ క్రికెట్ ఆడారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహాధ్యాయి కావడం విశేషం. ఈ ఇద్దరూ ఒకే జట్టుకి క్రికెట్ ఆడారు.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.
ఇవి కూడా చదవండి
సాహో విడుదల తేదీని.. స్టైలిష్‌గా ప్రకటించిన ప్రభాస్..!
తన డ్యాన్స్‌తో అందరికి షాక్ ఇచ్చిన.. ఐశ్వర్యారాయ్ ముద్దుల కూతురు ఆరాధ్య ..!
అట్లాంటిక్ సంద్రాన్ని ఒంటరిగా చుట్టివచ్చిన.. భారతీయ సాహసనారి ఆరోహి పండిట్..!