ADVERTISEMENT
home / Celebrity Life
సోగ కళ్ల సుందరికి.. ఛాలెంజ్ విసిరిన దీపికా పదుకొణే

సోగ కళ్ల సుందరికి.. ఛాలెంజ్ విసిరిన దీపికా పదుకొణే

Deepika Padukone challenges Priya Prakash Varrier

“ఒరు ఆదార్ లవ్” చిత్ర ప్రమోషన్‌లో భాగంగా.. ఓ వీడియోలో కన్నుగీటి.. దేశంలో కుర్రకారు మనసులను కొల్లగొట్టిన సుందరి ప్రియా వారియర్ మీకు గుర్తుంది కదా..! ఇప్పుడు ఆమెకు సవాల్ విసరడానికి సిద్ధమైంది మన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే. అవునుండీ.. ‘చపాక్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా దీపిక కన్ను కొడుతూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ కొత్త వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో ఆమె ప్రియా వారియర్‌కు సవాల్ కూడా విసిరింది. ప్రస్తుతం ఇదే వీడియో సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తోంది. 

అయితే ఈ వీడియోకి ప్రియ కూడా బదులివ్వడం విశేషం “దేవత కన్ను కొట్టింది. నిజం చెప్పాలంటే మీకన్నా బాగా చేయడం కష్టం” అని ఆమె రిప్లై కూడా ఇచ్చింది. ప్రియ ప్రకాష్ వారియర్‌కు రాత్రికి రాత్రే స్టార్ డమ్ అందించిన ఆ కన్నుగీటిన వీడియో అప్పట్లో పెద్ద సంచలనమే నమోదు చేసింది. రిషి కపూర్ లాంటి పెద్దలు కూడా ఈ వీడియోకి ఫిదా అయిపోయామని అప్పట్లో చెప్పారు. “ఒరు ఆదార్ లవ్” సినిమా అంత పెద్ద ఆదరణకు నోచుకోకపోయినా.. ఆ సినిమా ప్రమోషనల్ వీడియో ద్వారా ప్రియా వారియర్‌కు రావాల్సిన పేరు వచ్చిందన్నది మాత్రం సత్యం.

దీపికా పదుకొణే రాజకీయాల్లోకి వస్తే.. ఏ శాఖ మంత్రి అవుతారో తెలుసా..?

ADVERTISEMENT

కాగా.. ప్రస్తుతం ప్రియకు సవాలు విసురుతూ.. దీపిక పోస్టు చేసిన వీడియో కూడా చాలా వైవిధ్యంగా ఉంది. ‘చపాక్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేసిన ఈ వీడియోకి ప్రస్తుతం మంచి రెస్పాన్స్ వస్తోంది. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితకథ ఆధారంగా తీసిన ‘చపాక్’ చిత్రం.. ఇప్పటికే వార్తలలో నిలిచింది. ఈ చిత్రం కోసం దీపిక ప్రత్యేకంగా ప్రోస్తటిక్ మేకప్ సైతం చేయించుకోవడం విశేషం. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం.. జనవరి 10వ తేదిన విడుదలకు సిద్ధమవుతోంది.  

రణ్ వీర్‌తో ఉంటే.. వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు : దీపిక

2020 సంవత్సరంలో ‘చపాక్’ చిత్రంతో పాటు.. దీపిక ’83’ చిత్రంలో కూడా నటిస్తోంది. 1983 క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న  ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రను పోషిస్తుండగా.. ఆయన సతీమణి పాత్రలో దీపిక నటించనుంది. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలలో కూడా డబ్ చేయబడుతోంది. కబీర్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రీతమ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తోంది. 

దీపిక, సోనమ్.. వెడ్డింగ్ స్టయిల్ లో ఎవరు మేటి?

ADVERTISEMENT

2019 సంవత్సరంలో దీపిక ఏ చిత్రంలోనూ నటించలేదు. 2018 లో మాత్రం ‘పద్మావత్’ చిత్రంలో నటించింది. ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ఆ చిత్రంలో.. దీపికకు మంచి మార్కులే పడ్డాయి. తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన ‘జీరో’ చిత్రంలో అతిథి పాత్రలో నటించి కనువిందు చేసింది దీపిక. తర్వాత కొన్ని రోజులు ఆమె బ్రేక్ కూడా తీసుకుంది. రణ్‌వీర్‌తో కలిసి విదేశాలలో గడపడానికే ఎక్కువ సమయాన్ని కేటాయించింది. ఇక 2019 లో రణ్ వీర్ సింగ్ నటించిన ‘గల్లీ బాయ్’ చిత్రం ఎంత పెద్ద హిట్టో  మనకు తెలియంది కాదు. 

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.                                                                                    

01 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT