మన్మథుడు నాగార్జునతో.. రొమాన్స్ చేయనున్న కీర్తి సురేశ్..!

మన్మథుడు నాగార్జునతో.. రొమాన్స్ చేయనున్న కీర్తి సురేశ్..!

మన్మథుడు 2 (Manmadhudu 2) సినిమాపై రోజు రోజుకీ మరింత ఆసక్తి, అంచనాలు పెరిగిపోతున్నాయి. కింగ్ నాగార్జున హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో అందాల తారలు కనువిందు చేయనున్నారు. నాగ్ సరసన రకుల్ ప్రీత్ లీడ్ హీరోయిన్‌గా చేస్తుండగా.. సమంత అతిథి పాత్రలో మెరవనుంది.


ఆరెక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్ సైతం ఈ సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ కూడా తోడైంది. మహానటి చిత్రంతో తనకుంటూ ఇండస్ట్రీలో ఒక ఫాలోయింగ్ సంపాదించుకున్న.. కీర్తి సురేష్ ఓ ముఖ్యమైన పాత్రలో ఈ చిత్రంలో నటించనుందట. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. అంతేకాదు షూటింగ్‌కు సంబంధించిన ఫొటోను సైతం షేర్ చేశారు.
 

 

 


View this post on Instagram


Look who joined our set today! The adorable @keerthysureshofficial 😊 #Manmadhudu2Diaries


A post shared by Rahul Ravindran (@rahulr_23) on
2002లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన "మన్మధుడు" చిత్రం..  నాగ్‌కు అదే టైటిల్‌ను ట్యాగ్‌గా మార్చేసింది. ప్రేమలో విఫలమై ప్రేమ మీద, అమ్మాయిల మీద అసహ్యం పెంచుకొన్న ఓ యువకుడి కథ ఇది.


కామెడీ, ఎమోషన్ రెండూ కలగలిపిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా రాహుల్ రవీంద్రన్ మన్మథుడు 2 సినిమాని తెరకెక్కిస్తున్నారు. నటుడిగా గుర్తింపు తెచ్చుకొన్న రాహుల్‌కు దర్శకుడిగా.. ఇది రెండో సినిమా. 

ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయిందని సమాచారం. నాగ్, రకుల్‌ల మధ్య జరిగే కొన్ని కీలకమైన సన్నివేశాలను పోర్చుగల్‌లో చిత్రీకరించారట.


ఈ సినిమా కథ గురించి విభిన్నమైన ఊహాగానాలు సైతం ప్రచారంలో ఉన్నాయి. ఇటీవలే హిందీలో విడుదలై సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన "దే దే ప్యార్ దే" తరహాలో మన్మథుడు 2 ఉంటుందని భావిస్తున్నారు. నాగ్, రకుల్ మధ్య వయసు బేధం ఎక్కువగా ఉండటం, సినిమా స్టిల్స్ ఆధారంగా ఎవరికి వారు "మన్మథుడు 2" కథను అల్లుకోవడం మొదలుపెట్టారు.


పైగా సినిమాకి సంబంధించిన చిత్రాలలో హీరోయిన్లు అయిన రకుల్, కీర్తి సురేశ్‌లకు, హీరో నాగార్జునకు వయసు తారతమ్యం ఎక్కువగా కనిపిస్తుండటంతో.. ఇలాంటి ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయి. అసలు ఈ సినిమా కథేంటో తెలియాలంటే.. విడుదలయ్యేంత వరకు ఎదురు చూడాల్సిందే.
 

 

 


View this post on Instagram


#Manmadhudu2 working stills:)


A post shared by Rahul Ravindran (@rahulr_23) on
మన్మథుడు 2 సినిమాకు చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఎమ్ సుకుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.


POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ


క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.


ఇవి కూడా చదవండి:


నీకెంత మంది ప్రపోజ్ చేశారు? అభిమాని ప్రశ్నకు రకుల్ ఎలాంటి జవాబిచ్చిందంటే..?


మన్మథుడు కుటుంబంతో సహా వచ్చేశాడు.. ఈయన కుటుంబం పెద్దదే సుమా...!


మరో సారి "మన్మధుడు"గా వచ్చేస్తున్న నాగ్.. రకుల్ ప్రీత్ సరసన రొమాంటిక్ ఎంట్రీ