ADVERTISEMENT
home / వినోదం
“కొబ్బరిమట్ట” మూవీ రివ్యూ – ఇది సంపూ మార్క్ కామెడీ

“కొబ్బరిమట్ట” మూవీ రివ్యూ – ఇది సంపూ మార్క్ కామెడీ

“కొబ్బరిమట్ట” మూవీ రివ్యూ (Kobbari Matta Movie Review)

బాబులకే బాబు ఈ సంపూర్ణేష్ బాబు అంటూ “హృదయ కాలేయం” చిత్రంతో తెలుగునాట ఒక సంచలనానికి కేంద్రమైన హీరో.. మరోసారి తన ట్రేడ్  మార్క్ కామెడీతో కొబ్బరి మట్ట (Kobbari Matta) చిత్రం ద్వారా మన ముందుకి వచ్చాడు. అయితే “హృదయ కాలేయం” తీసిన టీం ఈ కొబ్బరి మట్టకి కూడా పనిచేస్తుండడంతో.. అందరికి ఈ చిత్రం ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి మొదలైంది.

ఆ ఆసక్తికి తోడు “కొబ్బరిమట్ట” తాలూకా టీజర్స్, ట్రైలర్స్ సినిమా పైన అంచనాలని విపరీతంగా పెంచేశాయి. మరి అలా పెరిగిపోయిన అంచనాలని ఈ సినిమా అందుకుందా? లేదా? అనేది ఈ క్రింద సమీక్షలో తెలుసుకుందాం.

“మన్మథుడు” మ్యాజిక్ రిపీట్ చేయడంలో.. తడబడ్డ నాగార్జున (మన్మథుడు 2 మూవీ రివ్యూ)

ADVERTISEMENT

కొబ్బరి మట్ట కథ విషయానికి వస్తే,

ఇది దాదాపు మూడుతరాల కథ. పాపారాయడు, పెద్దరాయడు & ఆండ్రాయుడు పాత్రల నడుమ ఈ కథ కొనసాగుతుంది. అయితే ఈ సినిమా తీసిందే.. తెలుగు సినిమాల్లో వచ్చిన కుటుంబ కథా చిత్రాలకి పేరడీగా కావడంతో.. ఇందులో పాత్రలు, వాటి ప్రవర్తనలు, సన్నివేశాలు మనకి ఇతర తెలుగు సినిమాలని గుర్తుకు తెస్తాయి. అందుకే ఇందులో కథ ఉంది అనడం కన్నా.. కథనంలో వచ్చే సన్నివేశాల ద్వారా పండే హాస్యం పైనే ఈ చిత్రం ఆధారపడి ఉంటుంది అని చెప్పాలి.

అయితే ఇటువంటి పేరడీ చిత్రాలలో… సినిమా మొత్తం అందరికి నచ్చే అవకాశాలు బహు తక్కువ. ఎందుకంటే సినిమాలో 30 పేరడీ సన్నివేశాలు ఉంటే వాటి..లో ఒక 10 నుండి 15 మాత్రమే ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. ఈ సినిమా కూడా అందుకు అతీతమైనది ఏమి కాదు. కొబ్బరి మట్టలో కూడా సినిమా మొత్తంలో ఉన్న సన్నివేశాలు అన్ని మనల్ని నవ్వించవు. అందులో ప్రేక్షకులని బాగా ఆకట్టుకునే సన్నివేశాలు కొన్ని మీకోసం –

* పెద్దరాయుడు తీర్పు

ADVERTISEMENT

భార్య భర్తల మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా.. తమకి న్యాయం చేయమంటూ ఒక జంట పంచాయితీని ఆశ్రయిస్తుంది. తల్లిదండ్రులతో ఉండాలా లేక భార్యతో ఉండాలా అన్న మీమాంసలో ఉన్న యువకుడికి పెద్దరాయుడు తనదైన శైలిలో తీర్పు చెప్పి.. సదరు వ్యక్తితో పాటు సినిమా చూస్తున్న ప్రేక్షకులని కూడా అవాక్కయేలా చేశాడు.

* పెద్దరాయుడు తమ్ముడి పెళ్లి చూపుల సన్నివేశం

ఏదైనా సమస్య తన కళ్ళ ముందు జరిగితే.. చూస్తూ కూర్చోలేదు పెద్దరాయుడు. అలా ఈ సన్నివేశంలో చెడు తిరుగుళ్ళు తిరుగుతున్న భర్తని వదిలేసే వెళ్ళిపోతున్న భార్యకి నచ్చజెపుతూ.. పెద్దరాయుడు చెప్పే సంభాషణలు థియేటర్‌లో చప్పట్లు కొట్టించాయి.

“మహానటి”కే మేటి పురస్కారం: జాతీయ ఉత్తమ నటి అవార్డు కైవసం చేసుకున్న “కీర్తి సురేష్”

ADVERTISEMENT

* ఆండ్రాయుడు ఎంట్రీ సన్నివేశం

సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్‌గా ఆండ్రాయుడు సన్నివేశం వస్తుంది. ఒకరకంగా ఇది సినిమాలో ఇంటర్వెల్ సమయంలో వచ్చే ట్విస్ట్. ఆ ట్విస్ట్‌కి సంబంధించి సంపూర్ణేష్ బాబు చెప్పే 3.30 నిమిషాల డైలాగ్ అద్భుతం అనే చెప్పాలి. సినిమా విడుదలకి ముందే ఆ డైలాగ్‌ని విడుదల చేయడంతో ప్రేక్షకులు థియేటర్‌లో సైతం బాగా ఎంజాయ్ చేశారు.

* పెద్దరాయుడు ‘పేద’ రాయుడుగా మారినప్పుడు వచ్చే సన్నివేశాలు

తమ్ముళ్ళకి ఆస్తినంతా ఇచ్చేసి.. ఇద్దరు భార్యలతో బయటకి వచ్చేసాక.. వారు పేదరికాన్ని అనుభవిస్తున్నారు అని మనకి చెప్పే సన్నివేశాలు కూడా హైలైట్‌గా నిలిచాయి.

ADVERTISEMENT

* పాపారాయుడు సన్నివేశాలు

పాపారాయుడు సన్నివేశాలు కేవలం మూడు మాత్రమే ఈ సినిమాలో ఉంటాయి. ఆ మూడు సన్నివేశాల్లో కూడా ప్రేక్షకులు నవ్వకుండా ఉండలేరు అని ఘంటాపథంగా చెప్పగలం. పాపారాయుడు పాత్రకి సంబంధించి సినిమా మొదట్లో, రెండవ భాగంలో.. అలాగే క్లైమాక్స్ఋలో సన్నివేశాలు ఉంటాయి. ఆ మూడు సన్నివేశాలు కూడా ప్రేక్షకులను  కడుపుబ్బా నవ్విస్తాయి.

* డ్యాన్సులు & మాటలు

డ్యాన్సుల పరంగా సంపూర్ణేష్ బాబు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం మనకి సినిమా చూసే సమయంలో తెలుస్తుంది. ప్రధానంగా ‘ఆండ్రాయుడు’ టైటిల్ సాంగ్.. ‘అ ఆ..’కి.. ఆయన చేసిన నృత్యాలు మనతో చప్పట్లు కొట్టిస్తాయి. ఇక సంభాషణల విషయానికి వస్తే, ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడంతో పాటు.. కథ-కథనంతో పాటుగా మాటలు కూడా అందించిన సాయి రాజేష్ అలియాస్ స్టీవెన్ శంకర్‌ని మెచ్చుకుని తీరాల్సిందే. పేరడీ చిత్రానికి కావాల్సింది సంభాషణలు. అవి బలంగా ఉంటే సినిమా హిట్ అయినట్టే. ఆ విధంగా ఈ సినిమాకి ప్రధాన బలం సాయి రాజేష్ రాసిన డైలాగ్స్ అని చెప్పవచ్చు.

ADVERTISEMENT

ఇక దర్శకుడు రూపక్ రోనాల్డ్ సన్, కథ- కథనాలకి అనుగుణంగా దర్శకత్వం చేసుకుంటూ వెళ్ళాడు. అలాగే ఈ సినిమాకి వెళ్ళాలంటే.. ముందుగానే ఇది రొటీన్ సినిమాలకి భిన్నంగా ఉంటుంది అని సిద్దమయ్యాకే వెళ్ళండి.

ఈ కొబ్బరిమట్ట సినిమా.. తెలుగు సినిమాల్లో వచ్చిన కుటుంబ కథా చిత్రాల పైన పేరడీ.. అలాగే సంపూ మార్క్ హాస్యం ఉన్న చిత్రం.

బిగ్‌బాస్ తెలుగు యాంకర్ నాగార్జున చేతిలో ఉన్న.. పండు (కోతి) బొమ్మ మీకు కావాలా?

10 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT