కొరటాల దర్శకత్వంలో చిరంజీవి.. త్వరలో షూటింగ్ ప్రారంభం..

కొరటాల దర్శకత్వంలో చిరంజీవి.. త్వరలో షూటింగ్ ప్రారంభం..

దాదాపు పదేళ్ల తర్వాత వెండితెరపై 'ఖైదీ నెం 150'గా రీఎంట్రీ ఇచ్చి తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు మెగాస్టార్ చిరంజీవి. ఆ సినిమా విజయం అందించిన ఉత్సాహంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ 'సైరా'లో నటిస్తున్నారు. మరి, ఆ సినిమా తర్వాత చిరు ఏ చిత్రంలో నటిస్తున్నారనే ఉత్సుకత అభిమానుల్లో ఎక్కువగానే ఉంది.

'సైరా' తర్వాత చిరంజీవి సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా పేరు పొందిన కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందే సినిమా గురించి గత కొంత కాలంగా చిత్ర‌సీమ‌లో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలవుతోందని కొందరు.. మార్చిలో అని మరికొందరు చెబుతుండంటంతో అసలు వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారా? లేదా? అనే సందేహం అందరిలోనూ కలిగింది.
 

 

 


View this post on Instagram


A couple of pictures for you from #KhaidiNo150 look test!


A post shared by Konidela Production Company (@konidelapro) on
ఇప్పుడు చిరు, శివ కొర‌టాల‌ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రంపై ఓ స్పష్టత వచ్చింది. ఈ చిత్రాన్ని ఈ నెలలోనే లాంఛనంగా ప్రారంభించనున్నారు. జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలవనుంది. ఈ నెలలోనే ప్రారంభిస్తే షూటింగ్ కోసం.. జూన్ వరకు ఎందుకు ఆగడమనుకొంటున్నారా? ఈ సినిమా కోసం పని చేసే టెక్నీషియన్లు, కథానాయిక, ఇతర నటీనటులు ఇంకా ఫైనల్ కాలేదు. ఈలోగా ఇవన్నీ ఓ కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేయనున్నానరని సమాచారం.
 

 

 


View this post on Instagram


For #BharatAneNenu


A post shared by Koratala Siva (@sivakoratala) on
ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి కావస్తోందని సమాచారం. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


సాధారణంగా కొరటాల శివ సినిమాల్లో సామాజికపరమైన అంశాలు, కమర్షియల్ ఎలిమెంట్లు రెండూ కనిపిస్తాయి. ఆయన హిట్ ఫార్ములా కూడా అదే. తొలి సినిమా 'మిర్చి' నుంచి నిన్నటి  'భరత్ అనే నేను' వరకు అదే సూత్రం ఫాలో అవుతున్నారాయన. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కోసం కూడా అదే రీతిలో కథను సిద్ధం చేశారట. ప్రస్తుతం జపాన్ టూర్లో ఉన్న మెగాస్టార్ ఇండియా తిరిగి రాగానే సినిమా ప్రారంభం కానుందని సమాచారం.


సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ.. మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ మెగాస్టార్ చిరంజీవి.. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తోందంటే అందరిలోనూ అంచనాలు ఎక్కువగా ఉంటాయి. అభిమానుల అంచనాలను ఈ కాంబినేషన్ చేరుకొంటుందా? ఇండస్ట్రీని షేక్ చేసే హిట్ ఇస్తారా? తెలుసుకోవాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే..!


చిరుత నుంచి రంగస్థలం దాకా అలుపెరగని రామ్ చరణ్ ప్రయాణం


ప్రత్యేక గీతంతో హీట్ పుట్టిస్తోన్న పాయల్ రాజ్ పుత్


మన్మథుడు కుటుంబంతో సహా వచ్చేశాడు


అద్భుత‌మైన వార్త‌.. ఇప్పుడు POPxo షాప్ ఓపెన్ అయింది. చ‌క్క‌టి మ‌గ్స్, ఫోన్ క‌వ‌ర్స్‌, కుష‌న్స్‌, లాప్‌టాప్‌స్లీవ్స్ ఇంకా మ‌రెన్నో ఇక్క‌డ 25 శాతం డిస్కౌంట్‌తోనే ల‌భిస్తున్నాయి. POPXOFIRST అనే కూప‌న్ కోడ్‌ని ఉప‌యోగించండి. దీంతో మ‌హిళ‌ల‌కు ఆన్‌లైన్ షాపింగ్ ఎంతో సులువైపోతుంది.