Bigg Boss Telugu 3: మహేష్ విట్టా, పునర్నవిలలో ఎవరు ఎలిమినేట్ అవుతారు?

Bigg Boss Telugu 3: మహేష్ విట్టా, పునర్నవిలలో ఎవరు ఎలిమినేట్ అవుతారు?

(Mahesh Vitta V/s Punarnavi in Elimination race in Bigg Boss Telugu)

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 3'లో భాగంగా.. 11వ వారపు ఎలిమినేషన్ ఈరోజు జరగబోతుంది. దీంతో పునర్నవి లేదా మహేష్ విట్టాలలో.. ఎవరో ఒకరు ఇంటి నుండి ఎలిమినేట్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. 

ఇక నిన్నటి ఎపిసోడ్‌లో వ్యాఖ్యాత నాగార్జున హౌస్ మేట్స్ అందరితోనూ పలు విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా 'బ్యాటిల్ అఫ్ ది మెడాలియన్' పోటీలో జరిగిన లెవెల్స్.. అలాగే అందులో పాల్గొన్న సమయంలో ఇంటిసభ్యులు చేసిన పొరపాట్ల గురించి ఆయన ప్రస్తావించారు.

Bigg Boss Telugu 3 : బాబా భాస్కర్‌ని టార్గెట్ చేసిన.. వరుణ్ సందేశ్, వితిక & పునర్నవి

అలాగే ఇంటిసభ్యులందరికి కలిపి నాగార్జున ఒక టాస్క్ కూడా ఇచ్చారు. ఆ టాస్క్‌లో భాగంగా.. ఇంటి సభ్యులలోని ప్రతి ఒక్కరు.. తమకు హౌస్‌లో భారంగా అనిపించే సభ్యుడు లేదా సభ్యురాలిని ఎంపిక చేసుకోవాలి. అలా ఎంపిక చేసుకున్న సభ్యుల తల పై ఇసుక బస్తాను పెట్టాల్సి ఉంటుంది. అలా పెట్టిన తర్వాత.. సదరు సభ్యుడు లేదా సభ్యురాలిపై ఎంపిక చేసిన వ్యక్తి ఆరోపణలు చేయాలి. ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి.. ఈ ప్రక్రియ జరుగుతున్నంత సేపు కూడా.. ఇసుక బస్తాను తన తల పైనే మోయాల్సి ఉంటుంది.

అలాగే ఈ ఎపిసోడ్‌లో నాగార్జున ఇంటి సభ్యులలో కొందరికి వార్నింగ్‌లు ఇవ్వడంతో పాటు.. పలు సూచనలు కూడా చేశారు. ముఖ్యంగా అలీ రెజా తన ఆట తాను ఆడితే బాగుంటుందని తెలిపారు. అంతేగానీ.. అనవసరంగా తన ఆటతీరుతో శివజ్యోతికి భారం కాకూడదని  సలహా ఇచ్చారు నాగార్జున.

ఆ తరువాత బాబా భాస్కర్‌ని రిక్షా టాస్క్‌లో నుండి.. అనూహ్యంగా తోసేసిన విషయం గురించి వితికను వివరణ అడిగారు. అయితే ఈ క్రమంలో తన వెర్షన్ చెప్పుకొచ్చింది వితిక. అలాగే ఒకవేళ తనని బాబా భాస్కర్ రిక్షాలో నుండి తోసేస్తే.. 'అప్పుడు నువ్వు రియాక్ట్ అయ్యేదానివా? కాదా?' అని ప్రశ్నిస్తే.. 'అవుతాను' అని ఆమె సమాధానమిచ్చింది.

అలాగే శివజ్యోతి, వితికల మధ్య జరిగిన వివాదాన్ని కూడా పరిష్కరించే ప్రయత్నం చేశారు నాగ్. ఇక పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్‌ల గురించి  ఎపిసోడ్ మొత్తం మాట్లాడుతూ ఫన్ క్రియేట్ చేశారు. వీరిద్దరి మధ్యనే ఎందుకిలా జరుగుతుంది..? అంటూ నాగార్జున పదే పదే అడగడం వల్ల.. బిగ్ బాస్ హౌస్‌లో కూడా నవ్వులు పూశాయి.

Bigg Boss Telugu 3: టాస్క్‌లో బాబా భాస్కర్‌ని తోసేసిన వితిక.. ప్రశ్నించిన నాగార్జున ..!

ఇక బాబా భాస్కర్ విషయానికి వస్తే, తను ఎందుకలా అమాయకంగా బ్యాలెన్స్ కోల్పోయారని నాగ్ ప్రశ్నించారు. దానికి సమాధామిస్తూ - 'అసలు ఇది తాను ఊహించలేని సంఘటన' అని బాబా భాస్కర్ తెలిపారు. దీంతో "మొత్తానికి బిగ్‌బాస్ హౌస్‌లో వరుణ్ సందేశ్‌తో పాటు.. మీరు కూడా ఒక ఫ్రూట్ అయిపోయారు" అని ఆయనను నాగార్జున ఆటపట్టించారు.

ఈ టాస్క్ ముగిశాక, యాక్టివిటీ రూమ్‌లో వితికకి మెడాలియన్‌ను బహుకరించడంతో పాటు.. ఒక సర్టిఫికెట్‌ని కూడా ఇంటిసభ్యుల చేత ఇప్పించారు. ఆ తరువాత ఇంటిసభ్యులంతా డ్యాన్స్ చేయడం.. అలాగే కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ తరుణంలో వారు తింటున్న కేక్‌లో.. రాహుల్ సిప్లిగంజ్ ఫోటోని పెట్టడం కొసమెరుపు. ఇలా ఫోటో పెట్టడం ద్వారా.. రాహుల్ సిప్లిగంజ్ ఈ వారం నామినేషన్స్ నుండి సేఫ్ అయినట్టుగా ప్రకటించేశారు.

ఇక రాహుల్ సిప్లిగంజ్ సేఫ్ అయిన తరువాత నామినేషన్స్‌లో ముగ్గురు సభ్యులు మాత్రమే మిగిలారు - వారే వరుణ్ సందేశ్ , పునర్నవి మరియు మహేష్ విట్టా. వీరిలో ఒకరు ఈరోజు ఎలిమినేట్ కాబోతున్నారు. అయితే ఎలిమినేట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు పునర్నవి, మహేష్ విట్టాలకి మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అందరూ ఊహించినట్టుగానే.. ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారా? లేక మరెవరైనా అవుతారా? అన్నది రాత్రి ఎపిసోడ్ పూర్తయ్యాకే తెలుస్తుంది.

Bigg Boss Telugu 3: శివజ్యోతి కోసం.. కావాలని ఓడిపోతున్న అలీ రెజా?