'ఐ ఓన్లీ మేక్ లవ్' అంటోన్న నాగార్జున .. మన్మథుడు 2 టీజర్ టాక్ మీకోసం..

'ఐ ఓన్లీ మేక్ లవ్' అంటోన్న నాగార్జున .. మన్మథుడు 2 టీజర్ టాక్ మీకోసం..

"నాకు అంబులెన్స్ సైరన్ అన్నా.. ఆడాళ్ళ ఏడుపన్నా అలర్జీ ..." - ఇది 17 ఏళ్ళ క్రితం మన్మథుడు చిత్రంలో నాగార్జున చెప్పిన డైలాగ్ .. ఇక ఇప్పుడు 2019లో "ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్... ఐ ఓన్లీ మేక్ లవ్" అంటూ అక్కినేని నాగార్జున (Nagarjuna) మరోసారి అందరినీ మాయ చేయడానికి రడీ అయిపోయారు. మరో రెండు నెలల్లో 60ల వయసులోకి అడుగుపెడుతున్నా మన్మథుడు అనే ట్యాగ్ లైన్ కలిగి ఉన్న ఏకైక తెలుగు నటుడు నాగార్జున. ఆయన నటించిన మన్మథుడు సినిమాకి సీక్వెల్ గా రూపొందుతోన్న మన్మథుడు 2 (Manmadhudu 2) చిత్రానికి సంబంధించిన టీజర్ ని కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు.


ఈ చిత్ర టీజర్ చూస్తే... 

Subscribe to POPxoTV

ఓవైపు తల్లిచాటు బిడ్డగా అమాయకంగా కనిపిస్తూనే; మరోవైపు అమ్మాయిలను ప్రేమలో పడేసే నవమన్మథుడిగా నాగ్ ఆయన పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. అలాగే ఓవైపు హాస్యాన్ని పండిస్తూనే మరోవైపు కథానాయకుడిగా సినిమాను ముందుండి నడిపించినట్లు అర్థమవుతోంది. ఈ టీజర్ లో ప్రముఖ నటి దేవదర్శి, సీనియర్ నటి లక్ష్మి, రావు రమేష్, వెన్నెల కిషోర్.. తదితరులు మనకు కనిపిస్తారు. అయితే ఈ చిత్రంలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేశ్.. వంటి కథానాయికలు నటిస్తున్నప్పటికీ వారు మాత్రం ఈ టీజర్ లో కనిపించలేదు. దాంతో వారి అభిమానులకు కాస్త నిరాశ కలిగిందనే చెప్పాలి.


సినిమాలోని మిగతా పాత్రలన్నీ నాగార్జున పెళ్లి కోసం సెటైర్స్ వేస్తుండగా వారి ముందు ఎంతో అమాయకంగా కనిపించే నాగ్.. వారికి తెలియకుండా మాత్రం ప్లేబాయ్ లా అమ్మాయిలను ప్రేమలో పడేస్తూ ఉంటాడు. 17 ఏళ్ల తర్వాత మన్మథుడిగా నాగార్జున మరోసారి మెరవనున్నప్పటికీ ఈ గ్యాప్, వయసు ఛాయలు.. వంటివేవీ ఆయనలో కనిపించకుండా నాగ్ పాత్రను అంతే చక్కగా తీర్చిదిద్దాడు దర్శకుడు రాహూల్ రవీంద్రన్. అలాగే టీజర్ చివరిలో సినిమా విడుదలకు సంబంధించిన సమాచారం కూడా ఇచ్చాడు.


నాగార్జున పుట్టిన రోజు ఆగస్టు నెలలోనే. అందుకే ఆ నెలంటే ఆయన అభిమానులకు ఎంతో ఇష్టం. వారందరి కోసం ఈ చిత్రాన్ని అదే నెలలో విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోందీ చిత్రయూనిట్. దర్శకుడిగా తన తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టిన రాహూల్ ఇప్పుడు మన్మథుడు 2 చిత్రంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ సినిమాను ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


రొమాంటిక్ హీరోగా నాగార్జునను సిల్వర్ స్క్రీన్ పై చూడడమంటే ఆయన అభిమానులకు చాలా ఇష్టం. దీనికి తోడు వారంతా ఎంతో ఇష్టపడే ఆగస్టు నెలలోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తూ ప్రేక్షకుల నాడి పట్టుకోవడంలో దర్శకుడిగా రాహూల్ రవీంద్రన్ సఫలత సాధించాడని చెప్పచ్చు. అయితే ఈ సినిమాను ఎలా తెరకెక్కించారు? మన్మథుడు సినిమాలానే ఇది కూడా హిట్ గా నిలుస్తుందా? నాగ్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందా?.. వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇంకా తెలియాల్సి ఉంది.


మన్మథుడు 2 చిత్రానికి మనం ఎంటర్ ప్రైజెస్ ద్వారా నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తుండగా; వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ & ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ వారు కూడా చిత్ర నిర్మాణ బాధ్యతలను పంచుకుంటున్నారు. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి చేసుకోగా; నిర్మాణానంతర కార్యక్రమాలో యూనిట్ అంతా బిజీగా గడుపుతోంది.


ఈ సినిమాలో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయండోయ్.. అవేంటంటే.. ఈ చిత్రానికి సంబంధించి ఒక భారీ షెడ్యూల్ ని పోర్చుగల్ లో షూట్ చేశారు. అలాగే ఇందులో ముగ్గురు కథానాయికలు అతిథి పాత్రల్లో మెరవనున్నారు. వారు- సమంత అక్కినేని, కీర్తి సురేశ్, అక్షర గౌడ. ఇన్ని ప్రత్యేకతల నడుమ, అభిమానుల అంచనాల మధ్య విడుదలయ్యే ఈ చిత్రం ఎవరికి, ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే.. 


ఇవి కూడా చదవండి


మన్మథుడు నాగార్జునతో.. రొమాన్స్ చేయనున్న కీర్తి సురేశ్..!


బిగ్ బాస్ 3 కి హోస్ట్ గా వ్యవహరిస్తానంటోన్న రేణు దేశాయ్


ప్రభాస్ డై - హార్డ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చేలా సాగే సాహో టీజర్ టాక్ మీకోసం..