ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
సర్దార్ గబ్బర్ సింగ్ పాటకు.. డ్యాన్స్ చేసి ప్రపంచ విజేతలయ్యారు..!

సర్దార్ గబ్బర్ సింగ్ పాటకు.. డ్యాన్స్ చేసి ప్రపంచ విజేతలయ్యారు..!

మీరు చదివింది నిజమే. అమెరికన్ డ్యాన్స్ షో ‘వరల్డ్ ఆఫ్ డ్యాన్స్’ షోలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా పాటకు డ్యాన్స్ చేసి విజేతగా నిలిచింది ‘ది కింగ్స్’ గ్రూప్. మే నెల 5న ప్రసారమైన ఈ కార్యక్రమం ఫైనల్లో ముంబయికి చెందిన ‘ది కింగ్స్’ గ్రూప్ సభ్యులు తెలుగు పాటకు డ్యాన్స్ చేసి మిలియన్ డాలర్లు.. అదే మన రూపాయల్లో చెప్పుకోవాలంటే సుమారు 7 కోట్ల రూపాయలు బహుమతిగా అందుకొన్నారు. ఇంటరెస్టింగ్‌గా అనిపిస్తోంది కదా..? దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకొందాం.

అమెరికన్ టీవీ చానల్ NBC లో ప్రసారమయ్యే ‘వరల్డ్ ఆఫ్ డ్యాన్స్’(World of Dance) షోకి ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ఈ ఏడాది ప్రసారమైంది మూడో సీజనే అయినప్పటికీ ఈ షోకి చాలా మంది అభిమానులున్నారు. దేశ విదేశాలకు చెందిన డ్యాన్స్ గ్రూప్‌లు.. ఈ డ్యాన్స్ షోలో తమ ప్రతిభను నిరూపించుకోవడంతో పాటు తమ దేశానికే టైటిల్ తీసుకెళ్లాలని పోటీపడుతుంటాయి.

ఈ షోకి జెన్నిఫర్ లోపెజ్, నీ-యో, డెరెక్ హో వంటి సూపర్ స్టార్స్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి ‘వరల్డ్ ఆఫ్ డ్యాన్స్’ షో కార్యక్రమం ఎన్బీసీ ఛానెల్లో ప్రసారమవడం మొదలైంది. కానీ ఫైనల్స్‌లో మన దేశానికి చెందిన ‘ది కింగ్స్ యునైటెడ్’ టీం విజేతగా నిలిచింది. ముంబయికి చెందిన 14 మంది సభ్యుల ఈ హిప్ హాప్ బృందం ఆది నుంచి అందరినీ ఆకట్టుకుంటూ వచ్చింది. భారతీయ పాటలకు హిప్ హాప్ డ్యాన్స్ చేస్తూ అటు జడ్జిలు ఇటు తోటి డ్యాన్సర్ల ప్రశంసలను అందుకొన్నారు ఈ బృంద సభ్యులు. ప్రేక్షకులు మనసులను సైతం గెలుచుకొన్నారు.

ఇంతకూ ఫైనల్లో వీరు ఏ పాటకు డ్యాన్స్ చేశారో తెలుసా? సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలోని ‘ఆడెవడన్నా.. ఈడెవడన్నా.. సర్దారన్నకు ఎదురువడన్నా’ పాటకే. ఇంకో ఇంటరెస్టింగ్ విషయం తెలుసా? ఈ పాటకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌గా ‘ఓ ఫార్చునా’ అనే ఇంగ్లీష్ పాట థీమ్ మ్యూజిక్ జోడించారు. రెండు భిన్నమైన పాటలను మేళవించి తమదైన స్టెప్పులతో అదరగొట్టారు. న్యాయనిర్ణేతలకు ఈ పాట చూస్తున్నంత సేపు ఓ సినిమా చూసిన అనుభూతి కలిగిందట. ఈ మిక్స్డ్ పాటకు ది కింగ్స్ గ్రూప్ ఎలా డ్యాన్స్ చేశారో తెలుసుకోవాలనిపిస్తోంది కదా.. ఆ వీడియోను ఇక్కడ వీక్షించండి.

ADVERTISEMENT

 

డ్యాన్స్ అదరగొట్టారు కదా. వీరు చేసిన ఈ డ్యాన్స్‌కు న్యాయనిర్ణేతలు ముగ్గురూ ఫిదా అయిపోయారు. స్టాండింగ్ ఒవేషన్‌తో పాటు 100 మార్కులిచ్చారు. వరల్డ్ ఆఫ్ డ్యాన్స్ ఫైనల్స్‌కు మొత్తం ఆరు బృందాలు చేరుకోగా మన దేశానికి చెందిన ది కింగ్స్ విజయం సాధించడం విశేషం. ఈ డ్యాన్స్ షోలో మరో ఆసక్తికరమైన సంఘటన కూడా జరిగింది. క్వాలిఫైయర్స్‌లో ది కింగ్స్ చేసిన ప్రదర్శనకు ఫిదా అయిన జడ్జిలు.. వారి టాలెంట్‌ను గౌరవిస్తూ వారి పైకి చెప్పులు విసిరారు. అలా చెప్పులు విసరడం ప్రతిభను గౌరవిస్తున్నట్టుగా అక్కడ భావిస్తారట.

2008 నుంచి ది కింగ్స్ గ్రూప్ స్ట్రీట్ హిప్ హాప్ ప్రదర్శనలు  చేస్తోంది. కానీ ఇండియాస్ గాట్ టాలెంట్ సీజన్ 3తో వీరి ప్రతిభ గురించి వెలుగులోకి వచ్చింది. 2015లో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో ఈ గ్రూప్ మూడోస్థానం దక్కించుకొంది.  తాజాగా వరల్డ్ ఆఫ్ డ్యాన్స్ షోలో విజేతగా నిలిచి మిలియన్ డాలర్ల బహుమతి అందుకొంది. ఫైనల్లో మాత్రమే కాదు. ఈ షోలో చేసిన ప్రతి డ్యాన్స్ ఫెర్మార్మెన్స్‌తో వీరు అదరహో అనిపించారు. 

ఈ సీజన్లో వారు చేసిన అన్ని ప్రదర్శనలకు సంబంధించిన వీడియోను ఇక్కడ వీక్షించండి.

ADVERTISEMENT

 

ప్రపంచ వేదికపై సత్తా చాటి విజేతలుగా నిలిచిన ది కింగ్స్ గ్రూప్‌కు ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మన దేశానికి చెందిన ప్రముఖులు సైతం వీరిని ప్రశంసిస్తున్నారు. దర్శకురాలు, కొరియోగ్రాపర్ అయిన ఫరా ఖాన్, విశాల్ దడ్లాని, వరుణ్ ధావన్.. తదితరులు ట్విట్టర్ వేదికగా వీరికి తమ అభినందనలు తెలియజేశారు.

ఇవి కూడా చదవండి:

ప్రత్యేక గీతంతో హీట్ పుట్టిస్తోన్న పాయల్ రాజ్ పుత్

ADVERTISEMENT

పరుగులు రాణిగా కత్రినా నటించనుందా?

మీ కాలేజీ జీవితంలో ఈ స్వీట్ మెమరీస్ ఉన్నాయిగా..?

06 May 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT