వాయిదా పడిన సాహో విడుదల తేదీ.. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా?

వాయిదా పడిన సాహో విడుదల తేదీ.. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా?

సాహో (saaho).. డార్లింగ్ ప్రభాస్ (Prabhas), బాలీవుడ్ అందాల తార శ్రద్ధా కపూర్ ( Shraddha kapoor) నటించిన చిత్రం ఇది. సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూ. 300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రం.. అందులోనూ నాలుగు భాషల్లో విడుదలయ్యేందుకు సిద్ధమవ్వడంతో.. సినిమా ఆరంభం నుంచే దీనిపై చాలా అంచనాలు పెరిగిపోయాయి.  ఈ క్రమంలో సినిమా ఆగస్టు 15న విడుదలవుతుందని చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విడుదల తేదీ (release) వాయిదా పడిందని వార్తలొస్తున్నాయి.

Twitter

అనుకున్నట్లుగానే సమయానికి చిత్ర షూటింగ్ పూర్తి చేసి.. తాజాగా గుమ్మడి కాయ కూడా కొట్టింది సాహో చిత్ర బృందం. అయితే పోస్ట్ ప్రొడక్షన్ అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోవడమే విడుదల ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది. సాహో సినిమాలో గ్రాఫిక్ వర్క్ కూడా ఎక్కువగానే ఉండడంతో.. దీనికి సమయం ఎక్కువగానే పడుతోందట. అందుకే ఈ సినిమా విడుదలను ఆగస్టు 15 నుంచి ఆగస్టు 30కి వాయిదా వేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర బృందం ఏమీ స్పందించలేదు.

 

 

యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ 'సాహో' చిత్రంపై... స్పెషల్ ఫోటో ఫీచర్..!

అయితే సాహో విడుదలయ్యే తేదీన (ఆగస్టు 15) మరో రెండు తెలుగు సినిమాలు, రెండు హిందీ సినిమాలు విడుదలవుతుండడం చూసిన వారంతా సాహో వాయిదా పడింది కాబట్టే.. ఈ సినిమాల విడుదల తేదీలు కూడా మారాయని భావిస్తున్నారు. శర్వానంద్ నటించిన 'రణరంగం' సినిమా విడుదల తేదీని ఆగస్టు 15న ప్రకటించారు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ కథానాయికలుగా కనిపించనున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ 90ల నాటి గ్యాంగ్ స్టర్ డ్రామా సినిమా. ఈ సినిమా విడుదల తేదీ ఆగస్టు మొదటివారంలో అనుకున్నా.. సాహో వాయిదాతో ఆగస్టు 15న విడుదల చేసేందుకు సిద్ధమైందీ చిత్ర యూనిట్.

 

 

ప్రభాస్ "సాహో" ఫస్ట్ సాంగ్.. "ఆగడిక సైకో సయ్యా" లిరిక్స్ మీకోసం..!

అలాగే ఆగస్టు 15 తేదిన మరో చిత్రం కూడా విడుదలకు సిద్ధమైంది. అదే అడవి శేష్ నటించిన 'ఎవరు'. ఈ చిత్రంలో రెజీనా కథానాయిక. పీవీపీ సినిమాస్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రంతో వెంకట్ రామ్‌జీ దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. ఈ సినిమాను తొలుత ఆగస్టు 23వ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ సాహో వాయిదాతో ఈ సినిమా విడుదల వారం ముందుకు జరిగి ఆగస్టు 15న విడుదలకు సిద్ధమైంది.

ఈ రెండు సినిమాలు విడుదలవుతున్నాయంటే.. ప్రభాస్ సాహో విడుదల తప్పకుండా వాయిదా పడిందని వూహాగానాలు మొదలయ్యాయి. ఎందుకంటే ఈ సినిమాల నిర్మాతలు, హీరోలు అందరూ సాహో టీమ్‌కి స్నేహితులే. అంత భారీ ఖర్చుతో రూపొంది.. ఎన్నో అంచనాలతో విడుదలవబోతున్న సాహోకి పోటీగా తమ సినిమాలను విడుదల చేసే ప్రయత్నం వీళ్లు చేయరు. అందుకే అందరూ సాహో విడుదల తేదీ పట్ల అంత ధీమాగా ఉన్నారు. మరి, ఈ సినిమా యూనిట్ దీనికి ఏం సమాధానం చెబుతుందో చూడాలి..

కేవలం ఈ రెండు తెలుగు సినిమాలే కాదు.. హిందీలోనూ రెండు సినిమాలు ఆగస్టు 15న విడుదలకు సిద్ధమవుతున్నాయి. అక్షయ్ కుమార్, విద్యాబాలన్, ఛార్మి, సోనాక్షి సిన్హా, నిత్యా మేనన్ కలిసి నటించిన మిషన్ మంగల్ సినిమా ఆరోజే విడుదలకు సిద్ధమైంది. మరోవైపు జాన్ అబ్రహాం హీరోగా నటిస్తోన్న పోలీస్ డ్రామా బత్లా హౌజ్ కూడా ఆగస్టు 15న విడుదల కానుంది.

వాటితో పోటీకి అవసరం లేకుండా మరో విడుదల తేదీని సాహో చిత్ర బృందం ప్రకటిస్తుందని అంతా భావిస్తున్నారు. మరోవైపు నాలుగు భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం దేశంలోని పలు నగరాల్లో తిరుగుతూ గ్రాండ్‌గా ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించబోతోందట సినిమా యూనిట్. పదిహేను రోజులు సినిమా వాయిదా పడడం వల్ల మరింత జోరుగా ప్రచారం నిర్వహించవచ్చని కూడా అంతా చెప్పడం విశేషం.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

 

 

ప్రభాస్ 'సాహో' టీజర్‌లో.. మీరు చూడాలనుకునే '7' అంశాలు ఇవేనా!