ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
ఒంటరిగానే ఉన్నా.. అయినా హ్యాపీగా వాలెంటైన్స్ డే జరుపుకొంటా..

ఒంటరిగానే ఉన్నా.. అయినా హ్యాపీగా వాలెంటైన్స్ డే జరుపుకొంటా..

కొంతమందికి వాలెంటైన్స్ డే అంటే అస్సలు ఇష్టం ఉండదు. నేను మాత్రం అలా కాదు. నేనెవరితోనూ రిలేషన్ షిప్ లో లేకపోయినా.. నేను చాలా హ్యాపీగా ప్రేమికుల రోజు సెలబేట్ చేసుకొంటాను. నా స్నేహితురాలెవరైనా.. నేను ప్రేమలో పడ్డా అని చెబితే.. నేను ఆనందంతో ఎగిరి గంతేస్తాను. వారి ప్రేమను నేను సెలబ్రేట్ చేస్తాను. ఒకరితో ఒకరు ప్రేమగా, అన్యోన్యంగా ఉండే జంటలను చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాంటి వారిని చూసే కొద్దీ ప్రేమ అంటే మరింత ఇష్టం పెరుగుతోంది.  అందుకే నేను సింగిల్ గా ఉన్నా ప్రేమికుల రోజు జరుపుకోవడానికి ఇష్టపడతాను.

ఏమో నా మనసును ఏ మనోహరుడు వచ్చి దోచుకొంటాడో.. నేను కూడా ప్రేమలో పడిపోతానేమో. ఏదో ఒక రోజు నా మనసుకి నచ్చిన వ్య‌క్తి దొరక్కపోడు.. అతనికి నా మనసు అర్పించకపోను. ఆ క్షణం నా మనసుకి రెక్కలొచ్చి విహరిస్తుంది. నేను ప్రేమ గురించి ఇంత హాయిగా చెబుతుంటే చాలా మందికి నచ్చకపోవచ్చు. అయినా నేను ప్రేమను ప్రేమించడం ఆపను. నన్ను ప్రేమించే వ్యక్తి కోసం ఎదురుచూడటం ఆపను.

నేను ప్రేమలో లేకపోయినా వాలెంటైన్స్ డే రోజు నన్ను విష్ చేస్తూ మెసేజెస్ వస్తుంటాయి. వాటిని చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. కొంతమంది అందమైన కవితలు పంపిస్తారు. ఇంకొందరు ముచ్చటగొలిపే ఫొటోలను పంపిస్తారు. మీకో విషయం తెలుసా? ఎప్పటికైనా సరే నేను ప్రేమ వివాహం  చేసుకొంటాను. ప్రేమ కాస్త కష్టమైన టాపికే. దాని గురించి డిస్కస్ చేయడం మొదలుపెట్టామంటే అసలు దానికి అంతమే ఉండదు. నేనైతే రెండే రెండు పదాల్లో చెబుతా. అది అందమైనది.. అద్భుతమైనది.

1-single-girl-celebrates-love

ADVERTISEMENT

వాలెంటైన్స్ డే వస్తుందంటే.. నేను చాలా ఇంటరెస్టింగ్ గా ఎదురు చూస్తుంటాను. ఎవరైనా నాకు ఫ్లవర్స్ ఇస్తారేమో.. గిఫ్ట్స్ ఇస్తారేమో.. ప్రపోజ్ చేస్తారేమో అని..! అలా అని వారి ప్రపోజల్ యాక్సెప్ట్ చేయను. అదో సరదా అంతే. అంటే వారి ప్రేమను అంగీకరించాలంటే.. వారి మీద నాకు ఇష్టం, ఇంటరెస్ట్ ఉండాలి కదా.. ఆ రెండు ఎవరి మీదైనా నాకు కలిగితే.. నేను వాలెంటైన్స్ డే వరకు ఆగను. మంచి టైం చూసుకొని నేనే ప్రపోజ్ చేసేస్తాను.

ఈ “వాలెంటైన్స్ డే” కానుకలతో.. మీ మనోహరుడి మనసుని మరోసారి దోచేయండి

అసలు ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రత్యేకించి ఒక రోజు ఏంటి? నిజంగా ప్రేమలో ఉన్నవారికి ప్రతి రోజూ వాలెంటైన్స్ డేనే. నాలాగా. అంటే నేను నాతోనే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి ఉన్నాను. నన్ను నేనే ప్రేమించుకోలేకపోతే.. ఇంకెవరైనా నన్ను ఎందుకు ప్రేమిస్తారు? అప్పుడప్పుడూ నాకు చాలా ఒంటరిగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. నా మనసులోని భావాలను పంచుకోవడానికి తోడు లేదే అని చాలా సార్లు అనుకొంటాను. అలాగని తొందరపడి నిర్ణయం తీసుకోలేం కదా.. అందుకే భాగస్వామిని ఎంపిక చేసుకొనే విషయంలో నిదానంగా వ్యవహరిస్తున్నాను.

ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కు థ్యాంక్స్ చెబుతూ ఓ అమ్మాయి రాసిన లేఖ

ADVERTISEMENT

నిజం చెప్పాలంటే.. ప్రేమికుల రోజు నాకు కాస్త వెలితిగానే ఉంటుంది. నా ఫ్రెండ్స్ అంతా వారి వారి భర్త, బాయ్ ఫ్రెండ్ తో వాలెంటైన్స్ డేని చాలా ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకొంటారు. నేనేమో ఒంటరిగా సెలబ్రేట్ చేసుకొంటాను. కానీ నాకు చాలా గట్టి నమ్మకం ఉంది. వచ్చే ఏడాది వాలెంటైన్స్ డేని చాలా సంతోషంగా.. నా భాగస్వామితో జరుపుకొంటానని. అప్పుడే కదా.. నా ప్రేమ పండగ మరింత హ్యాపీ హ్యాపీగా అవుతుంది. ఈ సారికి ఇలా సింగిల్ గానే వాలెంటైన్స్ డేని హ్యాపీగా జరిపేసుకొంటా.

ప్రేమ కోసం ప్రేమగా ఎదురు చూస్తున్న ఓ అమ్మాయి చెప్పిన విశేషాలివి.

Images: Shutterstock

#నా ప్రేమకథ: బెదిరించారు.. భయపెట్టారు.. అయినా మా ప్రేమను గెలిపించుకొన్నాం..

ADVERTISEMENT
12 Feb 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT