Bigg Boss Telugu 3 : నామినేషన్స్ లో శ్రీముఖి & శివజ్యోతి ఉండబోతున్నారా?

Bigg Boss Telugu 3 : నామినేషన్స్ లో శ్రీముఖి & శివజ్యోతి ఉండబోతున్నారా?

బిగ్ బాస్ తెలుగు (bigg boss telugu) సీజన్ 3లో భాగంగా నిన్నటితో 12 వారాలు ముగిసాయి. ఎక్కువ శాతం మంది ముందుగా ఊహించినట్టుగానే మహేష్ విట్టా ఎలిమినేట్ అవ్వడం జరిగింది. దీనితో బిగ్ బాస్ ఇంటిలో సభ్యులు సంఖ్య ఏడుకి చేరింది.

Bigg Boss Telugu 3: కుండ బద్దలు కొట్టి నిజాలు చెప్పిన.. బిగ్ బాస్ ఇంటి సభ్యులు ..!

ఇక ఈరోజు పదమూడో వారానికి సంబందించిన నామినేషన్స్ జరగనున్నాయి. అయితే ఈ వారం నామినేషన్స్ కాస్త వైవిధ్యంగా జరగబోతున్నాయి అని అర్ధమవుతుంది. 'టాపర్స్ అఫ్ ది హౌస్' అనే ఈ నామినేషన్స్ కి సంబందించిన ప్రోమో చూస్తే, ఇంటిలో మిగిలి ఉన్న ఏడుగురు సభ్యులకి.. ఒకటి నుండి ఏడు వరకు ర్యాంకింగ్స్ తో కూడిన ప్రాపర్టీస్ ఇవ్వడం జరిగింది. నామినేషన్స్ టాస్క్ బజర్ మోగగానే వెంటనే ఇంటిలోని సభ్యులు వారికి ఏర్పాటు చేసిన బౌల్ లో ఉన్న స్లిప్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా వచ్చిన దానిని బట్టి 1 నుండి 7 స్థానాల్లో నిలబడాల్సి ఉంటుంది.

అయితే ఇందులో మెలిక ఏంటంటే, ఒక నంబర్ దగ్గర ఒక్కరే ఉండాలి. అయితే తాము అనుకున్న నంబర్ దగ్గర స్థానం దొరకని వారు ఆ నంబర్ దగ్గర ఉన్న వారిని ఒప్పించి ఆ స్థానానికి మారే అవకాశం కూడా ఉంటుంది. అయితే సాధారణంగా ఈ టాస్క్ లో చివరి స్థానాల్లో ఉన్న వారిని నామినేషన్స్ లోకి పంపించడం జరుగుతుంది . ప్రస్తుతం కనిపిస్తున్న దాని ప్రకారం , శ్రీముఖి (sreemukhi) 7వ నంబర్ స్థానంలో ఉండడంతో ఆమె ఈ వారం నామినేషన్స్ లో తప్పక ఉండి తీరుతుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నామినేషన్స్ కి సంబందించిన సస్పెన్స్ ఈ రాత్రికి ప్రసారమయ్యే ఎపిసోడ్ తో తెరపడనుంది.

ఇదిలా ఉంటే నిన్నటి సండే ఎపిసోడ్ కాస్త డల్ గానే మొదలైంది. కారణం, శనివారం నాటి ఎపిసోడ్ లో ఒక టాస్క్ లో భాగంగా బాబా భాస్కర్ కి జోకర్ అనే ఒక టైటిల్ ని శివజ్యోతి ఇవ్వడం జరిగింది. ఆ టైటిల్ ఇవ్వడం తనని కించపరిచినట్టుగా ఉంది అంటూ బాబా భాస్కర్ కన్నీటి పర్యంతమయ్యాడు. తాను ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటున్నాను అని ఇలా ప్రతిసారి తనని ఇలా చులకనగా చూడడం బాగాలేదు అంటూ శివజ్యోతి తనకి ఇచ్చిన టైటిల్ విషయాన్ని తప్పుబట్టాడు.

Bigg Boss Telugu 3 : పునర్నవి కోసం.. రాహుల్ సిప్లిగంజ్ పడిన బాధకి కారణం ప్రేమేనా?

దీనికి సంబంధించి మాట్లాడి బాబా భాస్కర్ ని కాస్త సముదాయించిన నాగ్.. ఆ వెంటనే సండే ఎపిసోడ్ లో సాగే సరదా టాస్కులని ఆడించడం జరిగింది. అందులో భాగాంగా ముందు ఇంటిలోని సభ్యులని రెండు టీమ్స్ గా విడదీసి - పిక్షనరీ తో సినిమా టైటిల్స్ గుర్తుపట్టడం అనే టాస్క్ ని ఇచ్చాడు. అయితే ఈ టాస్క్ లో టీం మహేష్ కన్నా టీం శ్రీముఖి బాగా ఆడి టాస్క్ విజేతగా నిలిచింది.

ఈ టాస్క్ తరువాత ఇంకొక ఫన్నీ టాస్క్ ఆడించారు, ఆ టాస్క్ పేరు 'అమ్మతోడు... అంతా నిజమే చెబుతాను'. ఈ టాస్క్ లో -

ఎవరి పెళ్ళికైనా వెళ్లి.. అక్కడ ఎవరికైనా సైట్ కొట్టారా?

స్కూల్ డేస్ లో ఎవరికైనా లవ్ లెటర్ రాశారా?

తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్లి ఫోన్ నంబర్ అడిగారా?

సోషల్ మీడియాలో ఫేక్ ఐడి తో ఎవరితోనైనా చాట్ చేశారా?

పేరెంట్స్ కి తెలియకుండా డబ్బులు ఎప్పుడైనా కొట్టేశారా?

ఇవే కాకుండా అన్నిటికన్నా ఆసక్తికరంగా ఉండే ఒక ప్రశ్న వేశారు నాగార్జున. అదేంటంటే - బిగ్ బాస్ ఇంటిలో ఎవరి పైనైనా మనసు పారేసుకున్నారా? అని అడగగా.. అందరూ రాహుల్ సిప్లిగంజ్ ని చూపించారు. దానికి సమాధానంగా అందరూ చూస్తున్నదే.. కొత్తగా చెప్పడానికి ఏమి లేదు అంటూ కామెంట్ చెప్పడంతో బిగ్ బాస్ ఇంటిలో నవ్వులు పూశాయి.

మొత్తానికి నిన్నటి సండే ఎపిసోడ్ తో బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం ముగిసింది. ఈరోజు నుండి 13వ వారం మొదలు కానుంది, ఈ వారం కాకుండా సీజన్ 3 లో మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండడంతో ఈ వారం నామినేషన్స్ లో ఎవరు నిలుస్తారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు? అన్న అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ..

Bigg Boss Telugu 3: మరోసారి ఘర్షణ పడిన.. వరుణ్ సందేశ్ & వితిక షేరు