Birthday Special - సూపర్ స్టార్ అనే పదానికి.. అసలైన నిర్వచనం చెప్పిన 'రజినికాంత్'

Birthday Special - సూపర్ స్టార్ అనే పదానికి.. అసలైన నిర్వచనం చెప్పిన 'రజినికాంత్'

(Superstar Rajinikanth Birthday Special)

రజినీకాంత్  - అసలు పరిచయం అక్కర్లేని పేరు.   ఎవరైనా సినీ ప్రపంచంలో తారాస్థాయికి చేరుకున్న తరువాత.. మరలా సాధారణ మనిషిలా జీవించడం చాలా కష్టం. ఎందుకంటే -  ఆర్ధిక స్వాతంత్య్రం తనను మాములు మనిషిగా ఉండనివ్వదు. కాని సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం ఇందుకు చాలా భిన్నం. ఎందరో అభిమానులకు ఆయన ఆరాధ్య దైవం. 

తెలుగు ఆడియన్స్ ఆదరిస్తున్న తమిళ హీరోలు & దర్శకులు ఎవరో తెలుసా...

ఆసియా ఖండంలో జాకీచాన్ తరువాత.. ఆ స్థాయిలో పారితోషికం తీసుకుంటూ.. అదేస్థాయిలో  ఒక భారతీయుడు సినీ హీరోగా పేరు ప్రతిష్టలు  సంపాదించడం మామూలు విషయం కాదు.  ఒక్క భారతదేశంలోనే కాదు.. ఖండాంతరాలలో కూడా ఆయనకు  కోట్లాది అభిమానులున్నారు. కానీ ఇవేమి కూడా తనను ప్రభావితం చేయలేదు. 

రజనీకాంత్ తన దైనందిన జీవితంలో కూడా మనకి కుర్తా, లుంగీ.. అలాగే కాళ్ళకి రబ్బరు చెప్పులతో కనిపిస్తారు. ఆయన పబ్లిక్‌గా బయటకి వస్తే మాత్రం కాస్తో కూస్తో వస్త్రధారణలో  మార్పులు ఉంటాయి. అవి కూడా అంత ఆడంబరంగా ఉండవు.

 

Instagram

కేవలం షూటింగ్‌లో పాల్గొనేటప్పుడు తప్ప.. బయట ఎప్పుడూ మనకు ఆయన మేకప్‌‌తో కనిపించరు. అంతే కాకుండా ఆయన రంగు.. ఆహార్యం పై స్వయంగా ఆయనే జోక్స్ వేసుకోవడం రజినీకే చెల్లింది. దాదాపు పదేళ్ల క్రితం ముంబైలో 'రోబో' చిత్రానికి సంబంధించిన  ఈవెంట్‌లో.. తన పక్కన ఐశ్వర్య రాయ్ నటిస్తోందని తెలిసి.. ఓ 70 ఏళ్ళ వృద్ధుడు చేసిన ఫన్నీ కామెంట్స్ గురించి రజినీ స్వయంగా అందరికీ చెప్పారు... అందరి చేత నవ్వులు పూయించారు.

ఇక ఈరోజుతో 70వ పడిలోకి అడుగుపెడుతున్న తరుణంలో కూడా.. సినిమాలు చేయడంలో ఆయన ఏమాత్రం తడబడడం లేదు. గత మూడేళ్ళ నుండి ప్రతిసంవత్సరం.. ఒక చిత్రంలో నటిస్తూ ప్రేక్షకులని అలరిస్తూనే ఉన్నారు. కబాలి, 2.0, కాలా, పేట.. ఇప్పుడు తాజాగా 'దర్బార్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు.

ప్రేమలో ఉన్నా.. పెళ్లికి రోజా - సెల్వమణి పదకొండేళ్లు ఎందుకు ఆగారో తెలుసా?

నిన్ననే రజినీ హీరోగా ఓ చిత్రాన్ని కూడా ప్రారంభించారు. సన్ పిక్చర్స్ పతాకం పై శివ దర్శకుడిగా చేయబోతున్న ఓ చిత్రంలో రజినీకాంత్ హీరోగా, మీనా హీరోయిన్‌గా.. అలాగే కీర్తి సురేష్ మరొక ప్రధాన పాత్రలో నటిస్తుండడం విశేషం. ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిన్ననే జరగగా.. 2020లో ఇదే చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతుందని టాక్. 

 

Courtesy: Indian Movie Rating

సినిమాలు.. అలాగే తనకున్న ఆధ్యాత్మిక చింతనను  పక్కన పెడితే.. 2021లో తమిళనాట జరగబోయే శాసనసభ ఎన్నికల్లో తాను బరిలో దిగనున్నట్లు ప్రకటించారు రజినికాంత్. అలాగే రాజకీయాల్లో కూడా.. ఎప్పటినుండో తన చిరకాల మిత్రుడైన కమల్ హాసన్‌తో కలిసి పనిచేసే అవకాశం ఉందని కూడా ఓ హింట్ ఇచ్చారు. దీనితో రజినీ సూపర్ స్టార్‌గాఈ సంవత్సరమే ఆఖరి పుట్టినరోజు జరుపుకుంటున్నారని..  వచ్చే ఏడాది ఓ  రాజకీయ దురంధురుడిగా బర్త్ డే జరుపుకొనే అవకాశం ఉందని అభిమానులు అనుకుంటున్నారు.

మరి ఆ అభిమానుల ఆశ నెరవేరుతుందా.. లేదా? అన్నది కాలమే నిర్ణయించాలి. ఎందుకంటే రజనీకాంత్ ఎప్పుడూ చెప్పే డైలాగ్ అదే కదా - 'ఆ పై వాడు శాసిస్తాడు... ఈ రజిని పాటిస్తాడు'

మరి మనం కూడా సూపర్ స్టార్ రజినికాంత్‌కి..  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఇటువంటి పుట్టినరోజులు ఆయన మరెన్నో జరుపుకోవాలని కోరుకుందామా

'ప్రతి ప్రేమకథ కంచికి చేరదు' అని తెలిపే.. 'పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్‌'ల లవ్ స్టోరీ ..!