మెగాస్టార్ చిరంజీవి 'సైరా' మేనియాకి ప్రతిరూపమే.. 'సైరా తాలి' @ హోటల్ రాజుగారి తోట

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' మేనియాకి ప్రతిరూపమే.. 'సైరా తాలి' @ హోటల్ రాజుగారి తోట

(Megastar Chiranjeevi special "Sye Raa Thali" at Raju Gari Thota Hotel, Suryapet)

మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అభిమాన జనసందోహం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. మెగాస్టార్‌గా అయన సినీప్రస్థానం ఎందరికో స్ఫూర్తి. ఆరు పదుల వయసులో కూడా నటుడిగా దేనికి కూడా వెనుకాడని ఆయన పట్టుదలే.. ఆ 'మెగాస్టార్' టైటిల్‌కి అర్హుడిని చేసింది. తాజాగా అయన నటించిన చిత్రం 'సైరా' వచ్చే నెల 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతుంది. 

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' ట్రైలర్ లో.. మీకు 'సై.. సైరా' అనిపించే 7 అంశాలు ..!

ఇటీవలే 'సైరా' ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న.. ఎల్బీ స్టేడియంలో అంగరంగవైభవంగా జరిగింది. అసలు మెగాస్టార్ చిరంజీవి.. రాయలసీమ ముద్దుబిడ్డ.. రేనాటి చోళుడు నరసింహారెడ్డి పాత్రలో నటిస్తున్నాడనగానే ప్రేక్షకుల్లో ఒక ఉత్కంఠ మొదలైంది. అయితే వారిలోని ఉత్కంఠ.. ఆనందానికి మారడానికి పెద్దగా సమయం పట్టలేదు. కొద్దిరోజులుగా సైరా సినిమాతో పాటు.. ఆ చిత్రంలోని మెగాస్టార్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్స్, టీజర్, ట్రైలర్ మొదలైనవి.. ప్రేక్షకులని ఎంతగానో మెప్పించాయి. 

అలాగే మెగాఫ్యాన్స్ తమ అభిమాన హీరో పై.. తమకున్న ప్రేమని తెలియచేయడానికి ఎప్పుడూ వినూత్నంగా ప్రయత్నిస్తుంటారు. అదే సమయంలో కొందరు ఇదే క్రేజ్‌ను ఉపయోగించుకొని.. తెలివైన వ్యాపార కార్యక్రమాలని నిర్వహిస్తుంటారు. తాజాగా 'సైరా' చిత్ర విడుదలని దృష్టిలో పెట్టుకుని.. దాని క్రేజ్‌ను ఉపయోగించుకుంటూ.. ఒక హోటల్ యజమాని 'సైరా తాలి' అంటూ ఒక కొత్త ఐటమ్‌ని.. తన హోటల్ మెనూలో చేర్చడం జరిగింది.

 

ఆ వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ - సూర్యాపేట హైవే పక్కనే ఉన్న 'రాజుగారి తోట హోటల్'లో సైరా తాలి అనే ఒక మెగా ఫుడ్ ఐటమ్‌ను భోజన ప్రియుల కోసం తయారుచేశారు. ఈ హోటల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన సూర్యాపేటలో  ఉండడం గమనార్హం. 

ఈ సైరా తాలిలో భాగంగా భోజన ప్రియులకు అందించే వంటకాలివే - రాగి సంకటి, జొన్నరొట్టె, రాయలసీమ నాటుకోడి పులుసుతో కూడిన ఆరు పసందైన వంటకాలు

ఇరు రాష్ట్రాల ఫ్యాన్స్ ఈ హోటల్‌ని సందర్శించే అవకాశం ఉండడంతో.. సదరు హోటల్ యాజమాన్యం ఈ ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. పైగా హైవే పక్కనే ఉండడం కూడా.. ఈ హోటల్‌కి బాగా కలిసొచ్చే అంశం.  'సైరా' సినిమా విడుదల సందర్భంగా.. ఆ మేనియా అభిమానుల్లో ఉండగానే..  బిజినెస్‌తో పాటు.. క్రేజ్‌ని ఏకకాలంలో తెచ్చుకోవాలన్న వ్యాపార ఆలోచన అభినందనీయమే. 

'ప్రతి ప్రేమకథ కంచికి చేరదు' అని తెలిపే.. 'పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్‌'ల లవ్ స్టోరీ ..!

ఇదిలావుండగా 'సైరా' సినిమా సెన్సార్ పూర్తవ్వడం.. దానికి U/A సర్టిఫికెట్ రావడంతో చిత్ర విడుదలకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయినట్టే లెక్క. ఇక సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా..? అని పరితపిస్తున్న అభిమానుల ఆత్రుతని దృష్టిలో పెట్టుకుని.. 1వ తారీఖున స్పెషల్ షోస్ వేసే అవకాశం ఉందని టాక్. అలాగే 2వ తేదీ ఉదయాన్నే ఫ్యాన్స్ షోస్‌కి అనుమతి ఇస్తారా.. లేదా? అనే వివరాల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి.. ఈ వారాంతంలో ఏదొక విషయం క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది.

ఇక ఇటీవలే జరిగిన ప్రీ-రిలీజ్ వేడుకకు.. ఎస్ ఎస్ రాజమౌళి, వివి వినాయక్, పవన్ కళ్యాణ్, కొరటాల శివ మొదలైన వారు ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. ఈ చిత్రం తప్పక విజయం సాధించాలని ఆకాంక్షించారు. అదే సమయంలో సినిమా యూనిట్ సభ్యులైన నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి, ఛాయాగ్రాహకుడు రత్నవేలు, ఫైట్ మాస్టర్స్ రామ్ & లక్ష్మణ్, కాస్ట్యూమ్ డిజైనర్స్, ప్రొడక్షన్ డిజైనర్స్.. ఇలా అందరూ కూడా ప్రీ- రిలీజ్ ఈవెంట్ వేడుకకు విచ్చేసి.. స్టేజిపై సందడి చేశారు.

ఆఖరుగా.. మెగాస్టార్ సినిమా అంటేనే ఒక మేనియా అనేది.. మరోసారి సూర్యాపేటలోని 'సైరా తాలి' అనే కాన్సెప్ట్‌తో రుజువైంది. ఇక దీనిని స్ఫూర్తిగా తీసుకుని.. ఈ వారం రోజుల్లో మరేవైనా ఇటువంటి ప్రకటనలు వస్తాయోమో చూద్దాం. 

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ - మెగా బిజినెస్ ఉమన్ ఉపాసనల.. ప్రేమ బంధం గురించి తెలుసుకుందామా?