ADVERTISEMENT
home / Celebrity Life
ఆమె లైఫ్.. నిజంగానే ఓ జీవిత పాఠం (డిసెంబర్ 6 – సావిత్రి జయంతి)

ఆమె లైఫ్.. నిజంగానే ఓ జీవిత పాఠం (డిసెంబర్ 6 – సావిత్రి జయంతి)

Mahanati Savitri Birth Anniversary – December 6

‘మహానటి’ సావిత్రి.. ఈ పేరు తెలియని తెలుగువారుండరంటే అతిశయోక్తి కాదేమో. కేవలం తెలుగువాళ్లకు మాత్రమే కాదు.. దక్షిణాది చిత్ర పరిశ్రమ మొత్తానికీ ఆమె జీవితం సుపరిచితమే. ఆమె నిజ జీవితకథ ప్రేరణతో.. ఓ బయోపిక్ సైతం రూపుదిద్దుకుందంటేనే.. తన స్థాయి ఏమిటో ఎవరికైనా అవగతమవుతుంది. సినీ పరిశ్రమతో పాటు.. సామాన్య జనానికి కూడా ఆమె జీవితం తెరిచిన పుస్తకమే. కెరీర్ పరంగా గెలుపోటములు సహజమే అయినా.. వ్యక్తిగత జీవితం సైతం ఆ మహానటికి మిగిల్చిన కన్నీళ్లు ఎన్నో. ఈ రోజు (డిసెంబరు 6) సావిత్రి జయంతి సందర్భంగా.. ఆ మేటి నటి జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు మీకోసం ..

ఆనాడు ‘మహానటి సావిత్రి’ పాత్ర కోసం.. అమలా పాల్‌కి ఆఫర్..?

సినిమాల్లోకి రాకముందే సావిత్రి పౌరాణిక, సాంఘిక నాటకాల ద్వారా నటిగా బాగా పాపులర్ అయ్యారు. సినీ నటుడు కొంగర జగ్గయ్య.. అలాగే స్వర్గీయ ఎన్టీఆర్ మొదలైనవారు నడిపిన నాటకాల కంపెనీలలో కూడా ఆమె పనిచేశారు. 13 ఏళ్ల వయసులోనే కాకినాడలో ఆంధ్రనాటక పరిషత్ నిర్వహించిన నృత్యనాటక పోటీలలో పాల్గొని.. బహుమతి పొందిన సావిత్రి.. ఆ అవార్డును అప్పటి బాలీవుడ్ మేటి నటుడు పృధ్వీరాజకపూర్ చేతుల మీదుగా అందుకోవడం విశేషం. మీకో విషయం తెలుసా.. సావిత్రిది ఎడమ చేతి వాటం. ఆమె లెఫ్ట్ హ్యాండ్‌తోనే సంతకాలు చేసేవారు. 

ADVERTISEMENT

కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన పాతాళభైరవి చిత్రం ద్వారా .. చిన్న పాత్రతో తెలుగు తెరకు పరిచయమైన సావిత్రి.. ఆ తర్వాత వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో వచ్చిన దేవదాసు చిత్రంతో స్టార్ హీరోయిన్‌గా మారడం విశేషం. ముఖ్యంగా మిస్సమ్మ, దేవదాసి, అర్థాంగి, చరణ దాసి, మాయాబజార్ చిత్రాలు ఆమె కెరీర్‌ను మలుపు తిప్పాయి. సావిత్రికి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. గ్యారీ సోబర్స్‌కు తను గొప్ప అభిమాని. సినీ తారలందరూ కలిసి క్రికెట్ ఆడే సంప్రదాయానికి నాంది పలికింది కూడా సావిత్రేనని.. చాలామంది అంటారు. 

 

బాలీవుడ్‌లో దీపికా రణ్‌వీర్.. మరి టాలీవుడ్‌లో..?

అలాగే సావిత్రికి చదరంగం ఆట అంటే ఎంతో ఇష్టం. ఆమె ఇంట్లో ఏనుగు దంతాలతో చేసిన అతి పెద్ద చదరంగం బల్ల ఉండేదట. అదేవిధంగా ఆమె మంచి మిమిక్రీ ఆర్టిస్టు కూడా. జెమినీ గణేశన్‌తో పాటు రేలంగి, ఎస్వీ రంగారావు, సరోజా దేవి మొదలైన వారి గొంతులను ఆమె మక్కీకి మక్కీగా అనుకరించే వారు. అలాగే హిందీ చిత్ర పరిశ్రమతో కూడా సావిత్రికి కొంత అనుబంధం ఉండేది. 

ADVERTISEMENT

‘ఏక్ చిట్టీ ప్యార్ భరీ’  అనే హిందీ చిత్రాన్ని సావిత్రి సొంత డబ్బులతో నిర్మించింది. అయితే అలాంటి ప్రయోగాలు ఆమెకు అనేకసార్లు ఆర్థిక నష్టాలనే మిగిల్చాయి. ప్రముఖ తమిళ నటుడు జెమినీ గణేశన్‌తో వివాహమయ్యాక.. సావిత్రి తన వైవాహిక జీవితంలోనూ అనేక లోటుపాట్లను చూసింది. ఇక దానం చేసే ఆమె చేయి.. అడిగిన వారి లేదనకుండా పెట్టేది. ఆమె  ఆర్థికంగా పతనమవ్వడానికి ఇలాంటి కారణాలూ ఉన్నాయంటారు.

“మహానటి”కే మేటి పురస్కారం: జాతీయ ఉత్తమ నటి అవార్డు కైవసం చేసుకున్న “కీర్తి సురేష్”

ఏదేమైనా.. ఆమె వ్యక్తిగత జీవితాన్ని కాస్త పక్కన పెడితే.. భారతీయ సినిమా గర్వించదగ్గ మేటి నటి సావిత్రి. డాక్టర్ చక్రవర్తి, గుండమ్మ కథ, మూగ మనసులు, ఆరాధన, సుమంగళి, దేవత.. ఇలా తెలుగు సినీ పరిశ్రమకు ఆమె అందించిన సూపర్ హిట్ చిత్రాలు అన్నీ ఇన్నీ కావు. “మూగ మనసులు” సినిమా ఆమెకు ఎంతగా నచ్చిందంటే.. తమిళంలో శివాణీ గణేశన్ హీరోగా ఆమే స్వయంగా ఆ సినిమాకి నిర్మాతగా వ్యవహరించి రీమేక్ కూడా చేసింది. తానే దర్శకత్వం కూడా వహించింది. అయితే ఆ చిత్రం కూడా ఆమెకు పెద్ద లాభాలార్జించ పెట్టలేదు. 

2018లో దర్శకుడు నాగ్ ఆశ్విన్.. కీర్తి సురేష్ ప్రధాన పాత్రధారిగా సావిత్రి జీవిత చరిత్రను “మహానటి” పేరుతో తెరకెక్కించారు. ఇదే చిత్రం కీర్తీ సురేష్‌కి ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సైతం అందించింది. 

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

 

06 Dec 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT