ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
నాగచైతన్య, వెంకటేష్ చేస్తున్న.. మూవీ మ్యాజిక్ “వెంకీ మామ” విశేషాలివే..!

నాగచైతన్య, వెంకటేష్ చేస్తున్న.. మూవీ మ్యాజిక్ “వెంకీ మామ” విశేషాలివే..!

F2 చిత్రం హిట్‌తో మంచి ఊపు మీదున్న వెంకటేష్ (Venkatesh).. అలాగే ఇటీవలే రిలీజైన మజిలీ చిత్రంతో తన ఖాతాలో మరో హిట్ వేసుకున్న నాగచైతన్య కాంబినేషనులో వస్తున్న చిత్రమే వెంకీ మామ.

ఉగాది సందర్భంగా ఈ రోజే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది.

మరి మనం కూడా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని విశేషాలు చదివేద్దామా

రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ కథానాయికలుగా నటిస్తున్న.. ఈ చిత్రానికి కె.ఎస్‌.రవీంద్ర (బాబి) దర్శకత్వం వహిస్తున్నారు.

ADVERTISEMENT

పూర్తి స్థాయి పల్లెటూరి నేపథ్యంతో పాటు.. ఆర్మీ టచ్ ఉన్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.

ఈ సినిమా పోస్టర్‌లో కనిపించిన టూవీలర్ పై కూడా ‘జై జవాన్‌.. జైకిసాన్‌’ అనే టైటిల్‌ కనిపించడం గమనార్హం

ఈ ఫస్ట్ లుక్ పోస్టరును పూర్తిగా విలేజ్ ఔట్ లుక్ కనిపించేలా రూపొందించారు. వెనుక అరటిగెలలతో పాటు గుడి గోపురం, పంటపొలాల మధ్య హీరోలిద్దరూ.. ధాన్యం బస్తాలపై కూర్చున్నట్లు ఈ పోస్టరులో కనిపిస్తోంది.

సురేశ్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ADVERTISEMENT

గతంలో నాగచైతన్య నటించిన మనం, ఒక లైలా కోసం, ఆటోనగర్ సూర్య.. అలాగే వెంకటేష్ నటించిన గోపాల గోపాల చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించడం విశేషం.

 

ఈ చిత్రానికి కోన వెంకట్ కథా సహకారం అందిస్తున్నారు. మల్టీస్టారర్ చిత్రాలు చేయడం నాగచైతన్యతో పాటు వెంకటేష్‌కు కూడా కొత్తేమీ కాదు. మనం, తడాఖా లాంటి మల్టీ స్టారర్ చిత్రాలలో గతంలో చైతూ నటిస్తే.. గోపాల గోపాల, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి చిత్రాలలో వెంకటేష్ నటించారు. అందుకే.. వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

24 ఫిబ్రవరి 2019 తేదిన ఈ చిత్ర షూటింగ్ గోదావరి జిల్లాల పరిసర ప్రాంతాల్లో ప్రారంభమైంది. రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన చిత్ర ప్రారంభోత్సవానికి దర్శకుడు వివి వినాయక్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.   

ADVERTISEMENT

 

ఇవి కూడా చదవండి

#JoinRishi అంటూ ‘ఉగాది’ని స్టైలిష్‌గా మార్చేసిన… మహేష్ బాబు ‘మహర్షి’ టీజర్

ప్రేమ ఉన్న చోట.. బాధ కూడా ఉంటుంది (మజిలీ మూవీ రివ్యూ)

ADVERTISEMENT

పుట్టిన రోజు నాడు.. ర‌ష్మిక ఎందుకు అలిగిందో మీకు తెలుసా..?

06 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT