సాధారణంగా అమ్మాయిలు మేకప్ (makeup) వేసుకున్నప్పుడు.. అది సాయంత్రం ఇంటికి తిరిగొచ్చే వరకూ అలాగే ఉండాలని కోరుకోవడం సహజం. అలా కోరుకునేవారు చాలామందే ఉంటారు. బయటి వాతావరణం ప్రభావం వల్ల మాత్రమే కాదు.. చెమట, వర్షపు చినుకులు మన మీద పడడం, చేతులు తగలడం వల్ల కూడా మేకప్ చెదిరిపోతుంది.
స్మడ్జ్ (sumdge) ప్రూఫ్ మేకప్ ఉపయోగించినా సరే.. చాలాసార్లు ఇలాగే జరుగుతుంది. మీరు ముఖ్యమైన పని మీద బయల్దేరి.. చేరాల్సిన చోటుకి చేరుకునే సరికే.. లిప్ స్టిక్ కాస్త పక్కకి చెరిగి.. అలాగే ఐ మేకప్ కిందకు చెదిరి చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే.. కొన్ని చిట్కాలు మీరూ పాటించేయండి.
తక్కువ లేయర్లు..
చాలామంది మేకప్ అంటే.. కనీసం నాలుగైదు లేయర్లు అయినా ఉండాలని భావిస్తారు. ఫౌండేషన్ చాలా హెవీగా ఉండాలనుకుంటారు. కానీ ఇలాంటి హెవీ మేకప్ చర్మ రంధ్రాలను మూసేస్తుంది. తద్వారా ఎక్కువయ్యే చెమట వల్ల మేకప్ చెదిరిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే లైట్ వెయిట్ వాటర్ బేస్డ్ ఫౌండేషన్ ఉపయోగించడంతో పాటు.. కేవలం ఫౌండేషన్, పౌడర్, బ్లష్ మాత్రమే వేసుకోవడం మంచిది.
మరీ ఎక్కువ లేయర్ల క్రీములు, ఫౌండేషన్లు పూయడం సరికాదు. దీనివల్ల మేకప్ చెదిరిపోవడంతో పాటు.. చర్మం కూడా పాడయ్యే అవకాశాలుంటాయి. దీనివల్ల చర్మంపై మొటిమలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వాటర్ ప్రూఫ్ ఐ మేకప్
కేవలం మేకప్ మాత్రమే కాదు.. కంటికి ఉపయోగించే ఐ లైనర్, ఐ షాడో వంటివి కూడా తేలిగ్గా ఉండేలా చూసుకోవాలి. షిమ్మర్, క్రీమ్ ఐ మేకప్ చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి. కానీ అవి వాటర్ ప్రూఫ్‌గా ఉండవు. కాబట్టి మనం కంటిని ముట్టుకుంటే స్మడ్జ్ అయిపోతుంది. కంటి నుంచి నీరు కారితే.. నీటితో పాటు అవి కూడా కారి.. మీ ముఖం ఎబ్బెట్టుగా కనిపిస్తుంది.
అందుకే వాటర్ ప్రూఫ్ ఐ మేకప్ ఎంచుకోవడం మంచిది. కేవలం వర్షాకాలమే కాదు.. ఏ కాలమైనా ఇది మీ మేకప్‌ని చెదిరిపోకుండా ఉండేలా చేస్తుంది. ఐ మేకప్‌ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా.. స్మడ్జ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనంత సింపుల్‌గా ఐ మేకప్ చేసుకోవాలి. డార్క్ రంగులు కాకుండా.. లేత రంగుల్లో ఉన్నవి ఎంచుకుంటే.. స్మడ్జ్ కాకుండా తుడిచేయడానికి వీలుగా ఉంటుంది.
లేత రంగుల లిప్ స్టిక్
ఎరుపు, బెర్రీ, ప్లమ్ రంగుల్లో మెరిసే లిప్ స్టిక్‌లు చూసేందుకు చాలా అందంగా ఉంటాయి. కానీ అవి చెదిరిపోతే మాత్రం.. చూడ్డానికి చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. అందుకే వాటి బదులు.. లేత రంగుల్లో ఉన్న లిప్ స్టిక్ ఎంచుకోవడం వల్ల.. అది చెరిగిపోయినా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అంతేకాదు.. లిప్ స్టిక్ అప్లై చేసే సమయంలో ఒక లేయర్ వేసుకున్న తర్వాత.. కాస్త పౌడర్‌తో టచప్ చేసుకోవాలి. అలాగే ఇంకో లేయర్ వేయడం వల్ల లిప్ స్టిక్ చెరిగిపోకుండా ఉంటుంది. లిప్ స్టిక్ వేసుకున్న తర్వాత.. ఒకసారి టిష్యూ పేపర్‌తో అద్దుకోవడం వల్ల కూడా లిప్ స్టిక్ చెదిరిపోకుండా చూసుకోవచ్చు.
మిస్ట్ వాడండి
మ్యాటీ ఎఫెక్ట్ కోసం మేకప్ వేసుకోవడానికి ముందు ఫేషియల్ మిస్ట్‌ని స్ప్రే చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మేకప్ చెదిరిపోకుండా ఉంటుంది. ఈ మిస్ట్‌ని గ్రీన్ టీ, ఫ్రూట్ వాటర్, విటమిన్ సి వంటి వాటితో తయారుచేయవచ్చు. ముందుగా దీన్ని ముఖంపై స్ప్రే చేసుకొని.. టిష్యూతో తుడుచుకోవాలి. ఆ తర్వాత ఫౌండేషన్ వేసుకొని మేకప్ వేయడం ప్రారంభించాలి.
పౌడర్‌తో టచప్
మేకప్ లేదా మస్కారా స్మడ్జ్ అవుతుంటే దాన్ని కాటన్‌తో తుడిచేసి.. ఆ ప్రదేశంలో పౌడర్‌తో టచప్ చేయాలి. ఇలా చేయడం వల్ల.. మేకప్ తిరిగి మరోసారి స్మడ్జ్ కాకుండా కాపాడుకోవచ్చు. పౌడర్ స్మడ్జ్ కావడాన్ని నివారిస్తుంది. కాబట్టి మీకు స్మడ్జ్ అవుతోందని అనుమానం వస్తే.. వెంటనే అక్కడ కాస్త ట్రాన్స్ లుసెంట్ పౌడర్‌ని అద్దడం మంచిది.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.