ఆడవారు అందంగా, ఆత్మవిశ్వాసంతో కనిపించడంలో లో దుస్తులు (lingerie) చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అంటే అది అతిశయోక్తి కాదు. అందమైన దుస్తులు ధరించినప్పుడు ఆనందంగా ఫీలవ్వడం మాత్రమే కాదు.. ఆకర్షణీయమైన, చక్కటి ఫిట్‌తో ఉన్న లో దుస్తులు ధరిస్తే.. ఆరోజు మనలో ఉండే ఉత్సాహం వేరుగా ఉంటుందని చాలామంది ఆడవారు ఫీలవుతుంటారు. అందుకే లో దుస్తులు షాపింగ్ చేయడానికి మామూలు షాపింగ్ లో భాగంగా ఓ గంటో అర గంటలో కేటాయించడం మాత్రమే సరిపోదు. వీటి ఎంపిక కోసం ఎంతో సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అప్పుడే అందమైన.. చక్కటి ఫిటింగ్ ఉన్న లో దుస్తులు లభిస్తాయి. ఆ తర్వాత కొన్ని నెలల పాటు మీరు అద్భుతంగా కనిపించే వీలుంటుంది. ఇలా మీరూ లో దుస్తుల షాపింగ్ కోసం ఓ రోజును కేటాయించుకొని షాపింగ్ కి వెళ్తే అందరు ఆడవాళ్లలా మీరూ ఇలా ఫీలవుతారేమో ఓసారి చెక్ చేసుకోండి.
1. నాకు మంచి బ్రా లు లేనట్లుగా అనిపిస్తోంది. ఈరోజు పనులన్నీ క్యాన్సిల్ చేసేశా.. పనులు వాయిదా వేసేశాను. కాబట్టి ఈరోజు పూర్తిగా ఈ షాపింగ్ కే కేటాయించేస్తా.. సాయంత్రం లోపు చక్కటి లో దుస్తులు కొనుక్కుంటే అదే చాలు..
2. నాకు సరిపడే సైజ్ ఎంచుకోవాలంటే ఎందుకో తెలీదు.. నేను ఎప్పుడూ ఎందుకు ఇన్నిసార్లు ఆలోచిస్తాను? నాకు గుర్తుంన్నంతవరకూ చాలా రోజుల నుంచే నేను బ్రా లు ధరిస్తున్నా. మరి, ఇంకా ఎందుకీ గందరగోళం. ఎప్పుడూ ఏ సైజ్ కొంటున్నా ఇద ినాకు సరిపోతుందా? లేక లూజ్ అవుతుందా? లేక టైట్ అవుతుందా? అని ఆలోచనలు వెంటాడతాయి.
3. కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుందాం.. అయ్యో.. ఏంటి? ఇన్ని కొత్త రకాల బ్రా లు కనిపిస్తున్నాయి. నేను గతంలో షాపింగ్ చేసినప్పుడు ఈ తరహావి కనిపించలేదే.. ఇవి ఈ మధ్యే కొత్తగా వచ్చాయనుకుంటా.. ఏంటీ.. నేను షాపింగ్ చేసి మరీ అన్ని రోజులైపోయిందా?
4. మరి, ఇప్పుడు నేను మామూలువే కొనాలా? లేక కాస్త కొత్తగా తీసుకోవాలా? ఈసారి కాస్త కొత్తగా ప్రయత్నిస్తే బాగుంటుందనిపిస్తోంది. నాకు లేసీ ఇన్నర్ వేర్ లేనే లేవు. అలాగే రంగుల ఇన్నర్ వేర్ కూడా లేవు. వాటిల్లో నాకు నచ్చినవి తీసుకుంటాను.
5. అలాగే నాకు ఆఫీస్‌కి వెళ్లడానికి వీలుగా న్యూడ్, నలుపు రంగుల బ్రా లు కూడా కావాల్సిందే. వాటిని కూడా తీసుకుంటా. అండర్ వేర్ కూడా వాటికి మ్యాచింగ్ ఉంటే బాగుంటుంది కదా.. తీసుకుంటాను.
6. అబ్బా.. ఈ లేస్ గౌన్ ఎంత బాగుందో.. చాలా అందంగా ఉంది. దీన్ని కొనుక్కుంటాను. అయినా నేను దీన్ని వేసుకుంటే ఎవరు చూస్తారు? రాత్రి వేళల్లో నేను ఈ లేసీ గౌన్ ఎవరి కోసం వేసుకుంటాను? దీన్ని తీసుకోవడం కూడా వృథా.
7. అయినా.. దీన్ని తీసుకుంటే తప్పేముంది? ఎవరైనా చూసేవాళ్లు ఉంటేనే దీన్ని తీసుకోవాలా? ఎవరి కోసమో అందంగా రడీ అవ్వాలి కానీ నాకోసం నేను సిద్ధమవ్వకూడదా? ఇది వేసుకొని నాకు నేనే అద్దంలో చూసుకొని ఈ లేసీ గౌన్‌లో ఎంత అందంగా ఉన్నానా అనుకుంటాను. దీంతో పాటు ఒక చక్కటి అండర్‌వేర్ కూడా తీసుకుంటా..
8. అబ్బా.. ఇదెంత బాగుందో.. ఇలాంటివి నేను చిన్నప్పుడు వేసుకునేదాన్ని. అదేంటి? నేను అమ్మమ్మలా మాట్లాడుతున్నా. ఇప్పుడు నాకు ఏమంత వయసైపోయిందని.. ఏదో వయసులో ఉండగా వేసుకున్నా ఇఫ్పుడు వేసుకోవట్లేదు అనుకుంటున్నా. ఎందుకు వేసుకోకూడదు.. ఈ సెట్‌ని నేను ఇప్పుడే తీసుకుంటున్నా.
9. అయ్యో.. అసలు దీన్ని జనాలు ఎందుకు వేసుకుంటారు.. ఇది ఏం కవర్ చేస్తోందని..? ఇలాంటివి డిజైన్ చేసేవాళ్లైనా కాస్త కవర్ చేసేలా తయారుచేస్తే బాగుండేది. ఇలాంటివి అసలు ఎవరైనా కొంటారా? ఏమోలే.. నాకెందుకు..
10. అబ్బా.. దీంతో ఇక నా షాపింగ్ పూర్తయిపోయింది. నాకు కావాల్సినవన్నీ తీసేసుకున్నా. ఈరోజు చాలా చక్కగా గడిపిన ఫీలింగ్ కలుగుతోంది. మరో ఆరు నెలల పాటు మళ్లీ షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు.
మన లో దుస్తులు మనలోని నిజాన్ని బయటపెడతాయి. వాటికంటే మన గురించి ఇంకెవరికీ ఎక్కువగా తెలీదు. కాబట్టి లో దుస్తుల షాపింగ్ సమయం తీసుకొని చేయడం మంచిది. దీంతో పాటు ప్రతి ఆరు నెలలకోసారి లో దుస్తులను మార్చడం మంచిది.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.