మన జీవితంలో జరిగే ముఖ్యమైన ఘట్టాలను అందమైన జ్ఞాపకాలుగా మలిచేవే ఫొటోలు. ఈ ఫొటోలు ప్రతిఒక్కరికీ ముఖ్యమైనవే. అందులోనూ ఫ్యాషన్ రంగంలో ఉన్నవారికి మాత్రం ఇవి మరింత ప్రధానమైనవి. నిజానికి ఫ్యాషన్(Fashion), ఫొటోగ్రఫీ(photography) రెండూ ఒకదానితో కలసి మరొకటి నడుస్తాయి. మోడల్స్, ఆర్టిస్టులు, డిజైనర్స్ ఇలా ఫ్యాషన్ రంగంతో సంబంధం ఉన్నవారంతా ఫొటోగ్రఫీకి చాలా ప్రాధాన్యమిస్తుంటారు. పేరు మోసిన హీరోహీరోయిన్లు సైతం అప్పుడప్పడూ ఫ్యాషన్ ఫొటోషూట్స్‌లో పాల్గొంటూ ఉంటారు.
ఫ్యాషన్ రంగంలో పెరుగుతున్న అవకాశాలు, ఆసక్తి దృష్ట్యా ఇటీవలి కాలంలో ఈ రంగంలో అడుగుపెట్టేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ రంగంలో అడుగు పెట్టాలంటే పోర్ట్ ఫోలియో చాలా అవసరం. అది ఎంత అందంగా ఉంటే.. ఈ రంగంలో అంత మంచి అవకాశాలు వస్తాయి.
మీ ఫ్యాషన్ ఫోర్ట్ ఫోలియో అందంగా ఉండాలంటే.. దానికి తగిన ఫొటోగ్రాఫర్ కూడా దొరకాలిగా.. అలాంటి వారిని వెతికి పట్టుకోవడం కాస్త కష్టమే. అందులోనూ హైదరాబాద్ లాంటి మహానగరంలో మరింత కష్టం. మరేం ఫర్లేదు. మీ కోసమే నగరంలోని ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్లందరినీ జల్లెడ పట్టి టాప్ 5 ఫొటోగ్రాఫర్ల జాబితా సిద్ధం చేశాం.
ది లుక్స్ ఫ్యాషన్ ఫొటోగ్రఫీ అండ్ మోడలింగ్ ఏజెన్సీ
బిగ్ బాస్ 2 సీజన్ విజేత కౌశల్ మండ ఈ ఫ్యాషన్ ఫోటోగ్రఫీ, మోడలింగ్ ఏజెన్సీని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఫ్యాషన్ ఫొటోగ్రఫీ, మోడలింగ్ రంగంలో ది లుక్స్ టాప్ అని చెప్పుకోవచ్చు. ఫ్యాషన్ రంగంలో స్థిరపడాలనుకొనేవారిలో చాలామంది.. ది లుక్స్‌లో ఫొటోషూట్ చేయించుకోవాలని తపన పడుతుంటారు.
ఇది తమ కెరీర్‌కు కిక్ స్టార్టర్ అని భావిస్తారు. ఫొటోగ్రఫీతో పాటు మోడలింగ్ ఏజెన్సీని కూడా నిర్వహిస్తుండంటంతో మోడల్‌గా పనిచేయడానికి అవకాశం కూడా దొరకవచ్చు. పైగా దీనికి అనుబంధంగా మోడలింగ్ స్కూల్ కూడా ఉండటంతో అప్ కమింగ్ మోడల్స్ ది లుక్స్‌ను తమ కెరీర్‌కు మొదటి అడుగుగా భావిస్తుంటారు.
చిరునామా: 303, వంశీ మిలీనియం రెసిడెన్సీ, యూసఫ్ గూడ చెక్ పోస్ట్, హైదరాబాద్.
రాకేశ్ కుర్రా ఫొటోగ్రఫీ అండ్ మోడలింగ్ ఏజెన్సీ
హైదరాబాద్‌లో ఫ్యాషన్ ఫొటోగ్రఫీ రంగంలో తనదైన ముద్ర వేసిన ఫొటోగ్రాఫర్ రాకేశ్ కుర్రా. ఆయన క్రియేటివ్ బి పేరుతో ఫొటోస్టూడియో నడుపుతున్నారు. ఫ్యాషన్ ఫొటోగ్రఫీలో రాకేశ్ పనితనం తెలుసుకోవాలంటే.. ఆయన తీసిన ఫొటోలు చూడాల్సిందే. ఫొటోగ్రఫీతో పాటు మోడలింగ్ ఏజెన్సీని కూడా రాకేశ్ కుర్రా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీ పోర్ట్ ఫోలియో తయారుచేసుకుంటే.. మోడలింగ్ చేసే ఛాన్స్ రావడానికి అవకాశం ఉంటుంది.
చిరునామా : క్రియేటివ్ బి ఫోటొగ్రఫీ, రోడ్ నెం 10, బంజారాహిల్స్, హైదరాబాద్.
రమణ ప్రసాద్ ఫ్యాషన్ అండ్ అడ్వర్టయిజింగ్
టాలీవుడ్‌లో రమణ ప్రసాద్ ఫొటోగ్రఫీకి మంచి పేరుంది. వెడ్డింగ్ ఫొటోగ్రఫీ అంటే ఇష్టపడే రమణ ప్రసాద్.. ఫ్యాషన్ ఫొటోగ్రఫీలోనూ తాను దిట్ట అని నిరూపించుకున్నారు. ఫొటోగ్రఫీకి తోడుగా అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ కూడా నిర్వహిస్తుండటంతో ఇక్కడ మీ పోర్ట్ ఫోలియో తయారుచేసుకుంటే మోడలింగ్‌లోనూ మీకు అవకాశాలు దక్కవచ్చు.
చిరునామా: జీ1, ప్లాట్ నెం – 88, నవనిర్మాణ్ నగర్, రోడ్ నెం 71, జూబ్లీహిల్స్ హైదరాబాద్.
ఫోట్రియా ఫొటోగ్రఫీ
ఫ్యాషన్ ఫొటోగ్రఫీలో ఫోట్రియా వెంకీ చాలా ఫేమస్. ఫొటోగ్రఫీ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకొనేవారికి ఫోట్రియా వెంకీ ప్రత్యేకంగా వర్క్‌షాప్స్ నిర్వహిస్తుంటారు. వెంకీ రూపొందించిన ఫ్యాషన్ ఫోర్ట్ ఫోలియోలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. వెడ్డింగ్ ఫొటోగ్రఫీ, ఫ్రీ వెడ్డింగ్ షూట్స్ చేయడంలోనూ ఫోట్రియాకు హైదరాబాద్‌లో మంచి పేరుంది.
చిరునామా: హౌస్ నెం -1/62/1, ప్లాట్ నెం. 115, సెకెండ్ ఫ్లోర్, కె స్క్వేర్, నియర్ బాంటియా ఫర్నీచర్, మాదాపూర్ రోడ్, కావూరిహిల్స్, జూబ్లీహిల్స్, హైదరాబాద్.
ఆర్య ఫొటోగ్రఫీ స్టూడియో
వెడ్డింగ్ ఫొటోగ్రఫీతో పాటు ఫ్యాషన్ ఫొటోగ్రఫీలో కూడా ఆర్య స్టూడియో తనదైన ముద్ర వేస్తోంది. మీ పోర్ట్ ఫోలియో చాలా క్రియేటివ్‌గా ఉండాలనుకుంటే ఆర్య ఫొటోగ్రఫీ స్టూడియో సరైన ఎంపిక.
చిరునామా: 1-10-38/1/1, ఎయిర్ పోర్ట్ ఫ్లైఓవర్, బేగంపేట.
Feature Image: Shutterstock
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.