కొంతమంది ఫ్యాషన్ మీద ఉన్న విపరీతమైన పిచ్చితో రకరకాల వస్తువులు, బట్టలు కొని బీరువాలో సర్దేస్తారు. తర్వాత మళ్లీ ఓసీడీ సమస్యతో బాధపడతారు. కానీ ఇక్కడ కూడా కాస్త ఖర్చు తగ్గించుకోవచ్చు. పదే పదే కొత్త డ్రెస్సులు కొనే బదులు.. ఉన్నవాటితోనే అందమైన వార్డ్ రోబ్ తయారుచేసుకోవచ్చు.
కొంతమంది మహిళలు తమకిష్టమైన శారీస్, అనార్కలి డ్రెస్సులు, చుడీదార్స్ పదే పదే కొంటుంటారు.
పైగా వాటిని రెగ్యులర్‌గా వాడతారా అంటే.. అది కూడా డౌటే. అవి పాతబడకుండానే.. మళ్లీ కొత్తవి కొనేస్తారు. తర్వాత డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టామని బాధపడుతుంటారు. అలాంటి వారు కూడా ఖర్చు లేకుండా అందమైన వార్డ్ రోబ్ తయారుచేసుకోవచ్చు.
అందమైన వార్డ్ రోబ్ తయారుచేసుకోవడానికి ఆసక్తికరమైన చిట్కాలివే.
1.ప్రతీ నెలా వార్డ్ రోబ్‌లో మార్పులు చేయాల్సిందే
ప్రతీ నెల మీరు వార్డ్ రోబ్‌ని సర్దుకొనే విధానంలో మార్పులు చేస్తే.. చాలా ఫలితాలుంటాయి. ఎప్పుడూ పాత దుస్తులనే చూస్తున్నారనే భావన మీకు కలగదు. బట్టలు రీ ఎరేంజ్ చేసేటప్పుడు మీకు నచ్చినవాటిని తొలి వరుసలో పెట్టి.. మీకు పెద్దగా నచ్చని వాటిని వెనుక వరుసలో పెట్టండి. అలాగే మీరు కొని కూడా వాడని దుస్తులను మొదటి వరుసలో పెట్టి.. ఎక్కువగా వాడిన వాటిని వెనుక వరుసలో పెట్టండి. ఇలా చేయడం వల్ల ఎప్పుడూ ఒకే వార్డ్ రోబ్‌ని చూస్తున్న ఫీలింగ్ మీకు కలగదు.
2. మీ వార్డ్ రోబ్‌లో వారి వస్త్రాలకూ చోటు కల్పించండి
మీ వార్డ్ రోబ్‌కు మంచి లుక్ రావాలంటే.. నెలకు ఒకసారి మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు కొని వాడని మంచి దుస్తులు ఏవైనా ఉంటే.. వాటిని అడిగి తీసుకోండి. వాటికి కూడా మీ వార్డ్ రోబ్‌లో
చోటు కల్పించండి. వీలైతే… అలా అడిగి తీసుకున్న దుస్తులను మీరే మళ్లీ రీ డిజైన్ చేసి కొత్త ఫ్యాషన్ లుక్ ఇవ్వండి. ఇలా చేయడం వల్ల ఖర్చు కూడా కలిసొస్తుంది.
3. మీ క్లోజెట్ మందు నిలబడి రివ్యూ చేసుకోండి
మీరు వార్డ్ రోబ్ సర్దడం ఒక ఎత్తైతే.. కలర్ కాంబినేషన్ ఆధారంగా అందులో డివిజన్స్ ఏర్పాటు చేయడం మరో ఎత్తు. అందుకే ఒకసారి మీ క్లోజెట్ మొత్తాన్ని తేరిపారా చూడండి. ఏ శారీకి ఏ బ్లౌజ్ మ్యాచ్ అవుందో.. ఏ మిడ్డీకి ఏ రంగు స్కర్ట్ మ్యాచ్ అవుతుందో ఒకసారి పరిశీలించండి. వాటికనుగుణంగా క్లోజెట్‌లో మార్పులు చేస్తే.. దాని లుక్ అదిరిపోతుంది.
4.వస్తువులకు, ఆభరణాలకు వార్డ్ రోబ్‌లో చోటు కల్పించండి
మీ వార్డ్ రోబ్‌లో దుస్తులతో పాటు ఫ్యాషన్ ఐటమ్స్, నగలు, ఆభరణాలు, జుమ్కీలు మొదలైన వాటికి చోటు కల్పించండి. మీరు దుస్తులను సెలెక్ట్ చేసుకొనేటప్పుడు అందుకు మ్యాచ్ అయ్యే వస్తువులను కూడా కచ్చితంగా ఎంపిక చేసుకోండి. ఇలా చేయడం వల్ల పదే పదే పాత దుస్తులనే ధరిస్తున్నారనే ఫీలింగ్ మీకు రాదు. వార్డ్ రోబ్‌కు కూడా కొత్త లుక్ వస్తుంది.
5.మీ దుస్తులను అద్దెకివ్వచ్చు కూడా..!
మీకు బట్టల మీద ఉన్న విపరీతమైన ప్రేమతో.. లెక్కలేనన్ని ఎక్కువ దుస్తులు కొనేశారా..? ఇప్పుడు వాటిని ఏం చేయాలా? అన్న విషయంలో హైరానా పడుతున్నారా..? అయితే అసలేం బెంగపడవద్దు. మీ వార్డ్ రోబ్‌ను రెంట్ హౌస్‌గా మార్చండి. మీ వద్ద ఉన్న వివిధ మోడల్స్‌ను ఫోటోలు తీసి ఆన్‌లైన్‌లో
పెట్టండి. వాటిని అద్దెకిస్తున్నట్లు ప్రకటించండి. ఇంకేముంది.. మీరు ఆన్ లైన్ ఎంట్రప్రెన్యూర్‌గా కొత్త
అవతారం ఎత్తేసినట్లే..?
6. మీరే ఫ్యాషన్ డిజైనర్ అవతారం ఎత్తేయండి..?
మీ వార్డ్ రోబ్ కొత్తగా కనిపించాలంటే మీరు మరో పని కూడా చేయవచ్చు. మీరే పాత బట్టలను మళ్లీ కొత్తగా రీ డిజైన్ చేయండి. వాటిని మీకు నచ్చినట్లు ఆల్టరేషన్ చేసి మీరే కొత్త డిజైన్స్ తయారుచేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఖర్చు కూడా కలిసొస్తుంది. అదేవిధంగా.. మీలో క్రియేటివిటీ కూడా డెవలప్ అవుతుంది.
7.ఒకే డ్రెస్‌ను ఎన్ని రకాలుగా వాడచ్చో కూడా ఆలోచించండి.
మీ వార్డ్ రోబ్‌తో పాటు మీకు కూడా కొత్త లుక్ రావాలని మీరు కోరుకుంటే.. ఒకే డ్రెస్‌ను వివిధ స్టైల్స్‌లో
వాడడానికి ప్రయత్నించండి.
ఉదాహరణకు, పాత బటన్ అప్ షర్ట్‌ని మీరు కొత్త పద్దతిలో కూడా ధరించవచ్చు.
*దీనిని షర్ట్‌లా మాత్రమే కాకుండా జాకెట్ మాదిరిగా లేదా కిమోనోగా కూడా వాడవచ్చు.
*మీ వింటర్ అవుట్ ఫిట్‌లో ఒక లేయర్ మాదిరిగా కూడా వాడవచ్చు.
*స్ట్రాప్ లెస్ డ్రెస్‌కి మ్యాచింగ్‌గా కూడా వాడవచ్చు.
*టీ జీన్స్ స్టైల్‌లో షర్ట్ ధరించి.. నడుము దగ్గర ఇన్ సర్ట్ చేయవచ్చు.
ఈ చిట్కాలు అన్నీ సూపర్ కదా..!