ADVERTISEMENT
home / వినోదం
2018లో టాలీవుడ్ టాప్ 20.. సూపర్ హిట్ సాంగ్స్ ఇవే – Best Telugu Songs From (Tollywood) Movies

2018లో టాలీవుడ్ టాప్ 20.. సూపర్ హిట్ సాంగ్స్ ఇవే – Best Telugu Songs From (Tollywood) Movies

పాటలకి సంబంధించిన ఒక మాట సామాన్యజన వాడుకలో ఉంది. అదేంటంటే – మనం సంతోషంగా ఉన్నప్పుడు పాటని ఆస్వాదిస్తాం. అయితే మనం బాధలో ఉన్నప్పుడు మాత్రం.. అదే పాటలో ఉన్న సాహిత్యాన్ని వింటాం. ఏదేమైనా.. మన మనసుకు కాస్త సాంత్వన కలిగించేది పాట మాత్రమే అన్న విషయంలో ఎంతో సత్యం దాగుంది. మనలో ఉన్న 90 శాతం మందికి పాటలంటే ఇష్టమే అనడంలో సందేహం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో జనాలు సినిమా పాటలకు ఎప్పుడో పట్టం కట్టారు. ప్రతీ సంవత్సరం కొన్ని వందల పాటలను గేయ రచయితలు మన సినీ పరిశ్రమకు అందిస్తున్నారు. ఈ క్రమంలో మనం కూడా 2018 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలలో (Telugu Cinema) ప్రేక్షకుల మనసులను దోచుకున్న టాప్ 20 పాటలు (Top 20 Telugu Songs) గురించి తెలుసుకుందాం

సినిమాల నుండి ఉత్తమ తెలుగు పాటలు – Best Telugu Songs From Telugu Movies

ఈ టాలీవుడ్ టాప్ 20 పాటల వరుస క్రమాన్ని కూడా.. ఆయా చిత్రాలు విడుదలైన సమయాన్ని బట్టి అందించడం జరిగింది..తప్పితే వీటికి మేము ఎటువంటి ర్యాంకింగ్ ఇవ్వలేదని గమనించగలరు.

అజ్ఞాతవాసి (Agnyathavaasi) చిత్రం నుండి “బైటికొచ్చి చూస్తే” (Baitikochi Chusthe) పాట .

ఈ పాటని రాసింది శ్రీమణి (Srimani) కాగా.. స్వరాలతో పాటు తన గాత్రాన్ని అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravi chander) ఇచ్చాడు.

ADVERTISEMENT

Bayatiki-vachi-chuste-song

ఛలో (Chalo) చిత్రం నుండి “చూసి చూడంగానే నచ్చేసావే (Choosi Choodangane Nachesave)

ఈ పాటకు సాహిత్యాన్ని భాస్కరభట్ల (Bhaskarabatla) అందివ్వగా.. మహతి స్వరసాగర్ (Mahati Swarasagar) స్వరాలూ కూర్చడం జరిగింది. అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni) & సాగర్ (Sagar) తమ గాత్రాన్ని అందివ్వడం జరిగింది.

ninnu-chusi-chudangane

తొలిప్రేమ (Tholiprema) చిత్రం నుండి “నిన్నిలా నిన్నిలా చూసానే (Ninnila Ninnila Chusane)

ఈ పాటకి యువ రచయిత శ్రీమణి లిరిక్స్ ఇవ్వగా.. తమన్ స్వరాలు అందించాడు. అర్మాన్ మాలిక్ (Armaan Malik) & తమన్ (Thaman)లు ఈ పాటని పాడడం జరిగింది.

ADVERTISEMENT

tholi-prema-song

కిరాక్ పార్టీ (Kirrak party) చిత్రం నుండి “గురువారం సాయంత్రం”

రాకేందు మౌళి (Rakendumouli) ఈ పాటకి లిరిక్స్ ఇవ్వగా.. విజయ్ ప్రకాష్ (Vijay Prakash) ఈ పాటని ఆలపించారు. అజనీష్ లోకనాథ్ (Ajaneesh Lokanath) ఈ పాటకి సంగీతం అందించారు.

kirakparty1

రంగస్థలం (Rangasthalam) నుండి “ఎంత సక్కగున్నావే… (Yentha Sakkagunnave)”

దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) ఈ పాటకి స్వరాలు & గాత్రాన్ని ఇవ్వగా చంద్రబోస్ (Chandrabose) అద్భుతమైన సాహిత్యాన్ని  అందించారు.

ADVERTISEMENT

rangastalam-song

రంగస్థలం నుండి “ఆ గట్టునుంటావా (Aa Gattununtaava)”

చంద్రబోస్ ఈ పాటని రాయగా శివ నాగులు (Shiva Nagulu) ఈ పాటని పాడారు. దేవిశ్రీప్రసాద్ ఈ పాటకి స్వరాలని సమకూర్చారు.

 aa-gattununtava

కృష్ణార్జున యుద్ధం (Krishnarjuna Yuddham) నుండి “దారి చూడు దుమ్ము చూడు (Dari Chudu Dhummu Chudu)”

పెంచల్ దాస్ (Penchal Das) ఈ పాటకి సాహిత్యమవ్వడమే కాకుండా.. పాటని కూడా పాడారు. హిప్ హాప్  తమిజా (HipHop Tamizha) ఈ పాటకి స్వరాలు అందివ్వడం జరిగింది.

ADVERTISEMENT

కృష్ణార్జున యుద్ధం నుండి “ఐ  వన్నా ఫ్లై (I Wanna Fly)”

ఈ పాటకి శ్రీజో లిరిక్స్ అందివ్వగా రేవంత్ (Revanth) & సంజిత్ హెగ్డే (Sanjith Hegde) గాత్రాన్ని అందించారు. హిప్ హప్ తమిజా స్వరాలని  సమకూర్చారు.

krisharjuna-yuddam

భరత్ అనే నేను (Bharath Ane Nenu) చిత్రం నుండి “వచ్చాడయ్యో సామి (Vachadayyo Saami)”

రామజోగయ్య శాస్త్రి ఈ పాటని రాయగా  దేవిశ్రీప్రసాద్ స్వరాలు అందివ్వడం జరిగింది. ఇక ఈ పాటకి గాత్రదానం చేసింది కైలాష్ ఖేర్ (Kailash Kher)& దివ్య కుమార్ (Divya Kumar).

bharat-ane-nenu

ADVERTISEMENT

మహానటి (Mahanati) చిత్రం నుండి “సదా నన్ను (Sada Nannu)”

సిరివెన్నెల సీతారామ శాస్త్రి (Sirivennela Seetarama Sastry) సాహిత్యం అందివ్వగా మిక్కీ జె మేయర్ (Mickey J Meyer)స్వరాలు అందించారు. చారులత మణి (Charulatha Mani) తన గాత్రాన్ని అందివ్వడం జరిగింది.

Mahanati-song

ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Yemaindi) నుండి “ఆగి ఆగి… (Aagi Aagi)”

కృష్ణకాంత్ లిరిక్స్ అందివ్వగా  వివేక్ సాగర్ స్వరాలూ సమకూర్చారు. అనురాగ్ కులకర్ణి & మనీషా తమ గాత్రాన్ని అందించారు.

Ee-nagaraniki-emaindi

ADVERTISEMENT

RX 100 నుండి “పిల్లా రా (Pilla Ra)”

చైతన్య ప్రసాద్ (Chaitanya Prasad) ఈ పాటకి సాహిత్యం ఇవ్వగా.. చైతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj) సంగీతం అందించాడు. అనురాగ్ కులకర్ణి గాత్రదానం చేశాడు.

rx-100

చి.ల.సౌ (Chi La Sow) నుండి “మెల్లగా మెల్లగా (Mellaga Mellaga)”

శ్రీ సాయి కిరణ్ (Sri Sai Kiran) ఈ పాటకి  లిరిక్స్ అందివ్వగా చిన్మయి  శ్రీపాద (Chinmayi Sripada) తన గాత్రాన్ని అందించారు. ప్రశాంత్ విహారి (Prashanth Vihari) ఈ పాటకి స్వరాలూ కూర్చడం జరిగింది.

chila-sow

ADVERTISEMENT

శ్రీనివాస కళ్యాణం (Srinivasa Kalyanam) నుండి “కళ్యాణం వైభోగం (Kalyanam Vaibhogam)”

శ్రీమణి  ఈ పాటకి సాహిత్యం అందివ్వగా SP బాలసుబ్రహ్మణ్యం (SP Balasubramanyam) తన గాత్రాన్ని  అందించారు. మిక్కీ జె మేయర్ ఈ పాటకి స్వరాలని  అందించారు.   

srinivasa-kalyanam

గీత గోవిందం (Geetha Govindam) నుండి “ఇంకేం ఇంకేం కావాలె (Inkem Inkem Kavale)”

ఈ పాటని అనంత శ్రీరామ్ (Anantha Sriram) రాయగా సిడ్ శ్రీరామ్ ఆలపించారు. గోపి సుందర్ (Gopi Sunder) ఈ పాటకి స్వరాలు సమకూర్చారు.

geeta-govindam

ADVERTISEMENT

దేవదాస్ (Devadas) చిత్రం నుండి “వారు వీరు (Vaaru Veeru)”

సిరివెన్నెల సీతారామ శాస్త్రి (Sirivennela Seetarama Sastry) ఈ పాటకి సాహిత్యం ఇవ్వగా మణిశర్మ (Manisharma) స్వరాలు సమకూర్చారు. అనురాగ్ కులకర్ణి & అంజన సౌమ్య ఈ పాటకి  గాత్రదానం చేశారు.

nagarjuna-devadas

అరవింద సమేత వీర రాఘవ (Aravindha Sametha Veera Raghava) నుండి “పెనివిటి (Peniviti)”

ఈ హృద్యమైన పాటని రామజోగయ్య శాస్త్రి రాయగా కాలభైరవ (kalabhairava) పాడారు. తమన్ ఈ పాటకి సంగీతం ఇవ్వడం జరిగింది.

 peniviti1-1

ADVERTISEMENT

ట్యాక్సీవాలా (Taxiwaala) నుండి “మాటే వినదుగా (Maate Vinadhuga)”

ఈ పాటకి కృష్ణకాంత్ (Krishnakanth) సాహిత్యాన్ని  అందివ్వగా జెక్స్ బిజోయ్ (Jakes Bejoy) స్వరాలూ సమకూర్చారు. సిడ్ శ్రీరామ్ (Sid Sriram) ఈ పాట పాడడం జరిగింది.

taaxiwala1

అంతరిక్షం (Antariksham) నుండి “సమయమా (Samayama)”

అనంత శ్రీరామ్ ఈ పాటని రాయగా హరిణి (Harini) & యాజిన్ నిజార్ (Yazin Nizar) ఆలపించారు. ప్రశాంత్ విహారి (Prashanth Vihari) ఈ పాటకి స్వరాలూ సమకూర్చడం జరిగింది.

antariksham-song

ADVERTISEMENT

పడి పడి లేచే మనసు (Padi Padi Leche Manasu) చిత్రం నుండి “పడి లేచే మనసు”

ఈ పాటని కృష్ణకాంత్ రాయగా అర్మాన్ మాలిక్ & సింధూరి విశాల్ (Sindhuri Vishal) లు ఆలపించారు. విశాల్ చంద్రశేఖర్ (vishal CHandrasekhar) ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.    

padi-padi-leche-song

ఈ పైన పేర్కొన్న 20 పాటలు 2018లో మనల్ని అలరించగా వచ్చే సంవత్సరంలో మరిన్ని పాటలు మనల్ని అలరింపచేయాలి అని కోరుకుందాం

ఇవి కూడా చదవండి

ADVERTISEMENT

2018 తెలుగు చిత్రాల్లో.. టాప్ 9 హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

2018లో టాలీవుడ్‌ ఇండస్ట్రీని షేక్ చేసిన.. టాప్ 6 మూవీస్ ఇవే..!

టాలీవుడ్‌‌లో సత్తా చాటిన.. బాలీవుడ్ ముద్దుగుమ్మలు వీరే.. !

26 Dec 2018

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT