ADVERTISEMENT
home / Life
పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఉండే.. ప్రత్యేకత ఏమిటంటే..?

పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఉండే.. ప్రత్యేకత ఏమిటంటే..?

పెద్దలు కుదిర్చిన పెళ్లి (arranged marriage) పట్ల కొందరిలో కాస్త వ్యతిరేకత ఉంటుంది. తమ జీవితంలో అతి ముఖ్య ఘట్టమైన వివాహం విషయంలో తమ ప్రమేయం లేకుండా.. తల్లిదండ్రుల ఇష్టానికి అనుగుణంగా నడుచుకోవడం చాలామందికి ఇష్టం ఉండదు. అయితే ఇక్కడ అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది.

పెద్దలు కుదిర్చిన వివాహమైనా.. ప్రేమ పెళ్లయినా.. ఆలుమగలు మధ్య ఉన్న సఖ్యత, అర్థం చేసుకొనే తత్వం, వారిద్దరి మధ్య ఉన్న అనురాగమే.. ఆ బంధాన్ని పదికాలాల పాటు పదిలంగా ఉండేలా చేస్తాయి. అంటే మన జీవితభాగస్వామిని ఎలా ఎంచుకొన్నామని కాదు.. వారితో మన బంధం ఎంత దృఢంగా ఉందనేదే ముఖ్యమని గుర్తించాలి. అంతకంటే ముందు పెద్దలు కుదిర్చిన పెళ్లి ఎందుకు ప్రత్యేకమో తెలుసుకోవాలి.

ఈ కథనంలో పెద్దలు కుదిర్చిన పెళ్లి ఎందుకు ప్రత్యేకమో తెలుసుకోబోతున్నాం. బలవంతంగా చేసే పెళ్లి గురించి కాదు. మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా చేసే పెళ్లి బలవంతపు పెళ్లి. దీనిలో వధూవరుల ఇష్టాలతో ప్రమేయం లేకుండా వివాహ తంతు అయిందనిపిస్తారు.

కానీ పెద్దలు కుదిర్చిన పెళ్లిలో అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చి.. వారిద్దరూ అంగీకరిస్తేనే పెళ్లి జరుగుతుంది. అంటే పెళ్లి నిర్ణయం మీ చేతుల్లోనే ఉంటుంది. అందుకే పెళ్లి చూపుల దగ్గరి నుంచి పెళ్లి వరకు మీరేం చేయాలి? పెళ్లి చూపుల సమయంలో అబ్బాయిని ఎలాంటి ప్రశ్నలడగాలి? ఇలా ఎన్నో విషయాల గురించి మీకు తెలియజేయడంతో పాటు.. పెద్దలు కుదిర్చిన వివాహాలపై మీ ఆలోచనలను మార్చేసే కొన్ని అంశాలను మీ ముందుంచుతున్నాం.

ADVERTISEMENT

పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడం ఎందుకు మంచిది?

మీ ఇష్టాయిష్టాలకు విలువనిస్తూనే.. మీకు సరైన జోడీని ఎంపిక చేసేందుకు తల్లిదండ్రులు చాలా కష్టపడతారు. ఒక సంబంధం వచ్చిందంటే.. మనం ముందుకు వెళ్లొచ్చా? లేదా? అని మనకంటే ఎక్కువ ఆలోచిస్తారు. తెలిసినవారినందరి దగ్గర ఎంక్వైరీ చేస్తారు. అంతేనా.. ఇంకా ఎన్నో విషయాలు పెద్దలు కుదిర్చిన పెళ్లి బెస్ట్ అని చెబుతున్నాయి.

1. నలుగురిలోనూ కలిసిపోయే వ్యక్తి మీకు భర్త అవుతాడు

అరేంజ్డ్ మ్యారేజీల్లో మీ కుటుంబ కట్టుబాట్లు, నేపథ్యానికి దగ్గరగా ఉండే కుటుంబానికి చెందిన అబ్బాయినే మీకు భర్తగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి మీ భర్త మీ పుట్టింటి వారితో ఇట్టే కలిసిపోతారు. చిన్న చిన్న ఇబ్బందులున్నప్పటికీ వాటిని మీరు సరిచేసుకోగలుగుతారు.

ADVERTISEMENT

2. మీరు బాగా సర్దుకుపోతారు

దాదాపుగా మీ పుట్టింటి, అత్తింటి ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలు ఒకటే కావడం వల్ల మీ అత్తింట్లో మీరు త్వరగానే ఇమిడిపోగలుగుతారు. పైగా మిమ్మల్ని మీరు పెద్దగా మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు.

3. మీకేం కావాలో అదే మీకు దక్కుతుంది..

2-end-goal-everything-you-need-to-know-about-arranged-marriages

ADVERTISEMENT

తమ భవిష్యత్తు ఇలా ఉండాలని అందరికీ కొన్ని ఆలోచనలుంటాయి. ముఖ్యంగా తమ జీవిత భాగస్వామి ఎలా ఉండాలో స్పష్టత కూడా ఉంటుంది. కాబట్టి మీకు నచ్చిన వరుడు దొరికేంత వరకు వేచిచూడొచ్చు. ఏమంటారు?

4. భాగస్వామి విషయంలో స్పష్టత

ఎవరితోనైనా ప్రేమలో ఉన్నా.. డేటింగ్ చేస్తున్నా.. మీకు కొన్ని సందేహాలుండిపోతాయి. ‘మాకు పెళ్లవుతుందా?’, ‘నన్ను మోసం చేసి వెళ్లిపోడు కదా?’ అనే ప్రశ్నలు వేధిస్తాయి. అంతేకాదు.. ‘నేను తన కుటుంబసభ్యులకు నచ్చుతానా?’ ‘వారు నన్ను అంగీకరిస్తారా?’ అనే సందేహాలు కూడా ఉంటాయి. కానీ పెద్దలు కుదిర్చిన వివాహంలో అలాంటి భయాలేమీ ఉండవు.

పెద్దలు కుదిర్చిన పెళ్లి కలకాలం నిలుస్తుందా?

ADVERTISEMENT

1-arranged-marriage

నేటి తరం అమ్మాయిలు, అబ్బాయిలు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడానికి అంతగా ఇష్టపడటం లేదు. తమ మనసుకి నచ్చినవారిని వారే వెతుక్కొని పెళ్లాడటానికే ప్రాధాన్యమిస్తున్నారు. తమ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరైనా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొంటే వారిని వింతగా చూస్తున్నారు. అయితే మీకో విషయం తెలుసా? 2012లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం.. ప్రపంచంలో 55% వివాహాలు పెద్దలు కుదిర్చినవే. వాటిలో 4% మాత్రమే విడాకుల వరకు వెళ్లాయి. అరేంజ్డ్ మ్యారేజెస్ ఎందుకు ఎక్కువ కాలం నిలుస్తున్నాయి? దీనికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.

1. పెద్దగా అంచనాలు పెట్టుకోకపోవడం

పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొన్నవారు చాలా సహనంతో ఉంటారు. తమ భాగస్వామి గురించి తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఇద్దరూ ఒకరితో ఒకరు పెద్దగా పరిచయం లేని వారే. పెళ్లయినప్పటికీ.. ఒకరి వ్యక్తిత్వం గురించి మరొకరికి తెలియదు. దాన్ని తెలుసుకొనే ప్రయత్నంలోనే ఇద్దరూ ఉంటారు. కాబట్టి ఒకరిపై ఒకరు పెద్దగా అంచనాలు పెంచుకోరు. కాబట్టి ప్రతి క్షణాన్ని హాయిగా ఆస్వాదిస్తారు.

ADVERTISEMENT

2. ఒకరినొకరు అంగీకరిస్తారు

ప్రేమవివాహం చేసుకొన్నవారు తమ భాగస్వామి ఇంతకు ముందులా ఉండటం లేదని.. బాగా మారిపోయాడని చెబుతుంటారు. కొన్నిసందర్భాల్లో భార్యాభర్తల మధ్య మనస్ఫర్థలు రావడానికి ఇదే ప్రధాన కారణం అవుతుంది. కానీ పెద్దలు కుదిర్చిన పెళ్లిలో మార్పు గురించి అసలు ప్రస్తావనే రాదు. వివాహమైన తర్వాతే వారిద్దరి జీవితం కొత్తగా ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో ఒకరినొకరు తెలుసుకొంటూ.. వారిని వారిలానే స్వీకరిస్తారు.

పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొనే ముందు ఏ అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి?

1-same-backround-everything-you-need-to-know-about-arranged-marriages

ADVERTISEMENT

1. పెద్దలు కుదిర్చిన వివాహానికి ఇష్టపూర్వకంగానే అంగీకరిస్తున్నారా?

లేదా కుటుంబ సభ్యులు మీ ఇష్టంతో ప్రమేయం లేకుండా బలవంతంగా పెళ్లి చేస్తున్నారా? లేదా ఇతర కారణాల వల్ల ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సి వస్తుందా? ముందు ఈ విషయాలపై స్పష్టత తెచ్చుకోండి. మీ అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా.. బలవంతంగా వివాహం చేస్తున్నట్లయితే దానికి అంగీకరించకండి.

2. మీకు కాబోయే భాగస్వామి, అతని కుటుంబం ఎలా ఉండాలనుకొంటున్నారు?

మీరు ఎలాంటి ఇంటికి కోడలిగా వెళ్లాలనుకొంటున్నారు? అత్తింటి వారు మీ విషయంలో ఎలా ఉండాలని కోరుకొంటున్నారు? ఈ విషయాలపై మీరు ఓ అభిప్రాయానికి రండి. వీటిపై మీకు స్పష్టత లేకపోతే.. మీ మనసుకి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేరు.

ADVERTISEMENT

3. భాగస్వామిని ఎంచుకొనే విషయంలో రాజీపడాలా?

మీకు కావాల్సిన వాటి గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు.. ఎలాంటి విషయాల్లో రాజీ పడాలో కూడా ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. మీకు తగిన వ్యక్తిని ఎంచుకొనే క్రమంలో కొన్ని విషయాల్లో వెనక్కి తగ్గాల్సి ఉంటుంది.

4. సంబంధం కుదిరిన తర్వాత వద్దని చెప్పొచ్చా?

మీకు నచ్చిన వ్యక్తితో వివాహానికి అంగీకరించిన తర్వాత అతనిలో లేదా అతని కుటుంబంలో మీకు అభ్యంతరకరంగా అనిపించినవి, వాటి వల్ల భవిష్యత్తులో మీ ఇద్దరి మధ్య ఉన్న బంధానికి చేటు తెచ్చేవిగా మీకు అనిపిస్తే ఆ వివాహ బంధంలోకి అడుగుపెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే.. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు. కాబట్టి సరైన కారణాలను చూపించి మీ తల్లిదండ్రులతో ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పొచ్చు. ఈ పరిస్థితి ఎదురైతే దాన్ని ఎదుర్కోవడానికి ముందుగానే మానసికంగా సిద్ధంగా ఉండాలి.

ADVERTISEMENT

పెళ్లిచూపుల్లో అడగాల్సిన ప్రశ్నలు

ఇంతకు ముందైతే పెళ్లిచూపుల సమయంలో వధూవరులిద్దరికీ.. ఒకరితో ఒకరు మాట్లాడుకోవ‌డానికి అనుమతి ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఒకరితో ఒకరు సంభాషించుకొనే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సంభాషణే అతన్ని పెళ్లి చేసుకోవాలా? వద్దా అని నిర్ణయిస్తుంది. కాబట్టి ఆ సమయంలో మీరే చొరవ తీసుకుని అతన్ని కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది.

  1. ఖాళీగా ఉన్న సమయంలో మీరేం చేస్తుంటారు? మీ హాబీస్ ఏంటి?
  2. మీరు ప్రస్తుతం చేస్తున్న పని లేదా ఉద్యోగం మీరు ఇష్టపడే చేస్తున్నారా?
  3. డ్రింకింగ్, స్మోకింగ్ గురించి మీ అభిప్రాయం ఏంటి?
  4. మీకు కాబోయే భార్యలో ఎలాంటి లక్షణాలుండాలని మీరు కోరుకొంటున్నారు?
  5. మీ జీవిత భాగస్వామిలో ఉండకూడదని మీరనుకొంటున్న లక్షణాలేంటి?
  6. మీరెందుకు పెళ్లి చేసుకోవాలనుకొంటున్నారు?
  7. మీరు శాఖాహారా? మాంసాహారా? మీకు ఇష్టమైన వంటకమేంటి?
  8. మీ కుటుంబం గురించి నాకు కొంచెం చెప్పండి. కాబోయే కోడలిలో ఎలాంటి లక్షణాలుండాలని మీ కుటుంబసభ్యులు కోరుకొంటున్నారు?
  9. మీ భవిష్యత్తు ప్రణాళికలేంటి?
  10. మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టమా?
  11. మీ స్నేహితుల గురించి చెప్పండి.
  12. మీరు ఎలాంటి సంగీతం వింటూ ఉంటారు?
  13. మత సంప్రదాయాలను మీరు పాటిస్తారా? 
  14. ఇంటి పనుల్లో మీరు సాయం చేస్తారా?
  15. ఒంటరిగా ఎప్పుడైనా సమయం గడిపారా?

ఉపేక్షించకూడని విషయాలూ ఉన్నాయి

పెళ్లిచూపులప్పుడు మాట్లాడుకొనే తక్కువ సమయంలోనే.. అతడి వ్యక్తిత్వంపై ఓ నిర్ణయానికి రావడం అసాధ్యం. కానీ నిశితంగా గమనిస్తే కొన్ని ఉపేక్షించకూడని విషయాలను మనం తెలుసుకోవచ్చు.

ADVERTISEMENT

1. అతని గతం గురించి ఎక్కువ మాట్లాడటం

పెళ్లిచూపుల్లో గతంలో అతని ప్రేమ వ్యవహారాల గురించి ఎక్కువ మాట్లాడటమే కాకుండా.. మీ గతం గురించి కూడా ప్రశ్నిస్తుంటే కాస్త ఆలోచించాల్సిందే. ఎక్కువ సమయం తన గతం గురించి మాట్లాడుతుంటే తన విఫల ప్రేమ జ్ఞాప‌కాల నుంచి బయటకు రావడానికి ఇష్టపడటం లేదని గుర్తించాలి. మరికొంతమంది ఈ విషయంలో నిజాయతీగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారిని చెప్పనివ్వండి. మరి దీన్ని రెడ్ ఫ్లాగ్‌గా(ఉపేక్షించకూడని విషయం) ఎప్పుడు గుర్తించాలి? సంభాషణ మొదలైన కొద్దిసేపటికే ఇలాంటి విషయాలను ప్రస్తావించడం.. 50 శాతం కంటే ఎక్కువ మాటలు ఇవే అయితే ఈ సంబంధాన్ని అంగీకరించకపోవడమే మంచిది.

2. వస్త్రధారణ విషయంలో అభ్యంతరం చెప్పడం

4-hard-limits-everything-you-need-to-know-about-arranged-marriages

ADVERTISEMENT

‘మా తల్లిదండ్రులు తమకు కాబోయే కోడలు సంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించాలని కోరుకొంటున్నారు. నువ్వెలాంటి దుస్తులు వేసుకొంటావు?’ ఇలాంటి ప్రశ్న అతడి నుంచి ఎదురైతే.. వెంటనే ఆ సంబంధానికి no చెప్పేయండి.

3. పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం చేస్తావా?

పెళ్లిచూపుల్లో ఉద్యోగం చేసే చాలామంది అమ్మాయిలు ఎదుర్కొనే ప్రశ్న ఇది. ఇలాంటి ప్రశ్న మీకెదురైతే కాస్త ఆలోచించాల్సిందే. పెళ్లి తర్వాత అతడు మిమ్మల్ని గృహిణిగానే ఉండాలని అడిగితే..  మీరు వంట చేయడానికి అతడు మిమ్మల్ని పెళ్లి చేసుకొంటాడని అర్థం. పెళ్లి తర్వాత వర్క్ కంటిన్యూ చేస్తే వచ్చే సమస్య ఏంటని అతన్ని అడగండి. కచ్చితంగా ‘మా ఇంటి ఆడవాళ్లు గడపదాటి అడుగు పెట్టడానికి అనుమతి లేదు’, ‘మా ఇంటి ఆడవాళ్లు ఉద్యోగం చేస్తే మా పరువుకు భంగం’, ‘పని చేయాల్సిన అవసరం ఏముంది?’ ఇలాంటి సమాధానమే వస్తుంది. మరి, ఇలాంటి సంకుచితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిని మీరు భర్తగా అంగీకరిస్తారా?

4. అమర్యాదపూర్వకంగా వ్యవహరిస్తుంటే..

ADVERTISEMENT

మీతో మర్యాదగా వ్యవహరించే వ్యక్తి అందరితోనూ అలాగే వ్యవహరిస్తాడని లేదు. కాబట్టి అతని అసలైన వ్యక్తిత్వాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. అతను తన ఇంట్లోని పనివారు, సహాయకుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నాడో గుర్తిస్తే.. అతని అసలు స్వరూపం మీకు తెలుస్తుంది.

5. కట్నం గురించి మాట్లాడితే..

కట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరం. అయినప్పటికీ పెద్దమొత్తంలో కట్నం ఆశించేవారు మన సమాజంలో చాలామందే ఉన్నారు. ఇలాంటి వారిని మీ జీవితంలోకి ఆహ్వానించే ప్రయత్నం చేయద్దు. ఎందుకంటే.. నగలు, కార్లు, డబ్బులను వారికిచ్చి మీ విలువను మీరే నిర్ణయించుకోవద్దు.

కాబోయే అత్తమామలతో ఎలా మాట్లాడాలి?

ADVERTISEMENT

భవిష్యత్తులో మీకు కాబోయే అత్తమామలతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా వారితో చక్కగా మాటామంతీ కలపొచ్చు.

  1. వారితో మర్యాదగా వ్యవహరించండి. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు కదా..!
  2. మీరు మీరులాగానే ఉండటానికి ప్రయత్నించండి. కానీ వారికి నచ్చినట్టుగా ఉంటున్నట్టు నటించకండి.
  3. వారితో మాట్లాడండి. వారి ప్రశ్నలకు సమాధానమివ్వండి. అవసరమైతే మీరూ ప్రశ్నించండి. వారి మాటల్లో నిగూఢార్థాన్ని చదవడానికి ప్రయత్నించండి. అప్పుడే వారు మీ నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుస్తుంది.
  4. మీ సంబంధానికి అంగీకారం తెలపకపోతే.. వారి పట్ల అమర్యాదపూర్వకంగా ప్రవర్తించవద్దు.
  5. మీకు కాబోయే అత్తగారితో వ్యక్తిగతంగా మాట్లాడటానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ జీవితంలో ఆమె చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

సంబంధం అంగీకరించడానికి ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు..

1. అతడు, అతని కుటుంబంతో సరిపడినంత సమయం గడిపారా?

పెళ్లి నిశ్చయమవడానికి చాలా పెద్ద ప్రోసెస్ ఉంటుంది. ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి మీ అంగీకారాన్ని తెలిపే ముందు అతడితో వీలైనంత సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. మీ స్నేహితులతో, మీ కుటుంబ సభ్యులతో, ఇరు కుటుంబాలతో కలసి సమయం గడపండి. తద్వారా వారి కుటుంబంపై మీకో అభిప్రాయం ఏర్పడుతుంది.

ADVERTISEMENT

2. ఆర్థికంగా ఇద్దరూ నిలదొక్కుకున్నారా?

ఈ విషయాన్ని పెళ్లికి ముందే మీరు నిర్ధారించుకోవాలి. అంటే దానర్థం అతని కంటే మీరు ఎక్కువ సంపాదిస్తున్నారా? అతను మీ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారా? అని కాదు. ఇద్దరూ ఆర్థికంగా స్వతంత్రంగానే ఉన్నారా అని. ఖర్చులు, పెట్టుబడులు, పొదుపు వంటి అంశాల్లో ఇద్దరి ఆలోచనలు దగ్గరగా ఉన్నాయేమో గమనించాలి. ఒకవేళ మీరు ఆర్థికపరమైన అంశాల్లో మీ భర్తపైనే ఆధారపడాల్సి వస్తే.. మిమ్మల్ని చులకనగా చూసే అవకాశం అతనికివ్వకండి

3. నిజాయతీగానే ఉన్నారా? ఏదైనా దాస్తున్నారా?

9-secrets-everything-you-need-to-know-about-arranged-marriages

ADVERTISEMENT

పెళ్లి జీవితకాలం సాగే అందమైన అనుబంధం. దీని పునాది ప్రేమ, నిజాయతీలతో నిండి ఉంటే అది ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. కాబట్టి వారి నుంచి ఏదీ దాచే ప్రయత్నం చేయవద్దు. మీ గతం గురించి వారికి చెబితే.. వారు మిమ్మల్ని అంగీకరించరేమోననే భయంతో వారి ముందు నటించవద్దు. అలాంటి భయం ఉంటే భాగస్వామి ఎంపిక విషయంలో మరోసారి ఆలోచించండి.

4. ఒకే రకమైన విలువలు పాటిస్తున్నారా?

భిన్నమైన వ్యక్తిత్వాలున్న వ్యక్తులు మంచి జంటగా మారడం తెర మీద జరగొచ్చేమో కానీ.. వాస్తవికంగా కాదు. జీవితాన్ని పంచుకోబోయే వ్యక్తులకు ఒకే రకమైన ఆలోచనలు, విలువలు, సిద్ధాంతాలుంటే వారి మధ్య బంధం మరింత బలంగా ఉంటుంది.

5. మీరుగానే మిమ్మల్ని అతడు అంగీకరించాడా?

ADVERTISEMENT

మిమ్మల్ని తనకు అనుగుణంగా మార్చుకొనే వ్యక్తిగా కంటే.. మీరుగానే మిమ్మల్ని ఇష్టపడాలి.

6. ఎప్పుడైనా నిరాశా, నిస్పృహ‌లతో కనిపించాడా?

ఒక మనిషి అసలు స్వరూపం అతను నైరాశ్యంలో ఉన్నప్పుడే కనిపిస్తుంది. తనకెదురైన ఇబ్బందులను సహనంతో ఎదుర్కొనే వ్యక్తిని మీరు భర్తగా ఎంచుకోవడం మంచిది. అలా కాకుండా.. ప్రతి చిన్న విషయానికి అసహనం వ్యక్తం చేస్తూ.. నెపాన్నిఇతరులపైకి నెట్టే వ్యక్తికి మీ జీవితంలో స్థానం ఇవ్వకండి.

7. మీ భాగస్వామి ఎంపిక విషయంలో సంతృప్తిగానే ఉన్నారా? ఏదైనా సందేహం ఉందా?

ADVERTISEMENT

మనం చేసే పని తప్పా? ఒప్పా? అనే విషయం మన మనస్సాక్షి ఎప్పుడూ మనకు చెబుతుంది. వివాహం విషయంలో మీరు తీసుకొన్న నిర్ణయం సరైనదే అని మీకు అనిపించడంతో పాటు తృప్తిగానూ అనిపించాలి. అలా కాకుండా.. మీరు తీసుకొన్న నిర్ణయం సరైనది కాదనిపిస్తే.. దానికి కారణం వెతికి పరిష్కరించుకొనే ప్రయత్నం చేయండి.

కాబోయే మెట్టినింటి వారితో సత్సంబంధాలు పెంచుకోవడమెలా?

1. కాబోయే అత్తగారితో సరదాగా షాపింగ్‌కి వెళ్లండి

ఆమెతో అనుబంధం పెంచుకోవడానికి మంచి మార్గం షాపింగ్. కాబట్టి మీకు కాబోయే అత్తగారికి ఫోన్ చేసి సరదాగా బయటకు వెళదామని చెప్పండి. అలా షాపింగ్‌కి తీసుకెళ్లి.. ఆమెకు నచ్చిన బహుమతులను అందించండి. ఆమె కచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడుతుంది.

ADVERTISEMENT

2. ఫ్యామిలీ డిన్నర్ ఏర్పాటు చేయండి

10-family-dinner-everything-you-need-to-know-about-arranged-marriages

మీ ఫియాన్సీ కుటుంబాన్ని మీ ఇంటికి డిన్నర్‌కి ఆహ్వానించండి. మీకు కాబోయే భర్త గురించి మీరు తెలుసుకోవడం మాత్రమే కాదు.. మీ కుటుంబం గురించి వారికి.. వారి గురించి మీ కుటుంబానికి తెలుస్తుంది.

3. మీ ఆడపడుచుని నైట్ పార్టీకి ఆహ్వానించండి

ADVERTISEMENT

మీ స్నేహితురాళ్లతో కలసి మీరు జరుపుకొనే నైట్ పార్టీకి మీ ఆడపడుచుని ఆహ్వానించండి. పార్టీలో ఆటపాటలతో పాటు సింపుల్ డిన్నర్ ఏర్పాటు చేస్తే ఆమె దిల్ ఖుష్ అయిపోతుంది.

4. ఇద్దరు తోబుట్టువులతో కలసి బ్రంచ్ చేయండి

మీకు కాబోయే భర్త, అతని తోబుట్టువులతో పాటు మీరు, మీ తోబుట్టువులు కలసి బ్రంచ్‌కు వెళ్లండి. మీ గురించి వారికి.. అతని గురించి మీ సహోదరులకు తెలియడంతో పాటు మీ అనుబంధం బలపడుతుంది.

5. తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండండి

ADVERTISEMENT

మీకు కాబోయే అత్తింటివారితో వారం పదిరోజులకోసారైనా మాట్లాడుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల మిమ్మల్ని వారి కుటుంబంలోని వ్యక్తిగానే చూడటం ప్రారంభిస్తారు.

6. పుట్టినరోజులు, ఇతర ప్రత్యేకమైన రోజుల్లో విష్ చేయండి

మీ అత్తింట్లో ఎవరివైనా పుట్టినరోజు, పెళ్లిరోజులు జరిగితే.. వారికి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పండి. అంతేకాదండోయ్.. వారికి ప్రత్యేకమైన బహుమతులు అందించి సర్ప్రైజ్ చేయండి. అయితే వారు మీరిచ్చే సర్ప్రైజ్‌ను స్వీకరించగలిగే మనస్తత్వం ఉన్నవారైతేనే ఇలా చేయండి. లేదంటే విషెస్ చెప్పి ఊరుకోండి.

పెళ్లి రోజు దగ్గరపడుతున్నప్పుడు

ADVERTISEMENT

పెళ్లి సమయం దగ్గరపడే కొద్దీ కాస్త టెన్షన్‌గా అనిపిస్తుంది. దుస్తులు, నగల కోసం షాపింగ్ చేయడం ఇలా ఎన్నో రకాల పనులతో తీరిక లేకుండా ఉంటారు. ఇంత బిజీగా ఉన్నప్పటికీ మీరు కొన్ని విషయాల్లో శ్రద్ధగా ఉండాలి. మరికొన్ని విషయాలను గమనించాలి. అవేంటంటే..

1. మీకు కాబోయే భర్త మీతో ఎలా వ్యవహరిస్తున్నాడు?

ఇంతకు ముందు మనం చెప్పుకొన్నట్టుగానే ఒత్తిడిలో ఉన్నప్పుడు మనిషి అసలు స్వరూపం బయట పడుతుంది. మీ ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరనప్పుడు అతడు మీతో ఎలా వ్యవహరిస్తున్నాడో గమనించండి. ఎందుకంటే మిమ్మల్ని కసిరే వ్యక్తితో కాకుండా.. మీ అభిప్రాయాలను గౌరవించే వ్యక్తితో జీవితం పంచుకోవడం ఆనందంగా ఉంటుంది.

2. ఆర్థికపరమైన అంశాల్లో జ ాగ్రత్త

ADVERTISEMENT

7-dowry-everything-you-need-to-know-about-arranged-marriages

భారతీయ వివాహ వ్యవస్థలో డబ్బే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది చాలా దుర‌దృష్ట‌క‌ర‌మైన అంశం. అయినప్పటికీ తమ కూతురు అడుగుపెట్టబోయే ఇంటి వారి కోరికలను నెరవేర్చడం కోసం తలైనా తాకట్టు పెట్టడానికి సిద్ధపడతారు. ఇవన్నీ కట్నం డిమాండ్ చేయడం కిందకే వస్తాయి. వారి కోరికలు నెరవేర్చడం మీ తల్లిదండ్రులకు తలకు మించిన భారం అవుతోంటే.. వారితో మాట్లాడి సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయండి.

3. రెండు కుటుంబాల మధ్య వాతావరణం ఎలా ఉంది?

ఇది చాలా నిశితంగా గమనించాల్సిన విషయం. రెండు కుటుంబాలు ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తిస్తున్నారో ఓ కన్నేసి ఉంచాలి. మీ కుటుంబసభ్యులతో అబ్బాయి తరఫువారు కించపరిచే విధంగా వ్యవహరిస్తే సంబంధం వదులుకోవడమే మంచిది.

ADVERTISEMENT

4. జరుగుతున్న పరిణామాలను మీ మనసు అంగీకరిస్తోందా?

తక్కువ సమయంలో ఒకరిపై నిశ్చితాభిప్రాయానికి రావడమనేది దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. అయితే మీకు కాబోయే వ్యక్తితో ఎక్కువ సమయం గడిపేకొద్దీ అతడి గురించి మీకు బాగా తెలుస్తుంది. మీ ఇద్దరి మధ్య జరుగుతున్న పరిణామాలు మీకు సంతోషాన్ని కలిగిస్తే మంచిదే. అలా కాకుండా.. మీ భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా చేసేవి అయితే మాత్రం ముందే జాగ్రత్తపడటం మంచిదే. ఈ విషయంలో చుట్టుపక్కల వారు ఏమనుకొంటారోననే భయం వద్దు. ఎందుకంటే వారేదో అంటారని మీ జీవితాన్ని ఫణంగా పెట్టొద్దు.

కాబోయే జీవిత భాగస్వామికి దగ్గరయ్యేదెలా?

నిశ్చితార్థం జరిగిన తర్వాత వివాహానికి ముందు ఉండే సమయంలో మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గేలా చేసి మనసులు ఒకటయ్యేలా చూసుకోవాలి. మరి, దాని కోసం ఏం చేయాలో తెలుసుకొందామా?

ADVERTISEMENT
  1. చక్కగా డేటింగ్‌కి వెళ్లండి. మనసు విప్పి మాట్లాడుకోండి. మీకు వీలైనన్ని తీపిగుర్తులు ఏర్పరచుకోండి.
  2. ఉత్సాహపరిచే వాతావరణంలో లాంగ్ డ్రైవ్‌కి వెళ్లండి. చాలా రొమాంటిక్ గా ఉంటుంది.
  3. ఇద్దరి స్నేహితులతో కలసి టూర్‌కి వెళ్లండి.
  4. చిన్న చిన్న బహుమతులతో ఒకరినొకరు సర్ప్రైజ్ చేసుకోవచ్చు.
  5. రోజూ మీకు వీలైనంత సమయం ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. మాటల ద్వారానే ఒకరిపై మరొకరికి ఇష్టం పెరుగుతుంది.
  6. చిన్న విషయమైనా.. ఒకరినొకరు అభినందించుకోవడానికి ప్రయత్నించండి.
  7. ఇద్దరికీ కామన్‌గా ఉన్న అభిరుచిని మీ అనుబంధాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోండి.

పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొన్నవారు చెప్పిన అపురూపమైన విశేషాలు

2-arranged-marriage

అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకొన్నవారు తమ అనుభవాలను Quoraలో వివరించారు. అందులో కొన్నింటిని మీ ముందుంచుతున్నాం.

నాన్న కుదిర్చిన సంబంధం

ADVERTISEMENT

25 మార్చి, 2018.. ఆ రోజు అతడి కుటుంబం మా ఇంటికి వచ్చింది. భోజనం తర్వాత మేమంతా కలసి షాపింగ్‌కి వెళ్లాం. షాపింగ్ చేస్తున్నప్పడు మేమిద్దరం అన్ని విషయాల గురించి మాట్లాడుకొన్నాం పెళ్లి గురించి తప్ప. కానీ మా తల్లిదండ్రులిద్దరూ ఆ విషయంలో మా నిర్ణయం గురించి ఎదురుచూస్తున్నారు. మాల్ అంతా కలియతిరిగి వచ్చిన తర్వాత మా నాన్న నన్ను పక్కకు తీసుకెళ్లి నా నిర్ణయమేంటని అడిగారు. కానీ అతని అభిప్రాయం తెలుసుకోకుండా నా మనసులోని మాట చెప్పడం నాకిష్టం లేదు. ఈ లోగా మా నాన్న అతడు నన్ను పెళ్లి చేసుకోవడానికి సరేనన్నాడని చెప్పారు. నేను నా మనసు చెప్పిన మాట విని నాకూ ఇష్టమే అని చెప్పాను. అదే రోజు మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసి నిశ్చితార్థం చేశారు. ఆ తర్వాత మేమిద్దరం పూర్తిగా ప్రేమలో మునిగిపోయాం.

ఆలోచించకుండానే చెప్పేశా..

అతనితో మాట్లాడుతున్నప్పుడు చాలా హాయిగా ఉంటుంది. జోకులేసుకొంటూ.. నవ్వుకొంటూ.. సమయాన్ని మరచిపోతాను. థాంక్ గాడ్.. అతనితో నేను మొదటి సారి మాట్లాడినప్పుడు నేను పెద్దగా ఇబ్బంది పడలేదు. మేం లంచ్‌కి వచ్చినప్పుడు మా ఇద్దరి తల్లిదండ్రులు మా పెళ్లి గురించి మాట్లాడుకొంటున్నారు. అతడితో పెళ్లి గురించి ఆలోచించి నిర్ణయం చెప్పమని మా అమ్మ అంది. నేను ఏ మాత్రం ఆలోచించకుండా.. నాకు ఈ పెళ్లి ఇష్టమేనని చెప్పా. ఇంతలో అతడి అమ్మ కల్పించుకొని… నేను తనని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. karaokeలో పార్టీ ఏర్పాటు చేయడానికి ముందే తను నన్ను ఇష్టపడ్డాడని చెప్పారు. మూడు నెలల తర్వాత మా ఇద్దరికీ ఎంగేజ్మెంట్ అయింది. రెండేళ్ల తర్వాత మా వివాహమైంది. అలా karaokeలో పాటలు పాడే వ్యక్తి నా భర్తగా వచ్చాడు.

చిన్ననాటి క్రష్ నే పెళ్లాడా..

ADVERTISEMENT

‘వాళ్లొచ్చేశారు..వాళ్లొచ్చేశారు’ అని నా మేనకోడలు అంటున్న మాట నాకు భయం తెప్పించింది. ఎందుకంటే వారు నన్ను చూసుకోవడానికి వస్తున్న పెళ్లివారు. భయంతో పాటే కన్నీరూ వస్తోంది. ఎందుకంటే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అందుకే ధైర్యం తెచ్చుకొని వచ్చిన అబ్బాయితో ఈ విషయం చెప్పేద్దామని నిశ్చయించుకొన్నాను. కానీ అతని గొంతు నాకు బాగా పరిచయం ఉన్నా.. నేనెప్పటికీ మరచిపోలేని వ్యక్తిది. ఆ గొంతు దర్శన్‌ది. తొమ్మిదేళ్లుగా నేను ప్రేమిస్తున్న వ్యక్తిది. అప్పుడు చూశాను అతని వైపు. నిజమే తను దర్శన్. నా మానసచోరుడు.

తనతో సమానంగా చూసే వ్యక్తి దొరికాడు.

పెళ్లికి ముందు నాకు ఎన్నో ఆలోచనలుండేవి. నేను చేసుకోబోయే వ్యక్తి మనస్తత్వం ఎలా ఉంటుందో? నన్ను సంతోషంగా ఉంచుతాడో లేదో అని. ఇప్పుడు ఆ భయాలేమీ లేవు. ఎందుకంటే.. పెళ్లికి ముందు, ఆ తర్వాత నా జీవితంలో పెద్దగా వచ్చిన మార్పులేవీ లేవు. నేను చెప్పే ఏ విషయమైనా సరే నా భర్త చాలా ఓపిగ్గా వింటారు. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకొంటారు. ఇంటిపనుల్లో సాయం చేస్తారు. నన్ను తనతో సమానంగా చూస్తారు. అందుకే నేను చాలా లక్కీ.

Gifs: Giphy

ADVERTISEMENT

ఇవి కూడా చ‌ద‌వండి.

ఈ వెడ్డింగ్ కేక్స్.. నిజంగానే మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి

పెళ్లికి సన్నద్ధమవుతున్నారా? ఈ మెహందీ డిజైన్లపై ఓ లుక్కేయండి

నవ వధువులకు.. ఈ సెలబ్రిటీ హెయిర్ స్టైల్స్ చాలా స్పెషల్

ADVERTISEMENT
04 Feb 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT