షాపింగ్ (Shopping) అంటే ఇష్టపడని అమ్మాయి ఉండదేమో.. అయితే ఎంత షాపింగ్ చేసినా.. ఏదైనా పార్టీకి వెళ్లాలన్నా.. లేదా స్నేహితులతో బయటకు వెళ్లాలన్నా వేసుకోవడానికి దుస్తులు, ఇతర వస్తువులు లేవని బాధపడే వాళ్లు చాలామందే.. అయితే కాస్త ఆలోచించి షాపింగ్ చేస్తే ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాదు.
అందుకే మీకు 21 సంవత్సరాల వయసు పూర్తయి; మీరు స్నేహితులతో పార్టీలు, ఆఫీస్‌లో కార్పొరేట్ మీటింగ్ వంటి వాటన్నింటికీ అటెండ్ అయ్యే వయసు వచ్చే లోపల ఈ కింద చెప్పిన ప్రతి ఫ్యాషనబుల్ వస్తువును మీ వార్డ్‌రోబ్ (wardrobe)లో చేర్చుకోవాల్సిందే. దీని వల్ల చాలా తక్కువ ఖర్చు, శ్రమతో మీరూ ఫ్యాషనిస్టా అనిపించుకోవచ్చు. మరి, ఈ లిస్ట్‌లో మీ దగ్గర ఎన్నున్నాయో మీరే ఓసారి చెక్ చేసి చూసుకోండి.
1. డెనిమ్ జాకెట్
చలికాలమైనా లేక వేసవి అయినా.. ఓ చక్కటి డెనిమ్ జాకెట్ ధరిస్తే చాలు.. ఎల్లప్పుడూ మీరు ఫ్యాషనబుల్‌గా కనిపించేందుకు వీలుంటుంది. ఈ ఫ్యాషన్ ఎప్పటికీ కొనసాగుతుంది. బోరింగ్ అవుట్‌ఫిట్‌ని కూడా ఇది హుందాగా కనిపించేలా చేస్తుంది.
2. టీషర్ట్ బ్రా
మీ లుక్ చక్కగా కనిపించేందుకు సౌకర్యవంతంగా ఉండే బ్రా ఎంతో అవసరం. అందుకే చక్కటి టీషర్ట్ బ్రా కోసం మీరు తప్పనిసరిగా మీ డబ్బును పెట్టుబడి పెట్టాల్సిందే. ఇవొక్కటే సరిపోతాయా అంటే లేదు.. ఫ్యాన్సీగా ఉండే లేసీ బ్రాలు, స్ట్రాప్‌లెస్ బ్రాలు తప్పనిసరి. కానీ రోజువారీ ఉపయోగానికి అవి పనికిరావు. రోజూ మీ వక్షోజాలను సరైన పొజిషన్‌లో ఉంచాలంటే ఈ బ్రా తప్పనిసరి.
3. స్నీకర్
మంచి స్టైలిష్ స్నీకర్స్ ప్రతి అమ్మాయి వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిందే. ఇవి దాదాపు అన్ని వెస్ట్రన్ అవుట్‌ఫిట్స్ మీదకు మ్యాచ్ అవుతాయి. ఏ డ్రస్‌కి మ్యాచింగ్ ఏ చెప్పులు వేసుకోవాలో అని మీరు గంటల తరబడి ఆలోచించాల్సిన అవసరం లేకుండా చేస్తాయివి.
4. పార్టీవేర్ కుర్తా
ఎన్ని రకాల క్యాజువల్ డ్రస్సులున్నా.. పార్టీలకు వేసుకోవడానికి అవి అస్సలు పనికిరావు. అందుకే ఓ పార్టీవేర్ డ్రస్ కొనుక్కోవడం సరైన పని అని చెప్పవచ్చు. దీని కోసం గాగ్రా ఛోళీ, చీరల కంటే చక్కగా సౌకర్యంగా ఉన్న కుర్తా పైజామా.. అదేనండీ పంజాబీ డ్రస్ తీసుకోవడం మంచిది. ఇందులో చాలా రకాలున్నాయిగా.. అనార్కలీ, షరారా, పలాజో.. ఇలా మీకు ఏది సౌకర్యంగా ఉంటే అది తీసుకోవడం మంచిది.
5. పెన్సిల్ స్కర్ట్
మనలో పెన్సిల్ స్కర్ట్‌ని ఇష్టపడే వాళ్లు చాలామందే.. దీని ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. దీన్ని ఆఫీస్‌కే కాదు.. ఫార్మల్ డిన్నర్, మీటింగ్స్, పార్టీలు.. ఇలా చాలా సందర్భాల్లో వేసుకోవచ్చు. భారతీయ మహిళల అందాన్ని చక్కగా చూపే దుస్తుల్లో పెన్సిల్ స్కర్ట్ కూడా ఒకటి. దీన్ని షర్ట్‌తో లేదా క్రాప్ టాప్‌తో ఇలా మీకు నచ్చిన దానితో జత చేసి అందంగా మెరిసిపోవచ్చు.
6. సమ్మర్ డ్రస్
చక్కటి ప్రింటెడ్ సమ్మర్ డ్రస్ మీ అందాన్ని పెంచడంతో పాటు మీకు హాలిడే మూడ్‌ని అందిస్తుంది. ఇది మీ రోజుకి అందమైన రంగులను చేర్చి డల్‌గా ఉన్న రోజు ప్రత్యేకంగా మార్చుతుంది.
7. టోట్ బ్యాగ్
చిన్నవి ఎన్ని ఉన్నా.. రోజువారీ మనకు అవసరమైన వస్తువులన్నీ పెట్టుకోవడానికి కాస్త పెద్దగా ఉండే ఓ బ్యాగ్ తప్పనిసరి. ఈ తరహా బ్యాగ్ మన వార్డ్‌రోబ్‌లో ఉన్న ప్రతి డ్రస్‌తోనూ మ్యాచవుతుంది. ఇలాంటి బ్యాగ్‌ని కాస్త రంగు చూసుకొని కొంటే చాలు.. రోజూ ఎక్కడికెళ్లినా దీన్ని తీసుకొని వెళ్లిపోవచ్చు. పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు.
8. ఎత్నిక్ స్కర్ట్
మోడ్రన్ దుస్తులు ఎన్నున్నా దేశీ లుక్‌లో ఉన్న అందం మరెందులోనూ ఉండదు. అంతే కదా.. అందుకే మీ వార్డ్‌రోబ్‌లోనూ చక్కటి రంగు, డిజైన్ ఉన్న ఎత్నిక్ స్కర్ట్ ఒకటి ఉంచుకోండి. దీన్ని చక్కగా మ్యాచయ్యే టాప్‌తో పాటు చక్కటి జూతీస్‌ని జోడించి వేసుకోండి. తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో చక్కటి దేశీ లుక్ మీ సొంతమవుతుంది.
9. స్లింగ్ బ్యాగ్
చక్కటి స్లింగ్ బ్యాగ్ కూడా మీ అవుట్‌ఫిట్స్ అన్నింటితో మ్యాచ్ అవుతుంది. మంచి క్యాజువల్ లుక్ కోసం ఇది చాలా బాగా నప్పుతుంది. ఈ బ్యాగ్‌లాంటి స్టడ్డెడ్ బ్యాగ్ వేసుకొని స్నేహితుల ముందు ప్రత్యేకంగా కనిపించండి.
10. కూల్ సన్‌గ్లాసెస్
ఎండాకాలం మీ కళ్లకు చల్లదనాన్ని అందించేందుకు అందమైన కూలింగ్ గ్లాసెస్ ఎంతో బాగా పనిచేస్తాయి. ఇది కేవలం ఫ్యాషన్ కోసమే కాదు.. మీ కళ్లను హానికరమైన సూర్య కిరణాల నుంచి రక్షించేందుకు తోడ్పడుతుంది. ఎక్కువ సేపు ఎండలో ఉండడం వల్ల మీ కళ్ల చుట్టూ ఉన్న సున్నితమైన చర్మం పాడవుతుంది. అంతేకాదు.. సన్నని గీతలు కూడా ఏర్పడతాయి. అందుకే వీటి నుంచి రక్షించుకునేందుకు చక్కటి వెడల్పాటి సన్‌గ్లాసెస్‌ని కొనుగోలు చేయండి.
11. వ్యాలెట్
బయటకు వెళ్లేటప్పుడు బ్యాగ్‌లోనే డబ్బులు పెట్టుకోలేం కదా.. దీనికోసం మంచి వ్యాలెట్ ఉండడం తప్పనిసరి. అందుకే మంచి క్వాలిటీ, డిజైన్ ఉన్న ఓ వ్యాలెట్ కొనుక్కొని అందులో మీ డబ్బులతో పాటు కార్డులు కూడా పెట్టుకోండి. ఎక్కడికి వెళ్లినా మీ లుక్ పూర్తిగా అద్భుతంగా కనిపిస్తుంది.
12. ఎల్‌బీడీ
ప్రతి అమ్మాయికి ఓ ఎల్‌బీడీ అవసరం. ఎల్‌బీడీ వేసుకోకూడని పార్టీ, క్యాజువల్ మీటింగ్ ఏదీ ఉండదు. ఫార్మల్ మీటింగ్స్‌కి, ఆఫీస్‌కి తప్ప.. ఎక్కడికి కావాలంటే అక్కడికి మీరు దీన్ని వేసుకొని వెళ్లొచ్చు. మీరు ఎక్కడికైనా వెళ్లాలంటే ఏం వేసుకోవాలో అర్థం కాకపోతే దీన్ని ప్రయత్నించండి.
13. ఫ్యాన్సీ ఫ్లాట్స్
చక్కటి స్నీకర్స్ అన్ని వెస్ట్రన్ అవుట్‌ఫిట్స్‌కి నప్పుతాయని అనుకున్నాం కదా.. అయితే వీటిని వేసవిలో వేసుకోవడం కాస్త ఇబ్బందే. అంతేకాదు.. సంప్రదాయమైన దుస్తులకు మళ్లీ మరో జత తీసుకోవాలి.. అందుకే చక్కటి రాళ్లు పొదిగిన లేదా మంచి డిజైన్ ఉన్న ఫ్యాన్సీ ఫ్లాట్స్ తీసుకోండి. దీన్ని రోజువారీ వేసుకోవడానికి ఉపయోగించవచ్చు. అంతేకాదు.. పార్టీలకు వీటినే ప్రయత్నించవచ్చు.
14. బ్లాక్ స్టెలట్టోస్
పార్టీ సీజన్ వచ్చిందంటే ఫ్లాట్స్ పక్కన పెట్టి స్టెలట్టోస్ వేసుకోవాల్సిందే.. మంచి చెప్పులు అవుట్‌ఫిట్ లుక్‌ని మార్చేస్తాయి. మరి, డ్రస్సింగ్ అద్బుతంగా ఉండి చెప్పులు సాధారణంగా ఉంటే ఎలా?? అందుకే ఏ పార్టీకైనా ఆలోచించకుండా వేసుకునేలా ఓ నలుపు రంగు స్టెలట్టోస్ జతను మీ క్లోజెట్‌లో ఉంచుకోండి. ఇవి ఏ రంగు దుస్తులతో అయినా మ్యాచ్ అవుతాయి.
15. స్టేట్‌మెంట్ నెక్లెస్
సింపుల్ అవుట్‌ఫిట్‌కి కూడా పార్టీ లుక్‌ని అందించాలంటే దానికి ఓ మంచి స్టేట్‌మెంట్ నెక్లెస్ జోడించాల్సిందే. దీన్ని సాధారణ వైట్ షర్ట్, జీన్స్‌తో కలిపి ధరించండి. మీరు అవుటింగ్‌కి సిద్ధంగా ఉన్నట్లే.. క్యాజువల్ డ్రస్‌తో ధరించినా దాని అందాన్ని పెంచుతుందీ నెక్లెస్.
16. తెల్లని టీషర్ట్
వైట్ టీషర్ట్ మీ జీన్స్‌కి చక్కటి మ్యాచింగ్. వైట్ టీషర్ట్ ఎలాంటి సింపుల్ సందర్భానికైనా చక్కటి సొల్యూషన్.. ఇలాంటి టీషర్ట్ మీ వార్డ్‌రోబ్‌లో ఒక్కటి తప్పనిసరిగా ఉండాల్సిందే. దీన్ని లేయర్ చేసుకోవడం లేదా ఉన్నది ఉన్నట్లుగానే ధరించడం ఇలా ఏది చేసినా మీ లుక్ అందంగా కనిపించడం ఖాయం.
17. మంచి చీర
మీరు ఎక్కడికైనా చీర కట్టుకొని వెళ్లాల్సిన సందర్భం వస్తే ఏం చేస్తారు? ముందురోజే అమ్మ వార్డ్‌రోబ్ పై దండయాత్ర చేసి మీకు నచ్చినవన్నీ ప్రయత్నిస్తారు. అందులో మీకు బాగా నచ్చిన చీరకు బ్లౌజ్ కుట్టించుకొని సిద్ధమైపోతారు అంతేనా? ఇది సరైనదే.. కానీ మీక్కూడా ప్రత్యేకంగా శారీ కలెక్షన్ ఉంటే బాగుంటుంది కదా.. దీని కోసం ప్రత్యేకంగా పట్టు చీరలే కొనాల్సిన అవసరం లేదు. మంచి రంగులో ఉన్న సింపుల్ చీరను ఎంచుకుంటే వివిధ రకాల సందర్భాలకు ప్రయత్నించేందుకు సులువుగా ఉంటుంది.
18. మీకు చక్కగా ఫిట్ అయ్యే జీన్స్
జీన్స్ అంటే ప్రతి అమ్మాయికి క్యాజువల్ డ్రస్సింగ్ అనుకోవచ్చు. మీ వార్డ్‌రోబ్‌లో ఎన్ని రకాల దుస్తులు ఉన్నా సరే.. మీకు చక్కగా నప్పే.. మంచి ఫిటింగ్ ఉన్న ఓ జీన్స్ ఎంతో అవసరం. దీని కోసం మంచి టాప్ బ్రాండ్లలో మీరు నమ్మేవాటిలోనే ఎంపిక చేసుకోవడం మంచిది. ఇది మీకు ఎన్నో సంవత్సరాలు ఉపయోగపడుతుంది.
19. వెస్ట్రన్ స్కర్ట్
కొన్నిసార్లు అసలు ఏం వేసుకోవాలో అర్థం కాదు. చాలా డల్‌గా అనిపిస్తుంది. ఇలాంటప్పుడు వేసుకోవడానికి చక్కటి మ్యాక్సీ స్కర్ట్ మన వార్డ్‌రోబ్‌లో ఉండడం ఎంతో అవసరం. కుచ్చులతో ఉన్న ఈ స్కర్ట్‌లాంటివి ఎప్పుడూ అవుటాఫ్ ఫ్యాషన్ కావు. మీరు పెట్టిన ధరకు తగినట్లుగా వీలైనన్ని రోజులు ధరించే వీలుంటుంది.
20. స్టైలిష్ టాప్
కేవలం బాటమ్స్ మాత్రమే కాదు.. మంచి స్టైలిష్ టాప్స్ కూడా మీ వార్డ్‌రోబ్ లో ఉండడం ఎంతో అవసరం. ఎందుకంటే ఒక్కోరోజు మీరు సాధారణంగా కాకుండా ఎంతో అందంగా కనిపించాలనుకుంటారు. ఆ రోజు కోసం ప్రత్యేకంగా చుడీదార్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ టాప్స్, టీషర్ట్స్‌ని పక్కన పెట్టి ఈ తరహాలో ఉన్న స్టైలిష్ టాప్ వేసుకుంటే సరి.
21. ఆకట్టుకునే దుపట్టా
మన దగ్గర ఉన్న కుర్తాలన్నింటికీ దుపట్టాలు ఉండవు. ఉండాల్సిన అవసరం కూడా లేదు. ప్రస్తుతం టాప్‌లను అలాగే వేసుకోవడం అలవాటైపోయింది. అయితే ఎప్పుడైనా కాస్త డిఫరెంట్ లుక్ కోసం వేసుకోవడానికి మీ దగ్గర ఉన్న కుర్తాలన్నింటికీ మ్యాచ్ అయ్యేలా దుపట్టా తీసుకోండి. అద్భుతమైన ట్రెడిషనల్ లుక్‌ని మీ సొంతం చేసుకోండి.
ఇవి కూడా చదవండి.
ఈ దుపట్టాలతో మీ బ్రైడల్ లుక్‌ని.. మరింత మెరిపించండి..!
నల్లా నల్లని ద్రాక్ష.. మీ అందాన్ని ద్విగుణీకృతం చేస్తుందిలా..!
పెళ్లికి ముందే ఈ ఎమర్జెన్సీ కిట్.. సిద్ధం చేసుకోవడం మర్చిపోవద్దు..