ADVERTISEMENT
home / సౌందర్యం
షేవింగ్ తర్వాత వచ్చే వెంట్రుకలు.. గుచ్చుకోకుండా ఉండాలంటే..?

షేవింగ్ తర్వాత వచ్చే వెంట్రుకలు.. గుచ్చుకోకుండా ఉండాలంటే..?

షేవింగ్ లేదా హెయిర్ రిమూవల్ క్రీం ఉపయోగించి అండర్ ఆర్మ్స్ లేదా ఇతర భాగాల్లో వెంట్రుకలను తొలగించుకున్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఒకటి రెండు రోజులు గడిచిన తర్వాత చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే.. అప్పటికి పెరిగిన చిన్న చిన్న వెంట్రుకలు గుచ్చుకోవడం మొదలుపెడతాయి.ఇలా ఎందుకు జరుగుతుందంటే అండర్ ఆర్మ్స్ లేదా బికినీ లైన్‌లో పెరిగే వెంట్రుకలు కాస్త కర్లీగా ఉంటాయి.

షేవింగ్ తర్వాత కూడా అవి వెనక్కి తిరిగినట్లుగా పెరగడం ప్రారంభిస్తాయి. అందుకే అవి కాస్త పెరిగేంత వరకు మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ ర్యాషెస్ రావడం, మంటగా అనిపించడం, దురద పెట్టడం, మొటిమలు పెరగడం, ఇతర ఇన్ఫెక్షన్లు బారిన పడడం కూడా  జరుగుతుంది. వీటినే రేజర్ బంప్స్ (razor bumps) అంటారు. కొన్నిసార్లు రేజర్ బ్లేడ్ వల్ల అయ్యే గాయాలు సైతం ఇబ్బంది పెడుతుంటాయి. ఇది మీ సమస్య మాత్రమే కాదు. దాదాపుగా అమ్మాయిలంతా ఎదుర్కొనే సమస్యే. మరి ఇలా జరగకుండా చూసుకోవడం ఎలా? ఈ తొమ్మిది రకాల చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చు.

1. కలబంద గుజ్జు

1-razor-bumps

ADVERTISEMENT

కలబంద గుజ్టును తీసుకొని.. దాన్ని ప్రభావిత ప్రాంతంలో అంటే షేవింగ్ లేదా హెయిర్ రిమూవల్ క్రీం ఉపయోగించి అవాంఛిత రోమాలను తొలగించుకొన్న ప్రాంతంలో రాసుకోవాలి. ఆ తర్వాత.. ఐదు నిమిషాల ఆగి చల్లటి నీటితో కడిగేసుకొంటే సరిపోతుంది.

అలోవెరా గుజ్జు మంటతో పాటు, దురదను తగ్గిస్తుంది. అలాగే షేవింగ్ చేసుకోవడం వల్ల వచ్చే పొక్కులను నివారిస్తుంది. చర్మాన్ని సైతం మాయిశ్చరైజ్ చేస్తుంది. అలాగే ఇతర ఇన్ఫెక్షన్లను సైతం రాకుండా చేస్తుంది. రోజులో రెండు నుంచి మూడు సార్లు కలబంద గుజ్జును వెంట్రుకలను తొలగించుకొన్న చోట అప్లై చేసుకోవడం ద్వారా ఎలాంటి ఇబ్బంది ఎదురుపడదు.

2. తేనె

టేబుల్ స్పూన్ పెరుగులో అర టీస్పూన్ తేనె కలిపి మిశ్రమంగా చేయాలి. దీన్ని షేవింగ్ చేసుకొన్న చోట అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత.. అరగంట సేపు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను రోజుకి రెండుసార్లు పాటించడం ద్వారా షేవింగ్ వల్ల ఎదురయ్యే సమస్యలు రాకుండా ఉంటాయి. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మంటను తగ్గిస్తాయి. పెరుగు సైతం చర్మాన్ని శాంతపరుస్తుంది. అలాగే చర్మం సైతం ఎర్రగా మారదు.

ADVERTISEMENT

3. యాపిల్ సిడర్ వెనిగర్

3-razor-bumps

యాపిల్ సిడర్ వెనిగర్‌లో కొద్దిగా దూది ముంచి.. దాన్ని అవాంఛిత రోమాలు తొలగించుకొన్న చోట రాసుకొని ఆరనివ్వాలి. ఇలా రోజులో మూడు నుంచి నాలుగు సార్లు చేయాల్సి ఉంటుంది. యాపిల్ సిడర్ వెనిగర్లో ఉండే యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపు, దురద, మంటను తగ్గిస్తాయి. మీది సెన్సిటివ్ స్కిన్ అయితే చెంచా యాపిల్ సిడర్ వెనిగర్‌ను మూడు చెంచాల నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని ఉపయోగించడం మంచిది.

 

ADVERTISEMENT

4. స్ట్రాబెర్రీ పేస్ట్

స్ట్రాబెర్రీలను పేస్ట్ మాదిరిగా తయారుచేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చాపచ్చాగా ఉండేలా చూసుకోవాలి. దీన్ని పదినిమిషాల పాటు ఫ్రిజ్లో ఉంచాలి. ఆ తర్వాత ప్రభావిత ప్రాంతంలో రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొని ఆరిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా రోజుకి రెండు సార్లు రాసుకోవడం ద్వారా షేవింగ్ వల్ల ఎదురయ్యే సమస్యలను రాకుండా చూసుకోవచ్చు. 

5. బేకింగ్ సోడా

5-razor-bumps

ADVERTISEMENT

టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను కప్పు నీటిలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్ బాల్ ముంచి ప్రభావిత ప్రాంతంలో తుడుచుకోవాలి. కొన్ని నిమిషాలు ఆగిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకి రెండు, మూడు సార్లు చేయడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. బేకింగ్ సోడాలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు షేవింగ్ చేసుకోవడం వల్ల వచ్చిన చిన్న చిన్న పొక్కులను తగ్గించడం మాత్రమే కాకుండా.. ఇరిటేషన్ కలిగించే బ్యాక్టీరియాను సైతం సంహరిస్తాయి.

6. బ్లాక్ టీ

బ్లాక్ టీ బ్యాగ్‌ను రిఫ్రిజరేటర్లో ఉంచాలి. పది నిమిషాల తర్వాత దాన్ని బయటకు తీసి షేవింగ్ చేసుకొన్న చోట ఐదు నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొని పొడిగా తుడుచుకోవాలి. అనంతరం మెడికేటెడ్ మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ చిట్కా బికినీ ఏరియాలో షేవింగ్ చేసుకొన్నప్పుడు పాటిస్తే ఫలితం కనిపిస్తుంది. రోజులో నాలుగు నుంచి ఐదు సార్లు చేయడం వల్ల షేవింగ్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఉంటాయి.

7. కొబ్బరి నూనె

ADVERTISEMENT

7-razor-bumps

ప్రతి ఇంట్లోనూ కచ్చితంగా ఉండే వాటిలో కొబ్బరి నూనె కూడా ఒకటి. దీన్ని ఉపయోగించడం ద్వారా షేవింగ్ తర్వాత ఎదురయ్యే సమస్యలను అధిగమించవచ్చు. కొబ్బరి నూనెలో కాటన్ బాల్ ముంచి ప్రభావిత ప్రాంతంలో రాసుకోవాలి. పావుగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుని తుడుచుకోవాలి. రోజులో రెండు సార్లు ఈ చిట్కాను పాటించడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు. కొబ్బరి నూనెలో వివిధ రకాల స్కిన్ ఇన్ఫెక్షన్లను తొలగించే గుణాలుంటాయి. ఇవి చర్మం ఎరుపెక్కకుండా చేస్తాయి. అలాగే చర్మాన్ని సాఫ్ట్‌గా మారుస్తాయి.

8. ఓట్ మీల్

ఓట్ మీల్ పిండి చెంచా, పెరుగు అరచెంచా, తేనె కొద్దిగా తీసుకొని మూడింటిని మిశ్రమంగా చేసి అండర్ ఆర్మ్స్, బికినీ లైన్లో  అప్లై చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. రోజులో రెండు సార్లు ఈ చిట్కాను పాటించడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు. దీనికోసం మనం ఉపయోగించిన మూడు పదార్థాల్లోనూ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. ఇవి మంట తగ్గించడంతో పాటు ర్యాషెస్ రాకుండా చేస్తాయి.

ADVERTISEMENT

9. బేబీ పౌడర్

9-razor-bumps

ఇప్పటి వరకు మనం చెప్పుకొన్న చిట్కాలన్నీ షేవింగ్ చేసుకొన్న తర్వాత పాటించాల్సినవి. కానీ ఇది మాత్రం షేవింగ్ చేసుకొనే ముందు పాటించాలి. అవాంఛిత రోమాలు తొలగించుకోవాలనుకొంటున్న చోట షేవింగ్‌కి ముందు.. కాస్త బేబీ పౌడర్ అద్దుకోవాల్సి ఉంటుంది. అలాగే అవాంఛిత రోమాలను తొలగించుకొన్న తర్వాత కూడా రాసుకోవచ్చు. బేబీపౌడర్లో ర్యాషెస్ తగ్గించే గుణాలుంటాయి.

Also Read: ఫేసియల్ హెయిర్ ను సమర్థంగా తొలగించే సహజసిద్ధమైన చిట్కాలు

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

Images: Shutterstock

03 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT