చలికాలం ప్రారంభమైందంటే చాలు.. చర్మం( skin)పొడిబారిపోవడంతో పాటు పొలుసుల్లా ఊడిపోవడం జరుగుతుంటుంది. అయితే చర్మానికి తగినంతగా తేమ (moisture)ను అందిస్తే చాలు.. బయటి కాలుష్యం, దుమ్ము వంటి వాటి ప్రభావం వాటిపై పడకుండా అది కాపాడుతుంది. అయితే దీనికోసం మార్కెట్లో దొరికే ఖరీదైన మాయిశ్చరైజర్లు ఉపయోగించాల్సిన అవసరం లేదు. చాలామందికి బయట లభించే మాయిశ్చరైజర్లు (moisturizers) రాసుకుంటే రాషెస్ వస్తుంటాయి. అయితే మన వంట గదిలోనే లభించే కొన్ని రకాల పదార్థాలు ఉపయోగించి తయారుచేసుకునే మాయిశ్చరైజర్లు చర్మంలోని తేమ తగ్గకుండా కాపాడతాయి. మరి, ఆ పదార్థాలేంటో? వాటిని ఉపయోగించి చేసుకోదగిన మాయిశ్చరైజర్లు ఏంటో తెలుసుకుందాం.
1. తేనెతో అద్భుతంగా..
తేనెలో ఎన్నో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. ఇది మొటిమలను చాలా తొందరగా తగ్గిస్తుంది. చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం ముడతలు పడకుండా కాపాడతాయి. మచ్చలను కూడా తగ్గిస్తుంది. దీనితో మాయిశ్చరైజర్ ని తయారుచేసుకునేందుకు రెండు టేబుల్ స్పూన్ల తేనెను అర లీటర్ నీళ్లలో వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసుకోవాలి. పావు గంట పాటు ఉంచుకొని గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
2. పెరుగుతో..
చాలామంది పెరుగు లేకుండా భోజనం చేయరు. కానీ అందమైన చర్మం కోసం కూడా దీన్ని ఉపయోగించవచ్చని మీకు తెలుసా? యవ్వనంగా మెరిసే చర్మం తోపాటు అందంగా మారే చర్మం కోసం దీన్ని ఉపయోగించాలి. ఇందులోని లాక్టిక్ యాసిడ్ చర్మంపై ఉండే మృత చర్మాన్ని తొలగిస్తుంది. దీనికోసం ఫ్రిజ్ నుంచి బయటకు తీసిన చల్లని పెరుగుని ఒక బౌల్ లో వేసి క్లాత్ ముంచి దాన్ని ముఖం పై పరుచుకోవాలి. పావు గంట పాటు అలా ఉంచుకొని ఆ తర్వాత మరో క్లాత్ తో ముఖాన్ని తుడిచేసుకోవాలి.
3. ఆలివ్ నూనెతో..
ఒకవేళ ఎప్పుడైనా మీ ఇంట్లో సన్ స్క్రీన్ లోషన్ అయిపోతే కిచెన్ లోకి వెళ్లి చర్మానికి కొంత ఆలివ్ ఆయిల్ రాసుకోండి. ఇందులో సహజసిద్ధమైన ఆమ్లాలతో పాటు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఆలివ్ నూనె మీ చర్మానికి తేమను అందించడంతో పాటు హానికరమైన సూర్య కిరణాల బారి నుంచి మీ చర్మాన్ని కాపాడుతుంది. చర్మ కణాలను బలంగా మారుస్తుంది. దీనికోసం ఆలివ్ నూనెను నేరుగా రాసుకోవడంతో పాటు అందులో కాస్త లావెండర్ ఆయిల్ కలిసి కూడా రాసుకోవచ్చు.
4. అవకాడోతో..
మనలో చాలామందికి అవకాడో అంటే ఇష్టం. అవి చాలా రుచిగా ఉండడంతో పాటు ఎన్నో పోషకాలతో నిండి కూడా ఉంటుంది. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి మన చర్మంలో తేమను పెంచడంతో పాటు ఆరోగ్యకరమైన మెరుపును అందిస్తాయి. దీనికోసం చేయాల్సిందల్లా అవకాడోను ముక్కలుగా చేసుకొని దాంతో చర్మాన్ని రుద్దుకోవాలి. లేదంటే గుజ్జును చర్మానికి అప్లై చేసుకొని 20 నుంచి 30 నిమిషాల పాటు ఉంచుకొని ముఖం కడిగేసుకోవాలి.
5. కీర దోసతో చల్లచల్లగా..
కీర దోసలో చాలా భాగం నీళ్లే ఉంటాయి. అందుకే అది చర్మంలో తేమను పెంచి.. మాయిశ్చరైజ్ చేసేందుకు ఉపయోగపడుతుంది. రోజూ ఒక కీర దోస కాయను తినడం వల్ల చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. ఓ వారం లేదా రెండు వారాల తర్వాత అయితే పట్టులా మృదువుగా మారుతుంది. ఒకవేళ మీకు కీర దోస తినడం ఇష్టం లేకపోతే దాన్ని గుజ్జుగా చేసుకొని అందులో తేనె కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. పావు గంట పాటు ఉంచుకొని కడుక్కుంటే సరిపోతుంది.
6. కలబంద గుజ్జు తో..
కలబంద గుజ్జు ను మనమంతా ఇష్టపడేందుకు కారణం అది మన చర్మానికి అందించే తేమ.. అందులోని పోషకాలు, విటమిన్లు చర్మాన్ని అందంగా మారుస్తాయి. రాషెస్, కాలిన గాయాల నుంచి కాపాడుతాయి. ఒక కలబంద ఆకును తీసి గుజ్జుగా చేసి జెల్ తీసుకొని చర్మం పై రాసుకోవాలి. అరగంట పాటు ఉంచుకొని కడిగేసుకుంటే సరిపోతుంది.
7. కొబ్బరి నూనెతో..
కొబ్బరి నూనె కేవలం జుట్టుకు మాత్రమే కాదు.. చర్మానికి కూడా ఉపయోగపడుతుంది. ఇందులో లారిక్ యాసిడ్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ మైక్రోబియల్ గుణాలు ప్రతి ఒక్కటీ ఇందులో ఉంటాయి. దీనికోసం చేయాల్సిందల్లా కొబ్బరి నూనె తీసుకొని చర్మానికి మసాజ్ చేయడమే.. కాళ్లు చేతులకే కాదు.. ముఖానికి కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. తర్వాత బాగా మసాజ్ చేస్తే సరిపోతుంది.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.