ADVERTISEMENT
home / సౌందర్యం
Beauty School:  మట్టితో చేసిన ఫేస్ ప్యాక్.. మీ చర్మానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా?

Beauty School: మట్టితో చేసిన ఫేస్ ప్యాక్.. మీ చర్మానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా?

Beauty School:  Reasons You Should Include Clay Masks In Your Skincare Routine

మీ చర్మ తత్వానికి తగిన ఫేస్ ప్యాక్‌ని  గుర్తించడం కాస్త కష్టమైన పనే. అందుకే మీ చర్మ తత్వం ఏంటో తెలుసుకోవాలి. అలాగే మీరు ఉపయోగించే ఫేస్ ప్యాక్‌లోని పదార్థాలు.. మీ చర్మానికి సరిపడతాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. చాలామంది ఇవన్నీ తెలియకుండానే.. ఫేస్ ప్యాక్ వేసుకుంటూ ఉంటారు. దీనివల్ల సరైన ఫలితాలు దక్కవు సరికదా.. అప్పుడప్పుడూ చర్మం పై ర్యాషెస్, ఎలర్జీ వంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది.

మీ చర్మ తత్వానికి సంబంధించి ఉత్తమ ఉత్పత్తిని ఎంచుకోవడం కష్టం కావచ్చు. కానీ క్లే ఫేస్ మాస్క్‌తో ఇది చాలా సులువు. ఎందుకంటే ఇది ఏ చర్మ తత్వానికైనా..  చక్కగా నప్పుతుంది. వీటిని సహజ ఉత్పత్తులతో తయారుచేస్తారు కాబట్టి.. ఇవి చర్మాన్ని బాగా శుభ్రం చేసి మెరుపును అందిస్తాయి. అదేవిధంగా చర్మ రంధ్రాలను శుభ్రం చేసి చర్మానికి.. ఆక్సిజన్‌ని అందిస్తాయి. అయితే వీటిని వేసుకునే ముందు కొన్ని విషయాలు తీసుకోవాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

వేసుకోవడం ఇలా..

క్లే  మాస్క్ వేసుకోవడానికి, దాన్ని తొలగించడానికి సరైన పద్ధతిని పాటించాలి. లేదంటే ఇబ్బందే.

శుభ్రం చేసుకోండి..

క్లే మాస్క్ వేసుకోవడానికి ముందు.. మీ చర్మాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. దీనికోసం నీటిని మాత్రమే వాడడం మంచిది. అలాగే చేతులతో బాగా రుద్దుతూ.. నీళ్లు పోసి చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి.

మాస్క్ వేసుకోండి.

మీకు నచ్చిన క్లే మాస్క్‌ని ఎంచుకొని దాన్ని ముఖం పై సన్నని లేయర్ మాదిరిగా అప్లై చేసుకోవాలి. ముఖం, మెడకు వేర్వేరుగా దీనిని అప్లై చేసుకోవాలి. దీన్ని వేసుకోవడానికి బ్రష్ ఉపయోగించవచ్చు లేదా చేతి వేళ్లతోనే మాస్క్ వేసుకోవచ్చు.

రిలాక్స్ అవ్వండి..

క్లే మాస్క్ అప్లై చేసిన తర్వాత.. పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు దాన్ని అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత క్లే మాస్క్ ఆరిపోయి ముడతలు పడినట్లుగా తయారవుతుంది. అప్పటివరకూ దానిని అలాగే ఉంచుకోవాలి. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలి. రిలాక్స్ అవుతూ  చక్కటి పాటలు వినడం లేదా పుస్తకం చదవడం వంటివి చేయాలి. ఇలా రిలాక్స్ అవ్వలేకపోతే.. కాసేపు కళ్లు మూసుకొని నిద్రలోకి జారుకోండి.

ADVERTISEMENT

ఇలా కడుక్కోండి..

మీ ముఖంపై మాస్క్ ఆరిపోయిన తర్వాత.. దాన్ని తొలగించడం ముందు కాస్త కష్టంగానే అనిపిస్తుంది. అయితే సరైన పద్ధతి పాటిస్తే ఇది చాలా సులభం. దీనికోసం ముందుగా మీ ముఖంపై తడి టవల్‌తో కప్పుకోవాలి. లేదా నీటిలో తడిపిన టిష్యూ పేపర్స్ కప్పుకున్నా మంచిదే. ఇవి మీ ముఖంపై ఉన్న మాస్క్‌ని తిరిగి తడిగా మారేలా చేస్తాయి. తర్వాత చేతి వేళ్లను గుండ్రంగా తిప్పుతూ.. మసాజ్ చేసుకొని గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. మాస్క్ పూర్తిగా తొలగిపోయిన తర్వాత.. తిరిగి మరోసారి ముఖం కడుక్కోవాలి.

మాయిశ్చరైజర్ రాయండి..

ఈ ఫేస్ ప్యాక్ తీసేసిన తర్వాత మీ చర్మం ఫ్రెష్‌గా, అందంగా కనిపిస్తుంది. అయితే క్లే మాస్క్ వల్ల మీ ముఖం పొడిబారిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసేందుకు మంచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అప్పుడు చర్మం కూడా మృదువుగా మారుతుంది.

క్లే మాస్క్ ప్రయోజనాలు ఏంటంటే..

క్లే మాస్క్ వేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి.. అవేంటో తెలుసుకుందాం రండి..

ADVERTISEMENT

1. చర్మ రంధ్రాలు శుభ్రమవుతాయి.

ముఖానికి క్లే మాస్క్ వేసుకోవడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. అలాగే చర్మ రంధ్రాల్లో ఉన్న దుమ్ము, ధూళి, ఎక్కువగా ఉన్న నూనెలు వంటివన్నీ తొలగిపోతాయి. చర్మానికి ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది. అలాగే రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది.

2. పీహెచ్ బ్యాలన్స్ అవుతుంది.

కాస్మెటిక్స్, కెమికల్స్‌తో కూడిన పదార్థాలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల.. చర్మపు పీహెచ్ బ్యాలన్స్ తప్పుతుంది. దీనికి తోడు ఒత్తిడి, జీవన శైలి సమస్యలు, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వంటివి చర్మాన్ని డల్‌గా మారుస్తాయి. అయితే క్లే మాస్క్ వేసుకోవడం వల్ల చర్మంలో తేమ పెరుగుతుంది. పీహెచ్ బ్యాలన్స్ అవుతుంది.

3. మృత చర్మం తొలగిపోతుంది.

మన చర్మం పై కంటికి కనిపించకుండా.. మృత చర్మం లేయర్ ఉంటుంది. దీన్ని ఎప్పటికప్పుడు తొలగించకపోతే చర్మం నల్లని రంగులో డల్‌గా కనిపించడంతో పాటు.. చర్మ రంధ్రాలు మూసుకుపోయి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, మొటిమలు వంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది. అప్పుడప్పుడూ క్లే మాస్క్ వేసుకోవడం వల్ల మృత చర్మం తొలగిపోయి.. చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.

ADVERTISEMENT

4. అన్ని చర్మతత్వాలకు సరిపోతుంది.

ఇంతకుముందే చెప్పుకున్నట్లు.. అన్ని రకాల చర్మ తత్వాలకు ఈ క్లే మాస్క్‌లు నప్పుతాయి. అందుకే మీ చర్మం పొడి, ఆయిలీ, కాంబినేషన్, సెన్సిటివ్.. ఇలా ఏదైనా సరే.. మీరు క్లే మాస్క్ ఉపయోగించవచ్చు. ఇది వేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

5.చర్మం మెరిసిపోతుంది.

మీ చర్మం ఏ రంగులో ఉన్నా సరే.. క్లే మాస్క్ వేసుకోవడం వల్ల చర్మం పై మెరుపు తప్పకుండా కనిపిస్తుంది. మీ చర్మ సంరక్షణ కోసం.. అలాగే సహజమైన మెరుపు సంపాదించాలని భావిస్తే క్లే మాస్క్ వేసుకోవడం తప్పనిసరి. మంచి ఫలితాల కోసం దీన్ని వారానికి రెండు సార్లు వాడచ్చు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

28 Nov 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT