సాధారణంగా మన దేశంలో పెళ్లికి ముందు సెక్స్ (sex)లో పాల్గొనడమే కాదు.. దాని గురించి మాట్లాడడం కూడా ఒక తప్పుగా భావిస్తుంటారు. ఈ కారణంగానే పెళ్లయ్యే సమయానికి చాలామందికి సెక్స్ గురించి కనీస అవగాహన కూడా ఉండడం లేదు. ఫలితంగా తొలిసారి సెక్స్‌లో పాల్గొనే సమయానికి మనసులో ఎన్నో సందేహాలు, ఏవేవో భయాలు.. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఇవి మరింత ఎక్కువగా ఉంటాయనే చెప్పాలి. అందుకే అలాంటి వారి (beginners) కోసం మేం కొన్ని చిట్కాలు తెలియజేస్తున్నాం.. వీటిని పాటించడం ద్వారా మనసులో ఉన్న భయాలు, సందేహాలు, అపోహలు.. వంటివి తొలగిపోవడంతో పాటు సెక్స్‌ని ఆస్వాదించే వీలు కూడా ఉంటుంది. ఇంతకీ ఆ చిట్కాలేవంటే..
shutterstock
1. ప్రాక్టీస్.. ప్రాక్టీస్.. ప్రాక్టీస్..
మనం తొలిసారి ఒక పని చేసేటప్పుడు అది పర్ఫెక్ట్‌గా రావాలని అంతా ఆశిస్తారు. కానీ అది కేవలం ప్రాక్టీస్‌తోనే సాధ్యమవుతుందని గుర్తుంచుకోండి. కాబట్టి తొలిసారి సెక్స్‌లో పాల్గొన్నప్పుడు అంతా పర్ఫెక్ట్‌గా ఉండాలని అనుకోకండి. కాలక్రమేణా పర్ఫెక్షన్ దానంతటదే వస్తుందని తెలుసుకోండి.
2. సినిమాల్లో చూసింది మరచిపోండి..
సెక్స్ అనగానే చాలామందికి ముందుగా గుర్తుకొచ్చేది సినిమాల్లో చూసిన రొమాంటిక్ సీన్స్. వాటినే తమ లైంగికపరమైన కలయిక సమయంలో ఫాలో అవ్వడం ద్వారా అందమైన అనుభూతి సొంతం చేసుకోవాలనుకునేవారు చాలామందే ఉంటారు. కానీ దీని వల్ల నిరాశ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి సినిమాల్లో చూసినదంతా మరచిపోండి. మీరు మీలా ఉంటూనే మీ భాగస్వామితో మీ ఇష్టప్రకారం నడుచుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వండి.
3. సమయస్ఫూర్తితో వ్యవహరించండి..
సెక్స్‌లో మొదటిసారి పాల్గొన్నప్పుడు భాగస్వామితో శారీరకంగా బాగా సన్నిహితంగా మెలగాల్సి ఉంటుంది. ఈ క్రమంలో దంపతుల ఇరువురి మధ్య ఓ బంధం ఏర్పడుతుంది. ఈ సమయంలో శారీరకంగానూ ఒకరితో మరొకరు కలిసేందుకు కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి రావచ్చు. ముఖ్యంగా ఎలాంటి పరిస్థితి ఎదురైనా మీకున్న సమయస్ఫూర్తితో దానిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి.
4. ఆందోళన వద్దు..
ఏదైనా పని మొట్టమొదటిసారి చేసినప్పుడు అది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అని ఆందోళన చెందడం సహజమే. ఎలాంటి ఆందోళన లేకుండా సౌకర్యవంతంగా మీరు చేయాలనుకున్నది మీరు చేస్తే తర్వాత పశ్చాత్తాపం చెందాల్సిన అవసరం ఉండదు.
Tumblr
5. ఫోర్ ప్లే..
కలయికలో పాల్గొనడానికి ముందు ఫోర్ ప్లే చేయడం చాలా ముఖ్యం. ఇది దంపతులు ఇరువురిలోనూ లైంగికపరమైన కోరికను మరింత ఎక్కువగా రగిలించి సుఖతీరాలు చేరుకునేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మీరు ఎంత బాగా ఫోర్ ప్లే చేస్తే సెక్స్‌ని అంత బాగా ఎంజాయ్ చేయచ్చు.
6. ల్యూబ్రికెంట్స్ వాడండి..
చాలామందికి తొలిసారి కలయికలో పాల్గొన్నప్పుడు జననేంద్రియాల వద్ద పొడిగా ఉండడం వల్ల బాధగా అనిపించవచ్చు. ఈ సమస్య నుంచి బయట పడేందుకు ల్యూబ్రికెంట్స్ సహాయం తీసుకోవచ్చు. ముఖ్యంగా వాటర్ బేస్డ్ ల్యూబ్రికెంట్స్ ఉపయోగించడం వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా సెక్స్‌ని ఎంజాయ్ చేయడమే కాదు.. శరీరంలో విడుదలయ్యే ఎండార్ఫిన్ల కారణంగా సంతోషంగానూ ఉండచ్చు.
7. కండోమ్ ఉపయోగించండి..
శారీరకంగా సుఖం, సంతోషం పొందడం ఎంత ముఖ్యమూ శ్రుంగారంలో పాల్గొనే సమయంలో సురక్షితంగా ఉండేందుకు రక్షణ పద్ధతులను ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి కండోమ్‌ని తప్పనిసరిగా వాడండి. దీని ద్వారా అవాంఛిత గర్భధారణను కూడా నివారించవచ్చు.
8. భాగస్వామితో సఖ్యంగా మెలగండి..
సెక్స్‌ని ఆస్వాదించాలంటే అందుకు తగిన మూడ్ కూడా ఉండాల్సిందే. ఒకవేళ మీకు ఏవైనా ఇబ్బందులు, సమస్యలు వంటివి ఉంటే వాటి గురించి మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి. ఇది మీ మధ్య బంధాన్ని మరింత బలపడేలా చేస్తుంది.
Tumblr
9. ఒత్తిడికి పరీక్ష..
చాలామంది ఒత్తిడి ఎక్కువగా ఉందన్న కారణంతో సెక్స్ లైఫ్‌కి దూరంగా ఉంటూ ఉంటారు. కానీ నిజానికి ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడే సెక్స్‌లో పాల్గొనడం ద్వారా దాని నుంచి సులభంగా బయటపడవచ్చన్నది సెక్సాలజిస్ట్‌ల సలహా. ఒకవేళ ఒత్తిడి మరీ అధికంగా ఉంటే దాని నుంచి విముక్తి పొందేందుకు చక్కని టబ్ బాత్ లేదా మసాజ్ వంటివి ప్రయత్నించి చూడండి.
10. మీ గురించి మీరు తెలుసుకోండి..
మీ గురించి మీరు తెలుసుకునేందుకు తప్పకుండా కాస్త సమయం కేటాయించుకోండి. మీ ఇష్టాయిష్టాలేంటో మీకే తెలియకపోతే మీ భాగస్వామికి మాత్రం ఎలా అర్థమవుతాయి చెప్పండి? అందుకే కాస్త సమయం కేటాయించి మీ గురించి మీరు పూర్తిగా తెలుసుకోండి.
11. సిద్ధంగా ఉండండి..
సెక్స్‌లో తరచూ పాల్గొంటున్నప్పటికీ మీకు ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించి వాటిని నివ్రుత్తి చేసుకునేందుకు సిద్ధంగా ఉండండి. ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఆరోగ్యకరమైన లైంగిక జీవితాన్ని కొనసాగించేందుకు అవసరమైన పరిశోధన చేయండి.
Tumblr
12. తక్కువ లైటింగ్‌లో..
కలయికలో పాల్గొనే సమయానికి మూడ్ కూడా అందుకు తగినట్లుగానే ఉండాలి. ఇందుకోసం పడక గదిలో తక్కువ లైటింగ్ ఉండేలా చూసుకోవడం, పరిమళద్రవ్యాలతో గదిని నింపడం.. వంటివి చేయాలి. ఇలాంటి చిన్న చిన్న ఏర్పాట్లే మూడ్‌ని మార్చి సెక్స్ లైఫ్‌ని మరింత ఎంజాయ్ చేసేలా చేస్తాయి.
13. రిలాక్స్డ్‌గా ఉండండి..
లైంగికపరమైన కలయికను ఆస్వాదించాలంటే అందుకు మనసు ప్రశాంతంగా ఉండడం కూడా చాలా అవసరం. కాబట్టి వీలైనంత మేరకు రిలాక్స్డ్‌గా ఉండడానికి ప్రయత్నించండి.
14. చిన్న చిన్న అవాంతరాలు..
మనం ముందుగా చెప్పుకున్నట్లే సెక్స్ అనేది సినిమాల్లో చూసినంత స్మూత్‌గా సాగిపోదు. చిన్న చిన్న అవాంతరాలు ఎదురవుతుంటాయి. వాటి కారణంగా తిరిగి మొదట్నుంచీ ప్రక్రియ ప్రారంభించాల్సి రావచ్చు. అయితే ఇదంతా ఫన్‌లో భాగంగానే భావించాలి.
Tumblr
15. భిన్నమైన పద్ధతులు..
సెక్స్ లైఫ్‌ని రొటీన్‌గా కాకుండా కాస్త భిన్నంగా ఎంజాయ్ చేయాలనుకునేవారు హ్యాండ్ కఫ్స్, తాళ్లు, కళ్లకు గంతలు.. వంటివి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇలాంటివి ఏవి ఉపయోగించినా అది ఇద్దరి ఇష్టప్రకారం మేరకు మాత్రమే ఉపయోగించాలి.
16. పోర్న్ చూడకండి..
ఈ రోజుల్లో సెక్స్‌కు సంబంధించిన రకరకాల వీడియోలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటున్నాయని మనందరికీ తెలుసు. అయితే రియల్ లైఫ్‌లో సెక్స్‌ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఇలాంటి పోర్న్ వీడియోలను చూడకపోవడమే మంచిది.
17. సిగ్గు పడకండి..
సెక్స్‌లో పాల్గొనే సమయంలో సిగ్గు పడడం సహజమే. కానీ అందులోని ఆనందాన్ని పూర్తిగా చవిచూడాలంటే క్రమంగా సిగ్గుని పక్కన పెట్టి సెక్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. అప్పుడే అందులోని మధురిమలను ఆస్వాదించగలం.
Tumblr
18. అవగాహన కలిగి ఉండండి..
సెక్స్ గురించి కనీస అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యం. ఇందుకోసం అవసరమైన పుస్తకాలు చదవడం, సెక్స్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన వీడియోలు చూడడం వంటివి చేయండి. ఫలితంగా భవిష్యత్తులో భాగస్వామితో చక్కని బంధం ఎలా ఏర్పరుచుకోవాలో ఓ అవగాహన ఏర్పడుతుంది.
ఇవి కూడా చదవండి
ఆలుమగలు రోజూ శృంగారంలో పాల్గొనడం.. ఎందుకు మంచిదో తెలుసా?