పాలు ఇవ్వడం వల్ల.. తల్లీబిడ్డలకు ఎలాంటి ప్రయోజనాలుంటాయో మీకు తెలుసా?

పాలు ఇవ్వడం వల్ల.. తల్లీబిడ్డలకు ఎలాంటి ప్రయోజనాలుంటాయో మీకు తెలుసా?

ఈ ప్రపంచంలో బిడ్డను  తల్లి (Mother) ప్రేమించినంతగా మరెవరూ ప్రేమించలేరేమో. అందుకే తన ప్రేమనంతటినీ రంగరించి పాలు పట్టి బిడ్డను పెంచుతుంది తల్లి. అమ్మ ప్రేమ నిండిన ఆ పాలు.. బిడ్డకు అమృతం లాంటివి. తల్లీబిడ్డల మధ్య బంధం పెరగడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి.

పుట్టగానే మొదటిసారి వచ్చే ముర్రుపాలలో.. బిడ్డ జీవితాన్ని కాపాడే, రోగ నిరోధక వ్యవస్థను పెంపొందించే ఎన్నో పోషకాలు అందుబాటులో ఉంటాయి. ఎక్కువ ప్రొటీన్లు, తక్కువ చక్కెరలు ఉండే ఈ పాలు బిడ్డకు సులువుగా అరుగుతాయి కూడా. తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ తల్లిపాల వారోత్సవాలలో (Breast Feeding Week) భాగంగా.. ఈ కథనంలో పాలివ్వడం వల్ల తల్లీ బిడ్డలకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

గ్రీన్ టీ కేవ‌లం అందానికే కాదు.. ఆరోగ్యానికీ మంచిదే..! (Benefits Of Green Tea For Health, Hair And Beauty)

తల్లి పాలు తాగడం వల్ల పిల్లలకు అందే ప్రయోజనాలు

Shutterstock

1. తల్లిపాలు బిడ్డ రోగ నిరోధక వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాయి. అంతేకాదు.. ప్రాణాంతకమైన ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి వారిని కాపాడుతాయి. కొన్ని పరిశోధనల ప్రకారం పోత పాలకు బదులు కేవలం తల్లి పాలు మాత్రమే తాగిన పిల్లలకు టైప్ 1 డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్లు, చెవి ఇన్ఫెక్షన్లు, జలుబు, జ్వరాలు వంటివన్నీ దూరంగా ఉంటాయని సమాచారం.

2. నెలలు నిండకుండానే పుట్టిన పిల్లలకు.. కేవలం తల్లిపాలు మాత్రమే అందిస్తే.. పెద్దయ్యాక సాధారణంగా వచ్చే అధిక రక్తపోటు వంటి సమస్యలు.. ఈ పిల్లలకు రాలేదని చాలా పరిశోధనల్లో తేలింది.

3. తల్లిపాలు పట్టడం వల్ల బిడ్డ తెలివితేటలు, ఐక్యూ కూడా పెరుగుతాయట.

4. బిడ్డ పుట్టిన తర్వాత నెల రోజుల పాటు.. కేవలం తల్లి పాలు మాత్రమే తాగించడం చాలా శ్రేయస్కరం.   సిడ్స్ (సడెన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్) వల్ల సంభవించే పసిపిల్లల మరణాల రేటు 50% తగ్గడానికి కారణం.. తల్లి పాల మహత్యమే.

5. తల్లి పాలు తాగిన పిల్లలు ఆకలి తీరేవరకూ.. ఆహారం తీసుకోవడంలో ముందుంటారట. దీనివల్ల వారు పెద్దవాళ్లైన తర్వాత కూడా.. ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లనే కొనసాగిస్తారట.

ఆడ‌పిల్ల‌లంటే ఎప్పుడూ ప్ర‌త్యేక‌మే..! ఎందుకో మీకు తెలుసా??

పిల్లలకు పాలు పట్టడం వల్ల తల్లికి కలిగే ప్రయోజనాలు

shutterstock

తల్లిపాల వల్ల కేవలం బిడ్డకే కాదు. తల్లికి కూడా చాలా ప్రయోజనాలున్నాయి. అవేంటంటే..

1. తల్లి పాలు ఇవ్వడం వల్ల.. గర్భం ధరించిన తర్వాత పెరిగిన బరువు తిరిగి తగ్గే వీలుంటుంది. చాలామంది సెలబ్రిటీలు కూడా ప్రసవం తర్వాత.. తాము తిరిగి ఫిట్‌గా మారేందుకు పాలిచ్చే అలవాటు బాగా తోడ్పడిందని చెబుతుంటారు.

గతేడాది నటి లీసా హెడెన్ తాను బిడ్డకు పాలిస్తున్న ఫొటోను షేర్ చేశారు. తద్వారా తల్లి పాల ప్రయోజనాల గురించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. "ప్రసవం తర్వాత.. నా శరీరాకృతి మారేందుకు పాలివ్వడం ఎంతగానో తోడ్పడింది. అది చాలా ఛాలెంజింగ్ టాస్క్. ఎందుకంటే చాలా సమయం తీసుకుంటుంది. కానీ తల్లీబిడ్డల బంధాన్ని పెంపొందించడంలో.. తల్లి పాల పాత్ర చాలా ముఖ్యమైనది. మీకు బిడ్డతో గడిపేందుకు చాలా సమయం దొరకడంతో పాటు.. బిడ్డకు కూడా ఎన్నో పోషకాలతో నిండిన పాలు దొరుకుతాయి" అంటూ పోస్ట్ చేశారు లీసా హెడెన్. 

2. బిడ్డకు తల్లిపాలు పట్టడం వల్ల చాలా డబ్బు మిగలడంతో పాటు.. ఎప్పుడు కావాలంటే అప్పుడు బిడ్డకు సరైన ఉష్ణోగ్రతతో ఉన్న పాలు.. ఎలాంటి ఇన్ఫెక్షన్ల భయం లేకుండా అందించే వీలుంటుంది.

3. బిడ్డకు పాలు పట్టిన తల్లుల్లో రొమ్ము, ఒవేరియన్ క్యాన్సర్లు వచ్చే ముప్పు చాలా తక్కువగా ఉంటుంది.

4. ప్రసవం తర్వాత బిడ్డలకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇచ్చే తల్లుల్లో.. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. పాలు పట్టేటప్పుడు విడుదలయ్యే ఫీల్ గుడ్ హార్మోన్ల వల్లే ఇది సాధ్యమవుతుంది.

5. బిడ్డతో సమయం గడిపేందుకు.. మీ ఇద్దరి మధ్య బలాన్ని మరింతగా పెంచేందుకు ఇది చక్కటి మార్గం.

బిడ్డకు పాలు పట్టిన ఓ తల్లిగా నా అనుభవం ప్రకారం - "బిడ్డకు తల్లి పాలు పట్టడం వల్ల మనకు కూడా ఎంతో సంతృప్తి, సంతోషం కలుగుతాయి. మీ బిడ్డకు మీరు అందించగలిగే అత్యుత్తమమైన బహుమతి వారికి ఆరోగ్యాన్ని అందించడమే కదా"

పుట్టిన తర్వాత కొన్ని నెలల పాటు తల్లి పాలు పట్టడం ద్వారా.. జీవితాంతం ఆరోగ్యం బాగుంటుందట. మీ పాలు తాగుతూ.. మీ పిల్లలు రోజురోజుకీ యాక్టివ్‌గా తయారవడం చూస్తుంటే సింపుల్ గా ఉన్న ఈ ప్రక్రియ ఎంత శక్తిమంతమైనదో అర్థమవుతుంది. మీ బిడ్డ ఆరోగ్యంగా నవ్వుతూ ఆడుకుంటుంటే.. మిమ్మల్ని మీరు మెచ్చుకోకమానరు.

#ToMaaWithLove మీ అమ్మ కూడా.. ఈ డైలాగ్స్ తప్పనిసరిగా చెప్పే ఉంటారు కదా..!

పాలు పడేందుకు తీసుకోవాల్సిన ఆహారం

shutterstock

తల్లిపాలు బిడ్డకు వరం లాంటివి. కానీ అందరి తల్లుల్లో బిడ్డకు సరిపడా పాలు పడకపోవచ్చు. ఇలాంటప్పుడు కూడా తల్లికి ఉన్న ఏకైక మార్గం బిడ్డకు పాలు పట్టేందుకు ప్రయత్నించడమే. బిడ్డ పాలు చీకుతూ ఉంటే.. మరింత ఎక్కువగా పాలు వస్తూ ఉంటాయి. దీంతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా పాలు ఎక్కువగా పడే వీలుంటుంది. అవేంటంటే..

1. ఓట్ మీల్
2. వెల్లుల్లి
3. పచ్చి బొప్పాయి
4. కూరగాయలు, ఆకుకూరలు
5. అరటి, మామిడి, తర్బూజా లాంటి పండ్లు
6. మెంతులు
7. గింజలు, డ్రైఫ్రూట్స్

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.