ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న “సాహో” సినిమా ట్రైలర్ విడుదలైంది. బాహుబలి లాంటి ప్రాజెక్టు సూపర్ హిట్ అయ్యాక.. “సాహొ” (Saaho) చిత్రంతో మొత్తం భారతీయ చలన చిత్ర పరిశ్రమను తనవైపు చూసేలా చేయడంలో ప్రభాస్.. మళ్లీ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ఈ క్రమంలో మనం కూడా ఈ సినిమా లేటెస్ట్ ట్రైలర్ లోని టాప్ 20 ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాం.. !
1. ట్రైలర్ మొదట్లో ముంబయిలో జరిగిన రూ. 2000 కోట్ల రాబరీ గురించి ప్రస్తావన ఉంది. దీనిని బట్టి ఇది పక్కా క్రైం థ్రిల్లర్ అని ఇట్టే చెప్పేయవచ్చు. అయితే ఇలాంటి సినిమాలు ప్రభాస్‌కు కొత్త కాదు. గతంలో “బిల్లా” లాంటి అద్భుతమైన క్రైం థ్రిల్లర్‌లో నటించిన ప్రభాస్.. ఈసారి మరో భారీ బడ్జెట్ క్రైం థ్రిల్లర్‌కు సైన్ చేశాడంటే.. ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసమేనని అనుకోవచ్చు.
2. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ అండర్ కవర్ ఆఫీసర్ రోల్ పోషించే అవకాశం ఉందని.. ట్రైలర్ కచ్చితంగా ఓ క్లూ ఇస్తోంది. అది ఎంత వరకు నిజమో సినిమా విడుదల అయితే కానీ తెలియదు. ఇప్పటి వరకూ ధూమ్ సిరీస్ సినిమాలను రుచి చూసిన బాలీవుడ్ సినిమా అభిమానులకు సైతం.. ప్రభాస్‌ను క్రైం థ్రిల్లర్‌లో చూడడం ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్.
3. “వాడు ఫీల్ గుడ్ మూవీకి ముందు వచ్చే.. ఓ స్మోకింగ్ యాడ్ లాంటి వాడు సార్. కంటెంట్ కరెక్టుగా ఉన్నా.. మిషన్ చాలా డిస్టర్బ్‌గా ఉంటుంది”.. ఈ ట్రైలర్‌లో ఈ డైలాగ్‌ను మురళీ శర్మ పాత్ర చెబుతుంది. అంటే హీరో చాలా డేంజరస్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి అని అర్థమవుతోంది కదా.
4. అలాగే ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్ కూడా.. అమృతా నాయర్ అనే ఒక క్రైం బ్రాంచ్ ఆఫీసర్ పాత్రను పోషిస్తోంది. అదేవిధంగా అనేక యాక్షన్ సన్నివేశాలను చిత్ర దర్శకుడు హీరోయిన్ మీద కూడా చిత్రీకరించడం విశేషం.
5. అలాగే ఈ సినిమాలో ఓ విదేశీ నగరం ప్రధాన పాత్ర పోషిస్తోందని తెలుస్తోంది. దానికి ఈ కథకు చాలా దగ్గర సంబంధం కూడా ఉంటుంది. ఆ నగరం గురించే ఈ సినిమాలో నటుడు నీల్ నితిన్ ముఖేష్ మాట్లాడుతూ “ది సిటీ ఆఫ్ పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్స్” అని పేర్కొన్నారు.
ప్రభాస్ ‘సాహో’ టీజర్‌లో.. మీరు చూడాలనుకునే ‘7’ అంశాలు ఇవేనా!
6. అలాగే అరుణ్ విజయ్ పాత్ర చేత ఒక ముఖ్యమైన “కీ” గురించి చెప్పిస్తారు. ఆ “కీ” ఈ చిత్రంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుందని.. ట్రైలర్ చూసిన వారికి అనిపించక మానదు.
7. నీల్ నితిన్ ముఖేష్ ఒక గ్యాంగ్‌స్టర్ అని ట్రైలర్ చూసిన వారికి.. ఎవరికైనా కచ్చితంగా అర్థమవుతుంది.
8. బార్‌లో ప్రకాష్ బెలావడీ పాత్రతో.. ముఖేష్ మాట్లాడిన తీరు బట్టి చూస్తే.. ఒక భారీ స్కాంకు విలన్స్ రూపకల్పన చేస్తున్నారని కూడా అనిపించక మానదు. “ఐ యామ్ ఫ్రీకింగ్ బిలియనీర్ మైండ్” అని ముఖేష్ అనడమే దానికి నిదర్శనం.
9. ఒక చీకటి గదిలోకి సింహం రావడం.. అలాగే చైన్లతో ఎవరినో బంధించడానికి ట్రై చేయడం..ముఖ్యంగా హీరో ఓ గదిలో చిక్కుకోవడం.. ఇవన్నీ కూడా ట్రైలర్‌లో సస్పెన్స్ యాడ్ చేయడం కోసం పెట్టారని చెప్పకనే చెబుతున్నాయి.
10. అలాగే హీరోతో “జీవితంలో వయలెన్స్ ఎక్కువ అయిపోయింది.. రొమాన్స్ కావాలి” అని చెప్పించడం.. ఈ థ్రిల్లర్‌లో కూడా ఒక ప్రేమకథ సమాంతరంగా నడుస్తుందని చెప్పడానికి చేసే ప్రయత్నమే.
11. ఇక “బేబీ.. వాంట్ టు టెల్ మీ” సాంగ్ ఈ ట్రైలర్‌కే ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. వివిధ ఫారిన్ లొకేషన్లలో హీరో, హీరోయిన్లు చేసే రొమాన్స్‌ను పిక్చరైజేషన్ చేసిన తీరు అద్భుతం.
12. ఈ సీన్ తర్వాత వచ్చే సీన్స్.. ఒక రివెంజ్ డ్రామా యాంగిల్ కోణాన్ని మనకు చూపిస్తున్నాయి. వీటి ద్వారా ఒక ఇమోషనల్ ఫీలింగ్‌ను దర్శకుడు చూపించడానికి ట్రై చేశాడు. ముఖ్యంగా గాయాలతో ఉన్న హీరోను చూపిస్తూ.. అపస్మారక స్థితిలో ఉన్న హీరోయిన్‌ను ఎవరో ఈడ్చుకెళ్తున్నట్లు చూపించారు. ఆ తర్వాత కథానాయిక వాయిస్ ఓవర్‌ను మనకు వినిపించారు. “మనం డే అండ్ నైట్ లాాంటివాళ్లం. ఒకరు వస్తే మరొకరు వెళ్లిపోవాలి. రెండూ ఎప్పటికీ కలవవు మనలా” అని ఆమె బాధగా చెప్పే తీరుకు.. ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యారు.
13. తర్వాత విలన్ చేత కూడా “చూశావుగా నా మాస్టర్ స్ట్రోక్.. ఇట్ ఈజ్ సిక్సర్” అని చెప్పించడం కూడా.. ఈ సినిమాలో రివెంజ్ యాంగిల్ ఉందని కచ్చితంగా చెప్పడమే.
14. తర్వాత.. హీరో ఓ కొండ పై నుండి దూకుతున్నట్లు చూపించారు. కనుక.. విలన్స్‌ను ఛేజ్ చేయడం ఒక ఎత్తైతే.. హీరో దొరక్కుండా తప్పించుకోవడానికి కూడా వేసే ఎత్తులు ఈ సినిమాలో ఎక్కువే అని చెప్పచ్చు.
15. ఈ సీన్ తర్వాత.. ప్రభాస్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ చాలా కొత్తగా ఉంది. “గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడా.. స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటుంది” అని హీరో చెప్పిన డైలాగ్ ఈ ట్రైలర్‌కే హైలట్.
ప్రభాస్ డై – హార్డ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చేలా సాగే సాహో టీజర్ టాక్ మీకోసం..
16. ఈ సీన్ తర్వాత వచ్చే యాక్షన్ సీన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా బైక్ మీద తీసిన యాక్షన్ సన్నివేశాలు చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అలాగే సీ డైవింగ్, హెలికాప్టర్‌ను వేలాడుతూ వెళ్లడం.. ఇవన్నీ కూడా హాలీవుడ్ సినిమాలను తప్పకుండా తలపిస్తాయి.
17. అలాగే డబ్ల్యుడబ్ల్యుఎఫ్ ప్లేయర్స్‌ను తలపించే రీతిలో ఉన్న విదేశీ విలన్స్‌తో ఫైట్స్.. యాక్షన్ సీన్లకు ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చాయి.
18. అదే విధంగా హీరోయిన్, హీరో మీద గన్ ఎక్కుపెట్టి.. కాల్చడానికి ప్రయత్నించడం వెనుక కూడా అనేక కారణాలను మనం చూడవచ్చు. “ఇక్కడ కాల్చడానికి ఏం లేదు” అని చెప్పడం.. ఆ తర్వాత మళ్లీ హీరో మెదడు మీద గన్ పెట్టి “అంతా ఇక్కడే ఉంది” చెప్పడం.. ఇది కథానాయకుడు ఆడుతున్న బ్రెయిన్ గేమ్‌కు నిదర్శనం అని సింబాలిక్‌గా చెబుతున్నట్లు ఉంది.
19.ట్రైలర్‌లో హీరోకి సంకెళ్లు వేసి తీసుకెళ్లడం.. మనల్ని సంశయంలో పడేసే సన్నివేశం. అండర్ కవర్ ఆఫీసరుగా వచ్చిన వ్యక్తి నిజంగా ప్రభాస్‌యేనా.. లేదా ప్రభాస్ పాత్ర ఏదైనా రాబిన్ హుడ్ పాత్రను పోలి ఉందా.. అనే అనుమానం మనకు కూడా కలుగుతుంది.
20. అక్కడక్కడ ఈ సినిమా ట్రైలర్‌లో బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్, మందిరా బేడీ లాంటి వారిని కూడా చూపించారు. అయితే వారి పాత్రలపై అంత క్లారిటీ ఇవ్వలేదు. వాళ్లు కూడా గ్యాంగ్‌స్టర్స్ మూకలోని వారేనా.. లేదా సీక్రెట్ ఏజెంట్లకు వారికి సంబంధం ఉందా.. అనేది సినిమా విడుదల అయితే కానీ తెలియదు.
ప్రభాస్ “సాహో” ఫస్ట్ సాంగ్.. “ఆగడిక సైకో సయ్యా” లిరిక్స్ మీకోసం..!
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.